STOCKS

News


70డాలర్లకు క్రూడాయిల్‌... ఈ రంగ షేర్లకు కష్టాలే..!

Monday 6th January 2020
Markets_main1578298648.png-30705

అంతర్జాతీయంగా బ్యారెల్‌ క్రూడాయిల్‌ ధర 70డాలర్లకు చేరుకోవడంతో దేశీయంగా డాలర్‌ మారకంలో రూపాయి విలువ 72స్థాయికి దిగివచ్చింది. ఈ నేపథ్యంలో కొన్ని దేశీయ స్టాకుల ర్యాలీ బ్రేకులు పడవచ్చని మార్కెట్‌ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. పశ్చిమాసియా దేశాల్లో నెలకొన్ని భౌగోళిక ఉద్రిక్తతలు చల్లారకపోతే.., దేశీయ ఆయిల్‌ మార్కెటింగ్‌,  విమానయాన, రసాయన రంగాలకు చెంది షేర్లు అమ్మకాల ఒత్తిడికిలోనయ్యే అవకాశం ఉందని వారంటున్నారు. 

ప్రపంచమార్కెట్లో క్రూడాయిల్‌ ధరలు 9నెలల గరిష్టానికి ఎగిసిన నేపథ్యంలో దేశీయ ఆయిల్‌ కంపెనీ షేర్లు 5శాతానికి పైగా పతనాన్ని చవిచూశాయి. అత్యధికంగా హెచ్‌పీసీఎల్‌ షేరు 5.50శాతం నష్టపోయి రూ.250 కనిష్టాన్ని తాకింది. బీపీసీఎల్‌ షేరు 2శాతం క్షీణించి రూ.472 తాకగా, ఇదే రంగంలోని ఐఓసీ షేరు 2శాతం పతనమైన రూ.124.70లకు చేరుకుంది.

విమానయాన రంగానికి చెందిన ఇండిగో షేర్లు 3శాతం నష్టపోయి రూ.1,329 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. స్పైస్‌జెట్‌ షేరు 4.50శాతం క్షీణించి రూ.101లకు చేరుకుంది. పెయింట్‌ స్టాకులైన ఏషియన్‌ పేయింట్స్‌, బర్గర్‌ పెయింట్స్‌ 2శాతం నష్టపోయాయి. మొత్తం 40బ్యాంకింగ్‌ రంగషేర్లులో 37 షేర్లు 5శాతం వరకు నష్టాన్ని చవిచూశాయి. 

‘‘పెరిగి క్రూడాయిల్‌ ధరలు డాలర్‌ మారకంలో రూపాయి విలువను కొత్త జీవితకాల కనిష్టాలకు దిగజార్చవచ్చు. రూపాయి బలహీన ద్రవ్యలోటు, సీఏడీల అసమతుల్యత దెబ్బతీయవచ్చనే నెపంతో ఆర్థిక వ్యవస్థలో ఆందోళన నెలకొనవచ్చు. మార్కెట్ పెరగడానికి ఉన్న ఏకైక ఎక్స్-కారకం కార్పొరేట్ పన్ను తగ్గింపు, ఎందుకంటే ఆర్థిక వ్యవస్థ పురోగతి యొక్క సంకేతాలను చూపించలేదు. బాండ్‌ ఈల్డ్స్‌ పీఎస్‌యూ బ్యాంకులు, కార్పోరేట్‌ బ్యాంకులపై ఒత్తిడిని పెంచుతుంది.’’ ఈల్డ్స్‌ మాగ్జిమైజర్ వ్యవస్థాపకుడు యోగేశ్ మెహతా అన్నారు. ఏషియన్‌ పెయింట్స్‌, పిడిలైట్‌ లాంటి వినియోగదారుల కంపెనీలు ఇన్‌పుట్‌ వ్యయాన్ని పెంచడంలో విఫలమైతే ఈ కంపెనీలు కొంత కరెక్షన్‌ను చవిచూడాల్సి వస్తుందని మెహతా చెప్పారు. 

ఓఎంసీలు, ఏవియేషన్, పెయింట్స్ మరియు చమురును ఉత్పన్నాలుగా ఉపయోగించే చాలా రసాయనాల సంస్థలు ఒత్తిడికి లోనవుతాయి. పరిస్థితి ఇలాగే కొనసాగినట్లైతే... రానున్న రోజుల్లో ఈ రంగాలకు చెందిన మిడ్‌క్యాప్‌ షేర్లు మరింత పతననాన్ని చూసే అవకాశం ఉందని ఇండియానివేశ్‌ రీసెర్చ్‌ హెడ్‌ ధర్మేష్‌ కాంత్‌ అభిప్రాయపడ్డారు. You may be interested

బేర్‌ షాక్‌- ఇన్వెస్టర్ల కింకర్తవ్యం?

Monday 6th January 2020

టెన్షన్ల షాక్‌- ఇన్వెస్టర్లు ఏం చేయాలి? ఉన్నట్టుండి అమెరికా, ఇరాన్‌ మధ్య ఏర్పడిన ఉద్రిక్తతలు దేశీ స్టాక్‌ మార్కెట్లకు షాక్‌నిచ్చాయి. కొత్త ఏడాది(2020)లో సరికొత్త రికార్డులను సాధించే హుషారుతో ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్లను గత వారం అనుకోకుండా చెలరేగిన మధ్యప్రాచ్య వివాదాలు దెబ్బతీస్తున్నాయి. దీంతో శుక్రవారమే మార్కెట్లు అమ్మకాల ఒత్తిడిని చవిచూడగా.. తాజాగా నేడు(సోమవారం) పతన పరిస్థితులలో చిక్కుకున్నాయి. ఈ దశలో ఇన్వెస్టర్లు నిరాశకు లోనైనప్పటికీ ఇలాంటి అంశాలను అవకాశాలుగా

మార్కెట్‌ డౌన్‌- ఈ స్టాక్స్‌ హైజం‍ప్‌

Monday 6th January 2020

రికార్డ్‌ గరిష్టానికి చేరువలో ఐఈఎక్స్‌ వాహన విక్రయాల ’ఫోర్స్‌’ మోటార్స్‌ మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో దేశీ స్టాక్‌ మార్కెట్లు పతన బాటలో సాగుతున్నాయి. ఇన్వెస్టర్లు అమ్మకాలకు ఎగబడటంతో మధ్యాహ్నం 12.10 ప్రాంతంలో సెన్సెక్స్‌ 650 పాయింట్లు పతనమైంది. 41,815కు చేరింది. ఈ బాటలో నిఫ్టీ సైతం 200 పాయింట్లు దిగజారి 12,027 వద్ద ట్రేడవుతోంది. అయితే విభిన్న వార్తల కారణంగా పతన మార్కెట్లోనూ రెండు మిడ్‌ క్యాప్‌ కౌంటర్లు ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి.

Most from this category