News


ఆటో ఫలితాలు నిరుత్సాహకరం: బ్రోకరేజ్‌ల అంచనాలు

Friday 12th July 2019
Markets_main1562913496.png-27003

  గత ఏడాది నుంచి దేశియ ఆటో రంగం తీవ్ర ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటుంది. తగ్గిన డిమాండ్‌, అధిక బేస్‌, ప్రతికూల ఆపరేటింగ్‌ లెవరేజ్‌, లిక్విడిటీ సమస్యలు, అధికంగా రాయితీలు ప్రకటించడం వంటి వాటి వలన ఆటో రంగ జూన్‌ త్రైమాసిక ఫలితాలు బలహీనంగా ఉండనున్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. సంవత్సరం నుంచి ప్రస్తుత తేది వరకు(వై టూ డీ) గల డేటా ప్రకారం మారుతి షేరు 38 శాతం నష్టపోయి రూ.5,952కు పడిపోయింది. అదేవిధంగా ఎయిచర్‌ మోటర్స్‌ 33.6 శాతం నష్టపోయి రూ. 18,859 వద్ద, ఎం అండ్‌ ఎం 33 శాతం నష్టపోయి రూ. 627 వద్ద, టాటా మోటర్స్‌ 45 శాతం నష్టపోయి రూ.151 వద్ద ట్రేడవుతున్నాయి.  ఇయర్‌ ఆన్‌ ఇయర్‌ (వై ఓ వై) ప్రకారం ద్విచక్ర వాహనాల తయారి సంస్థ హీరో మోటర్‌ కార్ప్‌ 33 శాతం నష్టపోయి రూ. 2,451 వద్ద, బజాజ్‌ ఆటో 11.2 పతనమై రూ.2,676 వద్ద ట్రేడవుతున్నాయి. గత క్వార్టర్‌ నుంచి వీటి ఆదాయాలు సింగిల్‌ డిజిట్‌కు పడిపోవడమే కాకుండా కొన్ని సంస్థల లాభాలు పూర్తిగా తగ్గిపోయాయి.

ఆటోరంగానికి ఇంకో అధ్వాన్నమైన క్వార్టర్‌: నోముర
   ఆటోరంగ జూన్‌ క్వార్టర్‌ ఫలితాలు అధ్వాన్నంగా ఉండనున్నాయని ప్రముఖ బ్రోకరేజి సంస్థ నోముర తెలిపింది. జేఎల్‌ఆర్‌ ను పక్కనపెడితే మిగిలిన కంపెనీల ఆదాయ వృద్ధి 5 శాతం మేర తగ్గనుందని, ఈబీఐటీడీఏ ఆదాయం(వడ్డీలు,పన్నులు, విలువ తగ్గుదల, రుణ విమోచనాలకు ముందు పొం‍దిన ఆదాయం) 23 శాతం, పాట్‌(పన్నుల చెల్లింపు జరిగాక మిగిలిన లాభం) 34 శాతం తగ్గనుందని(వై ఓ వై ప్రకారం) తెలిపింది. ఆర్థిక సంవత్సరం 2020లో భారత ఆర్థిక వృద్ధి రేటు  6.5 శాతంగానే ఉంటుందని అంచనా వేసింది. ఇది కేంద్ర ప్రభుత్వం అంచనా 7 శాతం కంటే తక్కువగా ఉండడం గమనర్హం. సరకు రవాణా చార్జీలు తగ్గడం, ఆలస్యంగా వర్షకాల ప్రారంభం వలన గ్రామీణ డిమాండ్‌ ప్రమాదంలో పడిందని తెలిపింది. ఆర్ధిక సంవత్సరం ద్వితియార్ధంలో డిమాండ్‌ తిరిగి పుంజుకునే అవకాశం ఉందని వివరించింది. ‘ప్రభుత్వం, ఆర్బీఐలు ఎన్‌బీఎఫ్‌సీ లిక్విడిటీ సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నించడంతో  ఎఫ్‌వై(ఫైనాన్సియల్‌ ఇయర్‌) 20 క్యూ1 స్థాయిల కంటే  తక్కువ బేస్‌తో ఎఫ్‌వై 20 ద్వితియార్థంలో మెరుగుపడే అవకాశం ఉంది’ అని నోముర విశ్లేషకులు తెలిపారు. తక్కువ ఆపరేటింగ్‌ లెవరేజీ వలన నోముర  ఆటో రంగ ఈబీఐటీడీఏ మార్జిన్లను 250 బేసిస్‌ పాయింట్లు తగ్గించింది.

గత క్వార్టర్‌లానే: మోతిలాల్‌ ఓస్వాల్‌
  గత త్రైమాసికం నుంచి ఎదుర్కొంటున్న  ప్రతికూల డిమాండ్‌  వలన ఆటో రంగ జూన్‌ త్రైమాసిక ఫలితాలు బలహీనంగానే ఉండనున్నాయని మోతిలాల్‌ ఓస్వాల్‌ బ్రోకరేజీ తెలిపింది. లిక్విడిటీ సమస్యలు, వినియోగం తగ్గడం, ఆర్థిక మందగమన మధ్యలో సాధరణ ఎన్నికలు రావడంతో రిటైల్‌ డిమాండ్‌ మరింత క్షిణించిందని వివరించింది. ఆటోరంగ కంపెనీలు ఉత్పత్తిలో కోత విధించినప్పటికి అన్ని విభాగాలలో వాహనాల నిల్వలు పేరుకుపోయాయని తెలిపింది. ఎఫ్‌వై20, ఎఫ్‌వై21గాను ఈ బ్రోకరేజి కవరేజి కింద ఉన్న అన్ని ఆటో కంపెనీల ఈపీఎస్‌ అంచనాలను తగ్గించింది. ఎఫ్‌వై 20  ఈపీఎస్‌ అంచనాలలో  అశోక్‌ లేలాండ్‌ (18 శాతం), మారుతి సుజుకీ ఇండియా (13.5 శాతం), ఎం అండ్‌ ఎం (12 శాతం) సంస్థల అంచనాలను అత్యధికంగా తగ్గించింది. పాట్‌ విలువలలో (వై ఓ వై ప్రకారం) మారుతి సుజుకీ 31 శాతం, ఎం అండ్‌ ఎం 20 శాతం తగ్గుతాయని మోతిలాల్‌ ఓస్వాల్‌ తెలిపింది. టాటా మోటర్స్‌ కన్సాలిడేటెడ్‌ ఆదాయం 15 శాతం తగ్గుతుందని, దీంతో నికర నష్టం రూ. 1.180 కోట్లుగా ఉంటుందని తెలిపింది. 

ఆదాయాలు తగ్గనున్నాయి: రిలయన్స్‌ సెక్యురిటీష్‌  
తమ యూనివర్సల్‌ కవరేజి కింద ఉన్న ఆటో రంగ కంపెనీల జూన్‌ త్రైమాసిక ఫలితాలలో ఆదాయం 7.5 శాతం(వై ఓ వై ప్రకారం) తగ్గుతుందని రిలయన్స్‌ సెక్యూరిటీష్‌ అంచనావేసింది. ఈ కంపెనీల (టాటా మోటర్స్‌ విడిచిపెట్టి) పాట్‌ విలువ 25 శాతం పడిపోతుందిని తెలిపింది. టాటా మోటర్స్‌ను కూడా కలుపుకుంటే (వై ఓ వై ప్రకారం) పాట్‌ విలువ 30 శాతం, క్యూఓక్యూ ప్రకారం 55 శాతం తగ్గుతుందని వివరించింది. ‘అధిక ఇన్‌పుట్‌ ఖర్చులు, ప్రతికూల ఆపరేటింగ్‌ లెవరేజ్‌, ప్రోత్సాహకాలు/రాయితీల వలన అధిక ఖర్చులు కారణాన ఆటోరంగం నష్టపోతుంది’ అని తెలిపింది.   
 You may be interested

గూగుల్ మ్యాప్స్‌లో డైనింగ్ ఆఫర్లు

Friday 12th July 2019

న్యూఢిల్లీ: భారతీయ యూజర్స్‌ కోసం గూగుల్ మ్యాప్స్ తాజాగా మరో మూడు ఫీచర్స్‌ ప్రవేశపెట్టింది. 11 నగరాల్లోని స్థానిక హోటళ్లలో డీల్స్‌ను తెలుసుకునేందుకు ఉపయోగపడే ఆఫర్ ఫీచర్ వీటిలో ఉంది. హైదరాబాద్‌, ఢిల్లీ, ముంబై, బెంగళూరు, పుణె మొదలైనవి ఈ జాబితాలో ఉన్నాయి. ఈజీడైనర్ సంస్థతో కలిసి 'ఆఫర్‌' ఫీచర్ అందిస్తున్నట్లు గూగుల్ వెల్లడించింది. దీనితో 4,000 పైచిలుకు రెస్టారెంట్స్‌లో ఆఫర్స్ గురించి తెలుసుకోవచ్చు. ఎక్స్‌ప్లోర్ ట్యాబ్‌లో ఆఫర్స్‌ షార్ట్‌కట్‌ను

బేరిష్‌గా మారుతున్న ఎఫ్‌పీఐలు

Friday 12th July 2019

విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు బడ్జెట్‌ అనంతరం దేశీయ స్టాక్‌ మార్కెట్‌పై బేరిష్‌గా మారుతున్నారు. బడ్జెట్‌ అనంతరం నాలుగు సెషన్లలో వీరు దాదాపు రూ.2వేల కోట్ల షేర్లు విక్రయించారు. ఇండెక్స్‌ ఫ్యూచర్స్‌లో ఎఫ్‌పీఐలు బేరిష్‌బెట్స్‌ పెంచుకుంటున్నారు. అధికాదాయ వర్గాలపై పన్ను పెంపు, సర్‌చార్జీ విధింపులు ఎఫ్‌పీఐల సెంటిమెంట్‌ను దెబ్బతీసాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇందుకు తగ్గట్లే నిఫ్టీ ఫ్యూచర్స్‌లో ఎఫ్‌ఐఐ లాంగ్‌ షార్ట్‌ నిష్పత్తి 47కు చేరువైంది. ఫిబ్రవరి తర్వాత ఈ నిష్పత్తి

Most from this category