News


ఈ బ్యాంకుల షేర్లలో ఇన్వెస్టింగా?.. జాగ్రత్త!

Saturday 31st August 2019
Markets_main1567243437.png-28131

కేంద్ర ఆర్థిక మంత్రి నాలుగు ప్రధాన బ్యాంకుల విలీనాలను గురించి శుక్రవారం ప్రకటించారు. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌లో, ఓరియంటల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ కామర్స్‌, యునిటెడ్‌ బ్యాంక్‌లను విలీనం చేసి, ఈ బ్యాంక్‌ను రెండవ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్‌గా మార్చనుండగా, కెనరా బ్యాంక్‌, సిండికేట్‌ బ్యాంక్‌లను విలీనం చేసి నాలుగవ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్‌ను ఏర్పాటు చేయనున్నారు. వీటితోపాటు యూనియన్‌ బ్యాంక్‌, ఆంధ్రాబ్యాంక్‌, కార్పోరేషన్‌ బ్యాంక్‌లను విలీనం చేసి ఒక అతిపెద్ద బ్యాంక్‌ను ఏర్పాటు చేయనుండగా, అలహాబాద్‌ బ్యాంక్‌ ను ఇండియన్‌ బ్యాంక్‌తో విలీనం చేయనున్నారు. గత విలీన అనుభవాలను పరిశీలిస్తే.. ఈ బ్యాంకుల స్టాకులు ప్రారంభంలో పాజిటివ్‌గా ఉండవచ్చని, కానీ దీర్ఘకాలంలో అద్భుతమైన ప్రదర్శన చేస్తాయని చెప్పడం కష్టమని విశ్లేషకులు తెలిపారు. 

  గతంలో బ్యాంకుల విలీన ప్రకటన వెలువడినప్పటి నుంచి కేబినెట్‌ ఆమోదం పొందినంత వరకు గల కాలంలో, కేబినెట్‌ ఆమోదం పొం‍దిన తర్వాత నుంచి ఈ విలీన పక్రియ అమలులోకి వచ్చిన మధ్య కాలంలో ఆయా బ్యాంక్‌ స్టాకులు ప్రదర్శన..
ఎస్‌బీఐలో అనుబంధబ్యాంకుల విలీనం:
ఎస్‌బీఐ(స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా), తన ఐదు అనుబంధ బ్యాంకులతో పాటు భారతీయ మహిళా బ్యాంక్‌తో విలీనానికి అగష్టు 2016 ఆమోదం తెలిపినప్పటి నుంచి ఈ విలీనాన్ని ఫిబ్రవరి 2017లో కేబినెట్‌ ఆమోదం తెలిపినంత వరకు ఎస్‌బీఐ షేరు విలువ 9 శాతం పెరిగింది. ఇదే సమయంలో ఎస్‌బీఐ అనుబంధ బ్యాంక్‌లయిన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ బికనీర్‌, జైపూర్‌ షేరు 7 శాతం, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ట్రావన్‌కోర్‌ 12 శాతం పెరగగా, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ మైసూర్‌ మాత్రం 9 శాతం నష్టపోయింది. ఎస్‌బీఐ ఈ విలీనానికి ఆమోదం తెలిపిన తేది నుంచి ఈ విలీనం అమలులోకి వచ్చిన మధ్య కాలంలో ఎస్‌బీఐ బ్యాంక్‌ షేరు 11.8 శాతం లాభపడగా, స్టేట్‌ బ్యాంక్‌ బికనీరు, జైపూర్‌ 14.5 శాతం, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ట్రావన్‌కోర్‌ 20 శాతం పెరిగాయి. మరోవైపు ఇదే సమయంలో స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ మైసూర్‌ 2.5 శాతం నష్టపోవడం గమనార్హం. అగస్టు 2016లో విలీనానికి ఎస్‌బీఐ ఆమోదం తెలిపినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎస్‌బీఐ షేరు 10 శాతం లాభపడింది.

బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా విలీనం: 
బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, విజయా బ్యాంక్‌, దేనా బ్యాంక్‌లతో విలీనానికి సెప్టెంబర్‌ 2018న ఆమోదం తెలిపినప్పటి నుంచి ఈ విలీనానికి కేబినెట్‌ ఆమోదం తెలిపిన జనవరి 2019 వరకు గల కాలంలో, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా 11.6 శాతం, విజయా బ్యాంక్‌ 14.6 శాతం నష్టపోగా, దేనా బ్యాంక్‌ మాత్రం 12.5 శాతం లాభపడింది. ఈ విలీన ప్రకటన వెలువడిన సెప్టెంబర్‌ 2018 నుంచి ఈ విలీనం అమలులోకి వచ్చిన మార్చి 2019 మధ్య వరకు గల కాలంలో బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా షేరు​ 3.6 శాతం, విజయా బ్యాంక్‌ 9.7 శాతం, దేనా బ్యాంక్‌ 29.8 శాతం నష్టపోయాయి.  విలీన ప్రకటన నుంచి ఇప్పటి వరకు బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా షేరు 22.4 శాతం నష్టపోయింది. 

ప్రారంభం​పాజిటివ్‌గా...
నాలుగు ప్రధాన బ్యాంకుల విలీనం గురించి శుక్రవారం ఆర్థిక మంత్రి ప్రకటించారు. దీని గురించి విశ్లేషకులు మాట్లాడుతూ..గతంలో బ్యాంకుల విలీనం విజయవంతం అవ్వడం వలన ప్రారంభం‍లో ఈ బ్యాంకల షేర్లు పాజిటివ్‌గా ట్రేడయ్యే అవకాశం ఉందని అన్నారు.  ‘ఎస్‌బీఐ, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా బ్యాంకుల విలీనం విజయవంతమయ్యాయి. కాబట్టీ ప్రస్తుత విలీన బ్యాంకుల షేర్లు ప్రారంభంలో సానుకూలంగా కదలవచ్చు కానీ అద్భుతమైన ప్రదర్శననైతే చేయవు’ అని కేఆర్‌ చోక్సి ఇన్వెస్ట్‌మెంట్‌ మేనేజర్స్‌, గ్రూప్‌ మేనేజింగ్‌ డైరక్టర్‌ దివాన్‌ చోక్సి అన్నారు.  ప్రభుత్వం దీర్ఘకాల ప్రయోజనం కోసం తీసుకున్న ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు. ‘విలీన పక్రియలో భాగంగా వచ్చే 6-8 త్రైమాసికాలలో ఈ బ్యాంకుల శాఖలు లేదా వ్యయ నిర్మాణం లేదా మేనేజ్‌మెంట్‌ పునర్నిర్మాణం, బ్యాంకులతో ఒక వ్యాపార నమూనాకు రావడం వంటి అంశాలలో హేతుబద్ధీకరణ జరుగుతుంది’ అని ఆయన వివరించారు. ఈ స్టాకుల ధరల ఆధారంగా ఈ అంశాలు ఏవిధంగా రూపుదిద్దుకుంటున్నాయో అంచనా వేయవచ్చని తెలిపారు. గత కొంత కాలం నుంచి పీఎస్‌యూ బ్యాంక్‌ షేర్ల క్షీణత, ప్రభుత్వం రీ క్యాపిటలైజేషన్‌కు నిధులను కేటాయించడం, ఈ విలీన ప్రకటనల వలన ప్రస్తుతం పీఎస్‌యూ బ్యాంక్‌ షేర్లు ఆకర్షిణియంగా మారాయని విశ్లేషకులు తెలిపారు. 

విలీనంతో యాంకర్‌ బ్యాంక్‌ ఇన్వెస్టర్లు జాగ్రత్త...
కానీ ఈ విలీనం, దీర్ఘకాలంలో ఇన్వెస్టర్లకు సానుకూలంగా ఉన్నప్పటికి షార్ట్‌టెర్మ్‌లో యాంకర్‌ బ్యాంక్‌ ఇన్వెస్టర్లు జాగ్రత్తగా ఉండాలని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ‘బ్యాంక్‌ ఆఫ్‌ బరోడ(బీఓబీ), విజయా బ్యాంక్‌, దేనా బ్యాంక్‌ విలీనాన్ని మార్కెట్‌లు హర్షించలేదు. సీఏసీఏ(కరెంట్‌ అండ్‌ సేవింగ్స్‌ అకౌంట్‌ నిష్పత్తి) వృద్ధి, ఖర్చులు-ఆదాయాల నిష్పత్తి మినహాయించి రుణాల ఖర్చులలో క్షీణత వంటి అంశాలపై బీఓబీ విలీనం అంతగా ప్రభావాన్ని చూపలేదు. అంతేకాకుండా ఈ విలీనం తర్వాత నుంచి బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా షేరుపై ఒత్తిడి కొనసాగుతోంది’ అని ఐఐఎఫ్‌ఎల్‌ సెక్యూరిటీస్‌, అభిమన్యసోఫత్‌ అన్నారు.



You may be interested

ఇండియాలో పెట్టుబడులకు ఇదే మంచి సమయం

Saturday 31st August 2019

-మార్క్‌ మొబియస్‌ దీర్ఘకాలంలో ఇండియా వృద్ధి చెందుతుందని, కానీ పన్నుల పరంగా ఇక్కడ చాలా గందరళగోళం ఉందని మొబియస్ క్యాపిటల్ పార్టనర్స్ ఎల్ఎల్‌పీ వ్యవస్థాపకుడు మార్క్ మొబియస్ అన్నారు. ఎఫ్‌పీఐలపై విధించిన అదనపు సర్‌చార్జీని ప్రభుత్వం ఉపసంహరిం‍చుకోవడం చాలా మంచి చర్యని అన్నారు. దీర్ఘకాలానికి గాను భారతదేశంలో  పెట్టుబడులు పెట్టడానికి ఇదే మంచి సమయమని, తన పెట్టుబడుల జాబితాలో ఇండియా అగ్రస్థానంలో ఉంటుందని తెలిపారు. ‘భారతదేశ ఆర్థిక మందగమనానికి అంతర్గత, బాహ్య

మూడు రోజూ నష్టాల్లో ముగిసిన పసిడి ధర

Saturday 31st August 2019

డాలర్‌ ఇండెక్స్‌లో బుల్లిష్‌ కదలిక నెలకొన్న నేపథ్యంలో పసిడి ధర వరుసగా మూడోరోజూ నష్టాలతో ముగిసింది. అమెరికా మార్కెట్లో శుక్రవారం రాత్రి  ఔన్స్‌ పసిడి ఫ్యూచర్‌ ధర 7.75డాలర్లు క్షీణించి 1,529.15 డాలర్ల వద్ద స్థిరపడింది. ఆరు ప్రధాన కరెన్సీ విలువల్లో డాలర్‌ ఇండెక్స్‌ అరశాతం ర్యాలీ చేసి 98.94 స్థాయి వద్ద ముగిసింది. ఈ వారంలో జరిగిన అమెరికా చైనాల మధ్య వాణిజ్య చర్చల నేపథ్యంలో ఈక్విటీ, బాండ్‌

Most from this category