News


ఏపీఎల్‌, స్టెర్లింగ్‌ జూమ్‌- డిష్‌మన్‌ బోర్లా

Wednesday 1st January 2020
Markets_main1577870786.png-30590

కొత్త ఏడాది తొలి రోజు హుషారుగా ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్లు మిడ్‌సెషన్‌కల్లా కొంతమేర మందగించాయి. 2.30 ప్రాంతంలో స్వల్ప లాభాలతో కదులుతున్నాయి. ఈ నేపథ్యంలో విభిన్న వార్తల ఆధారంగా ఏపీఎల్‌ అపోలో ట్యూబ్స్‌, స్టెర్లింగ్‌ అండ్‌ విల్సన్‌ సోలార్‌ కౌంటర్లు ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. ఈ కౌంటర్లలో కొనుగోళ్లు పెరగడంతో లాభాలతో సందడి చేస్తున్నాయి. అయితే మరోవైపు ఐటీ సోదాలలో ఖాతాలలో చూపని సొమ్ము లభించినట్లు వెలువడిన వార్తలు డిష్‌మన్‌ కార్బోజెన్‌ ఎమిక్స్‌ కౌంటర్లో భారీ అమ్మకాలకు కారణమైనట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. వివరాలు చూద్దాం..

ఏపీఎల్‌ అపోలో ట్యూబ్స్‌
ఈ ఆర్థిక సంవత్సరం(2019-20) క్యూ3(అక్టోబర్‌-డిసెంబర్‌)లో అమ్మకాలు దాదాపు 53 శాతం జంప్‌చేసి 480225 ఎంటీపీఏను తాకినట్లు ఏపీఎల్‌ అపోలో ట్యూబ్స్‌ తాజాగా వెల్లడించింది. 2018-19 క్యూ3లో 314707 ఎంటీపీఏ అమ్మకాలు మాత్రమే నమోదయ్యాయి. బిల్డింగ్‌ మెటీరియల్‌ స్టీల్‌ ప్రొడక్టుల ఈ సంస్థ షేరు దీంతో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో దాదాపు 3 శాతం పెరిగి రూ. 1932 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 1939ను తాకింది. ఇది 52 వారాల గరిష్టంకాగా.. నవంబర్‌ 8 నుంచీ చూస్తే ఈ కౌంటర్‌ 35 శాతం ర్యాలీ చేయడం విశేషం!

స్టెర్లింగ్‌ అండ్‌ విల్సన్‌ సోలార్‌
కంపెనీ ప్రమోటర్‌ షాపూర్‌జీ పల్లోంజీ గ్రూప్‌ తాజాగా రూ. 750 కోట్ల రుణాలను తిరిగి చెల్లించినట్లు స్టెర్లింగ్‌ అండ్‌ విల్సన్‌ సోలార్‌ తెలియజేసింది. దీంతో డిసెంబర్‌ 31కల్లా రూ. 1000 కోట్ల రుణ చెల్లింపులను పూర్తి చేసినట్లు వెల్లడించింది. మిగిలిన రూ. 1644 కోట్ల రుణాలనూ రానున్న కాలంలో తీర్చివేయనున్నట్లు వివరించింది. దీంతో తొలుత ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 5 శాతం జంప్‌చేసింది. రూ. 339ను అధిగమించింది. ప్రస్తుతం 2.7 శాతం లాభంతో రూ. 332 వద్ద ట్రేడవుతోంది.

డిష్‌మన్‌ కార్బొజెన్‌ ఎమిక్స్‌
గత నెలలో డిష్‌మన్‌ కార్బొజెన్‌ ఎమిక్స్‌ కంపెనీ కార్పొరేట్‌ కార్యాలయాలలో సోదాలు నిర్వహించిన ఆదాయపన్ను శాఖ రూ. 160 కోట్లకుపైగా లెక్కల్లోచూపని నగదును కనుగొన్నట్లు తాజాగా వార్తలు వెలువడ్డాయి. దీంతో నేటి ట్రేడింగ్‌లో డిష్‌మన్‌ కార్బొజెన్‌ కౌంటర్లో ఇన్వెస్టర్లు అమ్మకాలకు క్యూకట్టారు. ఫలితంగా ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 10 శాతం లోయర్‌ సర్క్యూట్‌ను తాకింది. రూ. 8.40 నష్టంతో రూ. 76 వద్ద ఫ్రీజయ్యింది. అయితే ఈ వార్తలను కంపెనీ ఖండించడం గమనార్హం! కాగా.. అంతక్రితం ఐటీ సోదాల వార్తల కారణంగా ఈ షేరు డిసెంబర్‌ మూడో వారంలో వరుసగా నాలుగు రోజులపాటు పతనమైంది. 26కల్లా రూ. 71కు పడిపోయింది. ఇది ఆల్‌టైమ్‌ కనిష్టం!You may be interested

ఏటీఎఫ్‌ ధరల పెంపు: అయినా లాభాల్లో ఏవియేషన్‌ షేర్లు

Wednesday 1st January 2020

విమాన ఇంధన (ఏటీఎఫ్) ధరలు వరుసగా రెండో నెలలో పెరిగాయి. ఏటీఎఫ్ ధరను సరాసరిన కిలోలీటరుకు రూ.1,637.25(2.5శాతం) మేర పెంచుతున్నట్లు చమురు కంపెనీలు బుధవారం వెల్లడించాయి. అలాగే నాన్ సబ్సిడీ ఎల్పీజీ (లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్) లేదా కుకింగ్ గ్యాస్ సిలిండర్ ధర రూ.19లు మేర పెరిగాయి. పెరిగిన ధరలు బుధవారం నుంచి అమల్లోకి వస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరగడంతో పాటు డాలరు మారకంలో రూపాయి విలువ

ఇన్‌ఫ్రా ప్లాన్‌తో లాభపడే 5 షేర్లివే!

Wednesday 1st January 2020

నిపుణుల అంచనా తాజాగా కేంద్రం ప్రకటించిన ఎన్‌ఐపీ(నేషనల్‌ ఇన్‌ఫ్రా పైప్‌లైన్‌)తో రూ. 102 కోట్ల పెట్టుబడుల వరద ప్రవహించనుంది. మరో రెండు మూడు రోజుల్లో ఇంకో రూ.3 లక్షల కోట్ల ప్లాన్స్‌ను సైతం ప్రభుత్వం ప్రకటించనుంది. దీంతో మొత్తం ఇన్‌ఫ్రా పెట్టుబడులు రూ. 105 లక్షల కోట్లకు చేరనున్నాయి. దాదాపు 18 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ ప్రాజెక్టులు చేపడతారు. ఈ వ్యయంలో ప్రైవేట్‌ రంగం వాటా 22 శాతం కాగా,

Most from this category