News


నాణ్యమైన స్టాక్స్‌ కొనుగోలుకు ఇదే సమయం

Sunday 15th September 2019
Markets_main1568570369.png-28382

గత ఏడాదిన్నర కాలంలో దేశ ఈక్విటీలు ఎన్నో ఉత్థాన పతనాలను చూశాయి. దీంతో ఎంతో మంది రిటైల్‌ ఇన్వెస్టర్ల పెట్టుబడులు నష్టాల్లోకి వెళ్లిపోయాయి. అంతేకాదు మ్యూచువల్‌ ఫండ్స్‌లోనూ గత రెండేళ్ల నుంచి ఇన్వెస్ట్‌ చేస్తున్న వారికి నష్టాలే కనిపిస్తున్నాయంటే స్టాక్స్‌లో ఎంత దిద్దుబాటు జరిగిందో అర్థం చేసుకోవచ్చు. అయితే, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ నెల రోజుల వ్యవధిలో మూడు విడతల్లో ఎన్నో రంగాలకు చర్యలను ప్రకటించడం జరిగింది. ఇవన్నీ పలు రంగాలకు మేలు చేస్తాయని, మధ్య కాలానికి ఆర్థిక వృద్ధిక మేలు చేస్తాయని ఆర్థిక రంగ నిపుణులు విశ్వసిస్తున్నారు. ఈ నేపథ్యంలో స్టాక్స్‌లో పెట్టుబడులకు ఇది అనుకూల సమయమని ఎస్‌ఎంసీ పీఎంఎస్‌ ఫండ్‌ మేనేజర్‌ ఆయుష్‌ అగర్వాల్‌ తెలియజేశారు. ఆయన విశ్లేషణ ఇలా ఉంది...

 

‘‘దేశీయంగా సానుకూల ప్రభుత్వం ఉంది. దీంతో సమీప కాలంలో సంస్కరణలను ఆశించొచ్చు. చమురు ధరలు గరిష్ట స్థాయి నుంచి చాలా వరకు దిగొచ్చాయి. వర్షాలు సానుకూలంగా ఉండడం, మంచి మెజారిటీతో కూడిన స్థిరమైన ప్రభుత్వం, వడ్డీ రేట్లు క్షీణించడం, కంపెనీల ఆదాయ, లాభాలు క్యూ2లో బోటమ్‌ అవుట్‌ అయి, ఆ తర్వాత నుంచి అప్‌ట్రెండ్‌ ఉంటుందన్న అంచనాలు ఉన్నాయి’’ అని అగర్వాల్‌ తెలియజేశారు. అయితే, ఈక్విటీ మార్కెట్లు ఈ స్థాయి నుంచి పెరిగితే, అతిపెద్ద రిస్క్‌ అంతర్జాతీయ వాణిజ్య యుద్ధం రూపంలోనే ఉంటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అలాగే, క్యూ2లో కార్పొరేట్‌ ఫలితాలు గణనీయంగా పడిపోయినా మార్కెట్లకు రిస్క్‌ ఎదురవుతుందన్నారు. 

 

అయితే, ప్రభుత్వ చర్యలతో ఆర్థిక వ్యవస్థలో ఏదైనా రికవరీ కనిపిస్తే అది ఇన్వెస్ట్‌ చేయడానికి, ఈక్విటీల్లో పెట్టుబడులు పెంచుకోవడానికి మంచి అవకాశమేనన్నారు అగర్వాల్‌. నిఫ్టీ ప్రస్తుత స్థాయి నుంచి పెరిగేందుకు ఎక్కువ అవకాశాలు అయితే ఉన్నాయన్నారు. బాగా పడిపోయిన మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ స్టాక్స్‌లో నాణ్యమైన వాటిని ఎంపిక చేసుకుని ఇన్వెస్ట్‌ చేసుకోవచ్చని సూచించారు. బ్యాంకింగ్‌ వ్యాల్యూషన్లు ఇప్పటికీ ఖరీదుగానే ఉన్నాయని, అయినా కానీ ప్రభుత్వరంగ బ్యాంకులతో పోలిస్తే ప్రైవేటు బ్యాంకులు మంచి పనితీరు చూపిస్తాయన్నారు. ఆటో రంగ కంపెనీల విక్రయాలు కుదుటపడడానికి సమయం పడుతుందన్నారు. అయితే ఆటో రంగ స్టాక్స్‌ వ్యాల్యూషన్లు ఆకర్షణీయ స్థాయికి చేరాయన్నారు. కన్‌స్ట్రక్షన్‌, ఇన్‌ఫ్రా, క్యాపిటల్‌ గూడ్స్‌ రంగ కంపెనీలను కూడా ఆయన సూచించారు. You may be interested

తాజా ప్యాకేజీ ఈ రంగాలకు సానుకూలం

Sunday 15th September 2019

ఆర్థిక రంగ వృద్ధిని పట్టాలెక్కించేందుకు కేంద్ర ప్రభుత్వం మరో విడత పలు రంగాలకు ప్రోత్సాహకర చర్యలతో ముందుకు వచ్చింది. రియల్‌ ఎస్టేట్‌, ఎగుమతుల రంగాలకు ప్రధానంగా పన్నుల రాయితీలు, ఫండింగ్‌, ఉద్దీపన చర్యలను ప్రకటించింది. రియల్‌ ఎస్టేట్‌ రంగ ప్రాజెక్టులు ముందుకు వెళ్లేందుకు రూ.20,000 కోట్ల నిధి, ఎగుమతులకు పన్ను రాయితీల కోసం రూ.50,000 కోట్లు ప్రకటించింది. ఈ చర్యలు ముఖ్యంగా ఎనిమిది రంగాలకు సానుకూలమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా

నిఫ్టీ ముందుకా.. మళ్లీ వెనక్కా..?

Sunday 15th September 2019

నిఫ్టీ మరోసారి 11,000 మార్క్‌ పైకి చేరింది. 11,000 మార్క్‌పైన క్లోజవుతున్న సూచీ, ఆ తర్వాత ముందుకు ర్యాలీ చేయలేకపోతోంది. ఇలా మూడు సార్లు జరిగింది. దీంతో ఈ సారి కూడా సూచీ తిరిగి వెనక్కి వచ్చేస్తుందా..? అన్న సందేహాలు చాలా మందిలో ఉన్నాయి. అయితే, గుడ్డిగా నిఫ్టీ ర్యాలీ వెంట పడొద్దని జెమ్‌స్టోన్‌ ఈక్విటీ రీసెర్చ్‌, అడ్వైజరీ సర్వీసెస్‌ టెక్నికల్‌ అనలిస్ట్‌ మిలాన్‌ వైష్ణవ్‌ సూచిస్తున్నారు. ఆయన అభిప్రాయాలు

Most from this category