STOCKS

News


253 స్టాకులు..ఏడాది కనిష్టానికి

Thursday 1st August 2019
Markets_main1564652644.png-27479

దేశియ మార్కెట్లు గురువారం ట్రేడింగ్‌లో భారీ నష్టాలవైపు కదులుతున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో సుమారుగా 253 స్టాకులు వాటి 52 వారాల కనిష్టానికి పడిపోయాయి. ఆర్తి డ్రగ్స్, అపర్ ఇండస్ట్రీస్, యారో టెక్స్‌టైల్స్‌, బ్యాంక్ ఆఫ్ ఇండియా, భారత్ గేర్స్, బయోకాన్, కేర్ రేటింగ్స్, కాక్స్ అండ్‌ కింగ్స్, ఎక్సెల్ ఇండస్ట్రీస్, జిటిఎల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, హిందూజా వెంచర్స్ షేర్లు 52 వారాల కనిష్టానికి పడిపోయాయి. వీటితో పాటు ఐనాక్స్ విండ్, జైన్ ఇరిగేషన్ సిస్టమ్స్, మిండా కార్పొరేషన్, మోన్శాంటో ఇండియా, ఒమాక్స్ ఆటోస్, పంజాబ్ అండ్‌ సింధ్ బ్యాంక్, శ్రేయాస్ షిప్పింగ్ అండ్‌ లాజిస్టిక్స్, ది సౌత్ ఇండియన్ బ్యాంక్, టాటా మోటార్స్ షేర్లు కూడా ఏడాది కనిష్టానికి పడిపోయిన షేర్లలో ఉన్నాయి. దేశీయ బెంచ్‌మార్క్ ఇండెక్స్ ఎన్‌ఎస్‌ఇ నిఫ్టీ మధ్యాహ్నం 3.02 సమయానికి 185.55 పాయింట్లు తగ్గి 10,932.45 పాయింట్ల వద్ద, బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 555.76 పాయింట్లు నష్టపోయి 36,925.36 వద్ద ట్రేడవుతున్నాయి. నిఫ్టీ 50 ఇండెక్స్‌లో భారతి ఇన్‌ఫ్రాటెల్, విప్రో, పవర్‌గ్రిడ్, గెయిల్, ఎన్‌టిపిసి పాజిటివ్‌గా ట్రేడవుతున్న​ షేర్లలో ముందున్నాయి. జీల్(జెడ్‌ఈఈఎల్‌), వేదాంత, జెఎస్‌డబ్ల్యు స్టీల్, హిండాల్కో ఇండస్ట్రీస్, యుపిఎల్ నష్టపోయిన షేర్లలో ముందున్నాయి.



You may be interested

4.5 % పతనమయిన ఎస్‌బీఐ

Thursday 1st August 2019

ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ షేర్లు గురువారం ట్రేడింగ్‌లో భారీగా అమ్మకాలకు గురయ్యాయి. నీఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్‌ ఇండెక్స్‌ మధ్యాహ్నం 3.18 సమయానికి 2.37 శాతం నష్టపోయింది. డిపాజిటరీ వడ్టీ రేట్లను తగ్గించిన తర్వాత స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా షేరు​విలువ వరుస సెషన్‌లలో పడిపోయింది. గురువారం మధ్యాహ్నం 3.21 సమయానికి ఎస్‌బీఐ షేరు 4.59 శాతం నష్టపోయి రూ. 316.95  వద్ద ట్రేడవుతోంది. ఈ షేరు ఈ రోజు ట్రేడింగ్‌లో రూ.330.80

52 వారాల కనిష్టానికి వేదాంత

Thursday 1st August 2019

మెటల్‌ షేర్ల పతనంతో భాగంగా గురువారం వేదాంత షేర్లు భారీ నష్టపోయాయి. నేడు బీఎస్‌ఈలో ఈ షేర్లు రూ.153.25 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఫెడ్‌ రిజర్వ్‌ ఛైర్మన్‌ పావెల్‌ కోత విధింపు ఇక ముందు కొనసాగపోవచ్చనే పావెల్‌ వాఖ్యలతో మెటల్‌ షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. మెటల్‌ షేర్లలో అధిక వెయిటేజీ కలిగిన వేదాంత షేర్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడికి లోనైంది. ఒకదశలో 6.50శాతం క్షీణించి రూ.144.05ల వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని

Most from this category