News


ఐదు కంపెనీల్లో వాటాలు పెంచుకున్న కచోలియా

Wednesday 30th October 2019
Markets_main1572376766.png-29213

ప్రముఖ సీనియర్‌ ఇన్వెస్టర్‌ ఆశిష్‌ కచోలియా సెప్టెంబర్‌ త్రైమాసికంలో తన పోర్ట్‌ఫోలియో పరంగా పలు మార్పులు, చేర్పులు చేశారు. ముఖ్యంగా ఐదు కంపెనీల్లో ఆయన వాటాలు పెంచుకున్నట్టు డేటాను పరిశీలిస్తే తెలుస్తోంది. స్మాల్‌, మిడ్‌క్యాప్‌ విభాగంలో దాగి ఉన్న ఆణిముత్యాల్లాంటి షేర్లను గుర్తించడంలో కచోలియాకు మంచి పేరుంది. కనుక ఆయన పోర్ట్‌ఫోలియోను గమనించడం ద్వారా రిటైల్‌ ఇన్వెస్టర్లు తమ పెట్టుబడికి సంబంధించి కొన్ని సంకేతాలను అర్థం చేసుకోవడానికి వీలుంటుంది. 

 

మాజెస్కో, కేపీఐటీ టెక్నాలజీస్‌, డీఎఫ్‌ఎం ఫుడ్స్‌ కంపెనీల్లో ఆశిష్‌ కచోలియా తన వాటాలను పెంచుకున్నారు. అలాగే, ఎంఎస్‌టీసీ, అపోలో పైప్స్‌లోనూ ఆయన వాటా పెరిగింది. డీఎఫ్‌ఎం ఫుడ్స్‌లో వాటా 2.23 శాతం నుంచి 2.85 శాతానికి పెరిగింది. కేపీఐటీ టెక్నాలజీస్‌లో 1.56 శాతం నుంచి 1.65 శాతానికి, మాజెస్కోలో 2.59 శాతం నుంచి 3.14 శాతానికి కచోలియా వాటా పెంచుకున్నారు. కచోలియా వాటాలు పెంచుకున్న ఐదు కంపెనీల్లో నాలుగు ఈ ఏడాది ఇంత వరకు ప్రతికూల రాబడులను ఇచ్చినవే. అంటే తాను విశ్వసించే కంపెనీల షేర్లను తక్కువ ధరల్లో ఆయన మరి కాస్త అదనంగా కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. మాజెస్కో 18 శాతం, ఎంఎస్‌టీసీ 15 శాతం, కేపీఐటీ టెక్నాలజీస్‌ 12 శాతం, అపోలో పైప్స్‌ 7 శాతం వరకు నష్టపోయాయి.


 
ఇక మూడు కంపెనీల్లో కచోలియా కొంత మేర వాటాలను తగ్గించుకున్నారు. మిర్క్‌ ఎలక్ట్రానిక్స్‌, వీ2రిటైల్‌, హికాల్‌ కంపెనీల్లో ఆశిష్‌ కచోలియా వాటాలు తగ్గించుకోవడాన్ని గమనించొచ్చు. మిర్క్‌ ఎలక్ట్రానిక్స్‌ ఈ ఏడాది ఇంత వరకు 70 శాతం మేర పడిపోయింది. ఒనిడా బ్రాండ్‌ పేరుతో ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తులను మిర్క్‌ ఎలక్ట్రానిక్స్‌ మార్కెట్‌ చేస్తోంది. ఇక​ 11 కంపెనీల్లో కచోలియా వాటాల పరంగా ఎటువంటి మార్పులు చోటు చేసుకోలేదు. ఎంఎస్‌టీసీ అన్నది ట్రేడింగ్‌ కార్యకలాపాల్లో నిర్వహించే ప్రభుత్వరంగ కంపెనీ. అపోలో పైప్స్‌ సీపీవీసీ, యూపీవీసీ పైపులు, హెచ్‌డీపీఈ, ప్లంబింగ్‌ పైపులు, ఫిట్టింగ్‌లను తయారు చేసే కంపెనీ. డీఎఫ్‌ఎం ఫుడ్స్‌ అన్నది స్నాక్స్‌ కంపెనీ. You may be interested

ఈ బ్యాంకు స్టాక్స్‌లో బంపర్‌ లాభాలు

Wednesday 30th October 2019

రానున్న ఏడాది కాలంలో డీసీబీ బ్యాంకు, ఫెడరల్‌ బ్యాంకు, ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాకు, పీఎన్‌బీ, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో మంచి రాబడులకు అవకాశం ఉందన్నారు ప్రముఖ మార్కెట్‌ నిపుణులు, ఐఐఎఫ్‌ఎల్‌ సెక్యూరిటీస్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ సంజీవ్‌ భాసిన్‌. పలు మార్కెట్‌ అంశాలపై ఆయన తన అభిప్రాయాలను ఓ వార్తా సంస్థతో పంచుకున్నారు.   మిడ్‌క్యాప్‌ స్టాక్స్‌లో నెలకొన్న నిరాశావాదాన్ని గత 30 ఏళ్లలో తాను ఎప్పుడూ చూడలేదన్నారు. సీపీఎస్‌ఈ ఈటీఎఫ్‌లో సిప్‌ రూపంలో

త్వరలో మరిన్ని పన్ను తగ్గింపులు?!

Tuesday 29th October 2019

ఇన్వెస్టర్లను ఆకట్టుకునే దిశగా ప్రభుత్వ యోచన ఈక్విటీ పెట్టుబడులపై అమలవుతున్న పలు పన్నులను సరళీకరించేదిశగా ప్రభుత్వం త్వరలో చర్యలు ప్రకటించనుందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఇన్వెస్టర్‌ సెంటిమెంట్‌ను పెంపొందించి, మరిన్ని విదేశీ నిధులను దేశంలోకి ఆకర్షించేందుకు ప్రభుత్వం ఈక్విటీ పన్నురేట్ల సంస్కరణలు తీసుకురానుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ, నీతి ఆయోగ్‌కు సంబంధించిన కీలక వర్గాలు తెలిపాయి. ప్రస్తుతమున్న దీర్ఘకాలిక మూలధన పన్ను(ఎల్‌టీసీజీ), సెక్యూరిటీ లావాదేవీ పన్ను(ఎస్‌టీటీ), డివిడెండ్‌ పంపిణీ పన్ను(డీటీటీ)లను ప్రధాని

Most from this category