News


మార్కెట్లలో మరింత పెయిన్‌..?

Thursday 19th March 2020
Markets_main1584558192.png-32563

బుధవారం నాటి సెషన్‌లో మార్కెట్లు మూడేళ్ల కనిష్టాలకు చేరాయి. నిఫ్టీ ఇటీవలి కనిష్ట స్థాయి 8,555ను కోల్పోయింది. దీంతో సాంకేతికంగా చూస్తే నిఫ్టీ మరింత దిద్దుబాటుకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అనలిస్టులు అంచనా వేస్తున్నారు. నిఫ్టీ కీలకమైన సగటు చలనాలకు దిగువనే ఉండడం ఈ అంచనాలకు మద్దతునిస్తోంది. 14 రోజుల ఆర్‌ఎస్‌ఐ 14 వద్దనుండడం సూచీ తీవ్ర అమ్మకాల జోన్‌లో ఉన్నట్టు సూచిస్తుండడంతో నిఫ్టీ 8,000 దిగువకు చేరే అవకాశాన్ని అనలిస్టులు కొట్టిపారేయడం లేదు. 

 

‘‘నిఫ్టీ అధిక అమ్మకాలను ఎదుర్కొంటోంది. హయ్యర్‌ టైమ్‌ఫ్రేమ్‌ చార్టుల్లో ఆసిల్లేటర్స్‌ మరింత అమ్మకాలను సూచిస్తున్నాయి’’ అని రిలయన్స్‌ సెక్యూరిటీస్‌ మార్కెట్‌ స్ట్రాటజిస్ట్‌ అరుణ్‌కుమార్‌ తెలిపారు. నిఫ్టీ బుధవారం 498 పాయింట్లు నష్టపోయి 8,468 వద్ద క్లోజయింది. 5.56 శాతం నష్టపోయింది. దీంతో డైలీ చార్ట్‌లో లాంగ్‌బేరిష్‌ క్యాండిల్‌ను ఏర్పాటు చేసింది. ఇంట్రాడేలో 9,100-9,150 కీలక నిరోధాలుగా పనిచేసినట్టు షేర్‌ఖాన్‌కు చెందిన అనలిస్ట్‌ గౌరవ్‌ రత్నపార్కి తెలిపారు. ఇంట్రాడేలో నిఫ్టీ 9,127 గరిష్టాన్ని, 8,407 కనిష్టాన్ని నమోదు చేసింది. ‘‘బేర్స్‌ పట్టు పైచేయిగా ఉంది. ఇండెక్స్‌ పతనం దిశగానే కొనసాగొచ్చు. 8,025 వరకు పడిపోవచ్చు. ఇది 2016 కనిష్ట స్థాయి నుంచి జరిగిన ర్యాలీలో 78.6 శాతం కోల్పోయినట్టు అవుతుంది’’ అని తర్నపార్కి వివరించారు. నిఫ్టీకి సమీప కాలంలో 8,800-9,000 వద్ద నిరోధం ఎదురుకావచ్చని చెప్పారు.

 

‘‘శుక్రవారం బలమైన రికవరీ తర్వాత ఏర్పడిన సానుకూల సెంటిమెంట్‌ పూర్తిగా తొలగిపోయినట్టు కనిపిస్తోంది. నిఫ్టీ 8,555 దిగువకు వెళ్లిపోవడం సానుకూల సంకేతం కాదు. స్వల్ప కాలంలో మరింత బలహీనత ఉంటుందని భావించొచ్చు’’ అని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌కు చెందిన టెక్నికల్‌ అనలిస్ట్‌ నాగరాజ్‌శెట్టి సూచించారు. నెలవారీగా చూస్తే ఆర్‌ఎస్‌ఐ ఇండికేటర్‌ 35 స్థాయికి చేరింది. 30కు దిగువకు పడిపోతే అమ్మకాలు మరింత తీవ్రమవుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ‘‘నిఫ్టీ రైజింగ్‌ ట్రెండ్‌లైన్‌ నుంచి జారిపోయింది. నెలవారీ చార్ట్‌లో 100ఈఎంఏ అన్నది సూచీ 7,900, తర్వాత 7,500 స్థాయి వరకు పడిపోయేందుకు మార్గాలు తెరిచింది’’ అని మోతీలాల్‌ ఓస్వాల్‌కు చెందిన అనలిస్ట్‌ చందన్‌తపారియా తెలిపారు.You may be interested

పతనంతో పని లేదు.. మూలాలు బలంగా ఉండాలి..!

Thursday 19th March 2020

సూచీలు జనవరిలో రికార్డు గరిష్టాల నుంచి ఇప్పటికే 30 శాతానికి పైగా పడిపోయాయి. కనుక చౌక విలువలో లభిస్తున్న షేర్ల కొనుగోలుకు (వ్యాల్యూ బయింగ్‌) ఇది అనుకూల సమయమేనా..? లేదా మార్కెట్లు మరింత పడిపోతాయా..? మార్కెట్లు ఎంత వరకు పడిపోతాయన్నది ఎవరూ చెప్పలేని విషయం. ఇప్పటికే చెప్పుకోతగ్గ స్థాయిలో పడిపోయాయి కనుక ఈ స్థాయి నుంచి పెట్టుబడులను కొంచెం కొంచెం పెట్టుకుంటూ వెళ్లడం మంచి విధానంగా నిపుణులు సూచిస్తున్నారు.    ‘‘ఇన్వెస్టర్లు తమ

మిమ్మల్ని స్వీయ మదింపు చేయమన్నారు? టెలికం కంపెనీలపై సుప్రీం కన్నెర్ర

Wednesday 18th March 2020

టెలికం సంస్థలపై అత్యున్నత న్యాస్థానం మరోసారి మండిపడింది. ఏజీఆర్‌ బకాయిల ఛార్జీల చెల్లింపుల విషయంలో ఎలాంటి పునర్‌సమీక్ష ఉండదని తేల్చి చెప్పింది. ఈ విషయంలో స్వీయ మదింపు చేసుకున్న కంపెనీలపై  బుధవారం జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం  తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలు కోర్టు అనుమతి లేకుండా మిమ్మల్ని ఎవరు స్వీయ మదింపు చేసుకోమన్నారు? అంటూ ఘాటుగా స్పందించింది. బకాయిలు వసూలు చేయడంతో ప్రభుత్వ తీరుపై కూడా

Most from this category