STOCKS

News


యాపిల్‌ ఫలితాల జోష్‌

Wednesday 29th January 2020
Markets_main1580271853.png-31283

లాభాలతో ముగిసిన అమెరికా మార్కెట్లు
డిసెంబర్‌ క్వార్టర్‌లో యాపిల్‌ అమ్మకాల జోరు
ఆదాయంలో సగం వాటాను ఆక్రమించిన ఐఫోన్లు
సరికొత్త గరిష్టానికి చేరువలో యాపిల్‌ షేరు  

ఐఫోన్లు, ఐప్యాడ్‌ల దిగ్గజం యాపిల్‌ ఇంక్‌ ఫలితాలపై అంచనాలు మంగళవారం అమెరికా స్టాక్‌ మార్కెట్లకు జోష్‌నిచ్చాయి. వెరసి కరోనా వైరస్‌ ఆందోళనల నుంచి బయటపడి లాభాలతో ముగిశాయి. యాపిల్‌ పనితీరుపై అంచనాలతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడ్డారు. దీంతో యాపిల్‌ షేరు దాదాపు 3 శాతం జంప్‌చేసింది. దాదాపు 318 డాలర్ల వద్ద ముగిసింది. ఫలితంగా ఎస్‌అండ్‌పీ టెక్నాలజీ ఇండెక్స్‌ 2 శాతం బలపడింది. దీనికితోడు ఫైనాన్సియల్‌ స్టాక్స్‌ జోరందుకున్నాయి. ఇది డోజోన్స్‌, ఎస్‌అండ్‌పీ, నాస్‌డాక్‌లకు బలాన్నిచ్చినట్లు నిపుణులు పేర్కొన్నారు. డోజోన్స్‌ 186 పాయింట్లు(0.65 శాతం) ఎగసి 28,722 వద్ద నిలవగా.. ఎస్‌అండ్‌పీ 33 పాయింట్లు(1 శాతం) పుంజుకుని 3276 వద్ద ముగిసింది. ఇక నాస్‌డాక్‌ మరింత అధికంగా 130 పాయింట్లు(1.5 శాతం) జంప్‌చేసి 9,270 వద్ద స్థిరపడింది.

త్రైమాసిక అమ్మకాల రికార్డ్‌ 
డిసెంబర్‌ త్రైమాసిక ఫలితాలను యాపిల్‌ ఇంక్‌ మార్కెట్లు ముగిశాక విడుదల చేసింది. క్యూ4(అక్టోబర్‌-డిసెంబర్‌)లో యాపిల్‌ మొత్తం ఆదాయం దాదాపు 92 బిలియన్‌ డాలర్లకు చేరగా.. దీనిలో ఐఫోన్‌ విక్రయాల వాటానే 56 బిలియన్‌ డాలర్లవరకూ ఆక్రమించడం విశేషం! తద్వారా యాపిల్‌ కంపెనీ చరిత్రలోనే ఒక త్రైమాసికంలో 2017 హాలిడే సీజన్‌ తదుపరి ఐఫోన్‌ విభాగం అత్యధిక విక్రయాలు సాధించింది. 

వాచీలు, ఐపోడ్స్‌ సైతం​
ఐఫోన్ల బాటలో యాపిల్‌ వాచీలు, ఐపోడ్‌ విభాగం సైతం ఒక త్రైమాసికంలో తొలిసారి 10 బిలియన్‌ డాలర్లను అధిగమించాయి. అంచనాలను మించిన ఫలితాలు సాధించడంతో ఫ్యూచర్స్‌ మార్కెట్లోనూ ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో యాపిల్‌ షేరు మరో 1.5 శాతం బలపడింది. 322.6 డాలర్లకు చేరింది. తద్వారా చరిత్రాత్మక గరిష్టం 323 డాలర్లకు చేరువైంది. కరోనా వైరస్‌ ప్రభావం చూపుతున్న 2020 తొలి క్వార్టర్‌(జనవరి-మార్చి)లోనూ కంపెనీ 63-67 బిలియన్‌ డాలర్ల అమ్మకాలను యాపిల్‌ అంచనా వేయడం గమనార్హం! విశ్లేషకులు 62 బిలియన్‌ డాలర్ల ఆదాయాన్ని ఊహిస్తున్నారు. కరోనా వైరస్‌ కారణంగా చైనాలోని వుహాన్‌కు బదులుగా ఇతర ప్రాంతాల నుంచి ఐఫోన్ల సరఫరాలు పెంచనున్నట్లు యాపిల్‌ ఇంక్‌ సీఈవో టిమ్‌ కుక్‌ ఫలితాల సందర్భంగా పేర్కొ‍న్నారు. కాగా.. గత మూడు నెలల్లోనూ యాపిల్‌ షేరు 27 శాతం ర్యాలీ చేయడం విశేషం! You may be interested

ఆరోగ్యానికి రూ.1.50లక్షల కోట్లు అవసరం

Wednesday 29th January 2020

ఆరోగ్య సేవలకు రూ.1,50,000 కోట్లు కేటాయించాలి పరిశోధన, అభివృద్ధికి చేసిన వ్యయాలపై పన్ను ప్రయోజనాలను రానున్న బడ్జెట్‌లో తిరిగి పునరుద్ధరించాలని భారత ఔషధ పరిశ్రమ ఆశిస్తోంది. దేశంలో ఆవిష్కరణలను పెంచాలంటే 2010 బడ్జెట్‌లో ఇచ్చినట్టుగా 200 శాతం వెయిటెడ్‌ ట్యాక్స్‌ డిడక్షన్‌ ఇవ్వాలని ఇండియన్‌ ఫార్మాస్యూటికల్‌ అలయన్స్‌ (ఐపీఏ) సెక్రటరీ జనరల్‌ సుదర్శన్‌ జైన్‌ ప్రభుత్వాన్ని కోరారు. సగటున కంపెనీలు ఆర్‌అండ్‌డీపై 2012లో 5.3 శాతం వెచ్చిస్తే, గత ఆర్థిక

లాభాలతో మార్కెట్‌ ప్రారంభం

Wednesday 29th January 2020

12100 పైన ప్రారంభమైన నిఫ్టీ 200 పాయింట్లు లాభంతో మొదలైన సెన్సెక్స్‌ కలిసొచ్చిన షార్ట్‌ కవరింగ్‌ అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల వాతావరణం రెండు రోజుల వరుస నష్టాల ముగింపు తర్వాత బుధవారం దేశీయ మార్కెట్‌ లాభంతో మొదలైంది. సెన్సెక్స్‌ 200 పాయింట్ల లాభంతో 41158.00 వద్ద, నిఫ్టీ 59 పాయింట్లు పెరిగి 12,115 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. కరోనా వైరస్‌ భయాలు కొంత తగ్గడంతో అంతర్జాతీ మార్కెట్లలో సానుకూల వాతవరణం నెలకొంది. నిన్నరాత్రి అమెరికా మార్కెట్లు

Most from this category