News


లాభాల బాటలో అశోక్‌ లేలాండ్‌

Friday 4th October 2019
news_main1570173631.png-28718

హిందుజా గ్రూపునకు చెందిన అశోక్‌‌‌‌ లేలాండ్‌‌‌‌ కంపెనీ షేర్లు శుక్రవారం 7.50శాతం లాభపడ్డాయి. నేడు బీఎస్‌ఈలో ఈ షేర్లు రూ.68.60 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. మార్కెట్‌ ప్రారంభం నుంచి ఈ షేర్లకు డిమాండ్‌ పెరగడంతో షేర్లు లాభాల బాటపట్టాయి. ఒక దశలో 7.50శాతం ర్యాలీ చేసి రూ.72.65 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని అందుకుంది. మధ్యాహ్నం గం.12:00లకు క్రితం ముగింపు(రూ.67.60) ధరతో పోలిస్తే 3.50శాతం లాభంతో రూ.70.05 వద్ద ట్రేడ్‌ అవుతోంది. కాగా షేర్లు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.56.95లు, రూ.123.00లుగా నమోదయ్యాయి.

లార్జ్‌ క్యాప్‌ చెందిన ఈ కంపెనీ షేర్లు తక్కువ స్థాయి ధర వద్ద కొంత ఒడిదుడుకులను లోనవుతోంది. అయితే, రానున్న రెండేళ్ల కాలానికి రూ.60-65ల స్థాయిలో కొనుగోలు మంచి ఆదాయాల్ని ఇస్తుంది. మొత్తం వాణిజ్య వాహన పరిశ్రమలో ఒక చక్రీయ అప్‌సైకిల్‌ను చూసినపుడు, ఈ మదింపులో అశోక్ లేలాండ్‌లో  పెట్టుబడి పెట్టడానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుందని మార్కెట్‌ విశ్లేషకలు అభిప్రాయపడుతున్నారు. 
 



You may be interested

జీడీపీ అంచనాలను 6.1% తగ్గించిన ఆర్‌బీఐ; 25 బీపీఎస్‌ రేట్‌ కట్‌

Friday 4th October 2019

  ఆర్‌బీఐ(రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) గవర్నర్‌ శక్తికాంత్‌ దాస్‌ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల మానిటరీ పాలసీ కమిటీ(ఎంపీసీ)  పాలసీ సమీక్షలో భాగంగా రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించి 5.15 శాతానికి పరిమితం చేసింది. అంతేకాకుండా ద్రవ్యోల్బణం అదుపులో ఉందని, ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా ఎంపీసీ వ్యవహరిస్తుందని ఆర్‌బీఐ పాలసీ కమిటీ తెలిపింది. ఎంపీసీ సభ్యులందరూ పాలసీ రెపో రేటును తగ్గించడానికి అనుకూలంగా ఓటు వేశారు. ఈ

పాలసీ ఎఫెక్ట్‌....బ్యాంకింగ్‌, ఆటో షేర్ల ఒడిదుడుకులు

Friday 4th October 2019

ఆర్‌బీఐ వరుసగా ఐదోసారి వడ్డీరేట్ల కోత తగ్గింపు తరువాత బ్యాంకింగ్‌, అటో, రియల్టీ షేర్లు తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. వడ్డీరేట్ల ప్రకటన అనంతరం ఆయా రంగాలకు చెందిన షేర్లు ఉదయం ఆర్జించిన లాభాల్ని కోల్పోతున్నాయి. ఆర్‌బీఐ అంచనాలకు తగ్గట్లుగానే  వడ్డీరేట్లను తగ్గించడంతో మార్కెట్‌ సెంటిమెంట్‌ను ఉత్సాహపరచడంలో విఫలమైంది. ఫలితంగా ఈ రంగ షేర్లను విక్రయించేందుకు ట్రేడర్లు మొగ్గచూపుతున్నారని సామ్కో సెక్యూరిటీస్ రీసెర్చ్‌ హెడ్‌ ఉమేశ్‌ మెహతా అభిప్రాయపడ్డారు. ఎన్‌ఎస్‌ఈలో అటోరంగ

Most from this category