News


ఏపీఎల్‌ జూమ్‌- వెండిట్‌, బీవోబీ బోర్లా

Monday 27th January 2020
Markets_main1580100619.png-31228

క్యూ3(అక్టోబర్‌-డిసెంబర్‌) ఫలితాల ఎఫెక్ట్‌
ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న కరోనా వైరస్‌ కారణంగా దేశీ స్టాక్‌ మార్కెట్లలో అమ్మకాలు తలెత్తాయి. దీంతో బలహీనంగా ప్రారంభమైన మార్కెట్లు నేలచూపులతో కదులుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2019-20) మూడో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతో ఏపీఎల్‌ అపోలో ట్యూబ్స్‌ కౌంటర్‌కు డిమాండ్‌ కనిపిస్తోంది. అయితే మరోపక్క ఈ ఏడాది క్యూ3(అక్టోబర్‌-డిసెంబర్‌)లో సాధించిన ఫలితాలు ఇన్వెస్టర్లను నిరాశపరచడంతో వెండిట్‌ ఇండియా, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా కౌంటర్లు అమ్మకాలతో డీలాపడ్డాయి. వెరసి ఉదయం 10 ప్రాంతంలో ఏపీఎల్‌ అపోలో షేరు లాభాలతో సందడి చేస్తోంటే.. వెండిట్‌, బీవోబీ నష్టాలతో కళతప్పాయి. వివరాలు చూద్దాం..

ఏపీఎల్‌ అపోలో ట్యూబ్స్‌
కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన ఈ ఏడాది క్యూ3(అక్టోబర్‌-డిసెంబర్‌)లో ఏపీఎల్‌ అపోలో ట్యూబ్స్‌ రూ. 74 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఇది ఏకంగా 477 శాతం వృద్ధికాగా.. నికర అమ్మకాలు 26 శాతం పెరిగి రూ. 2040 కోట్లను అధిగమించాయి. పన్నుకు ముందు లాభం సైతం​ 465 శాతం ఎగసి రూ. 111 కోట్లకు చేరింది. స్టీల్‌ ట్యూబ్స్‌ తయారీ ఈ కంపెనీ అమ్మకాల పరిమాణం 52 శాతం పెరిగి 4.8 లక్షల టన్నులను తాకింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఏపీఎల్‌ అపోలో షేరు 7 శాతం జంప్‌చేసి రూ. 2176 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 2219 వరకూ ఎగసింది. ఇది 52 వారాల గరిష్టం!

వెండిట్‌ ఇండియా
ఈ ఆర్థిక సంవత్సరం క్యూ3(అక్టోబర్‌-డిసెంబర్‌)లో వెండిట్‌ ఇండియా లిమిటెడ్‌ నికర లాభం 59 శాతం పడిపోయి రూ. 2.2 కోట్లకు పరిమితమైంది. మొత్తం ఆదాయం సైతం 22 శాతం నీరసించి రూ. 34 కోట్లకు చేరింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో వెండిట్‌ ఇండియా షేరు 3 శాతం క్షీణించి రూ. 2760 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 2552 వద్ద కనిష్టాన్ని తాకింది.

బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా
ఈ ఆర్థిక సంవత్సరం క్యూ3(అక్టోబర్‌-డిసెంబర్‌)లో బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా రివర్స్‌ టర్న్‌అరౌండ్‌ ఫలితాలు ప్రకటించింది. ఈ క్యూ3లో రూ. 1407 కోట్ల నికర నష్టం ప్రకటించింది. గతేడాది(2018-19) క్యూ3లో రూ. 737 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఇక నికర వడ్డీ ఆదాయం నామమాత్ర వృద్ధితో రూ. 7129 కోట్లకు చేరింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో బీవోబీ షేరు 3.5 శాతం పతనమై రూ. 92 వద్ద ట్రేడవుతోంది. 



You may be interested

నేటి వార్తల్లోని షేర్లు

Monday 27th January 2020

వివిధ వార్తలకు అనుగుణంగా సోమవారం స్టాక్‌ మార్కెట్లో ప్రభావితమయ్యే షేర్లు ఈఐహెచ్‌: ఈఐహెచ్‌ క్యూ3 నికర లాభం 5.3 శాతం పెరిగి రూ.95 కోట్లకు చేరింది. వార్షికప్రాతిపదికన  ఆదాయం 3.8 శాతం తగ్గి రూ.505.5 కోట్లుగా నమోదైంది. జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌: ఈ కంపెనీ క్యూ3 నికర లాభం 88.3 శాతం పెరిగి రూ.187 కోట్లకు చేరింది. వార్షిక ప్రాతిపదికన ఆదాయం 11 శాతం తగ్గి రూ.18,055 కోట్లుగా నమోదైంది. ఏపీఎల్‌ అపోలో ట్యూబ్స్‌: ఈ

రూ.40,600 పైకి పెరిగిన పుత్తడి

Monday 27th January 2020

గత మూడు నాలుగు రోజులుగా బంగారం ధర స్వల్పంగా పెరుగుతూ వస్తూ సోమవారం నాటికి రూ.40,600  చేరింది. చైనాలో వ్యాపిస్తున్న కరోనా వైరస్‌ దాటికి స్టాక్‌ మార్కెట్లు పతనం  కావడంతో ఇన్వెస్టర్లు రక్షణాత్మక పెట్టుబడులపై దృష్టి పెట్టడంతో మరోసారి బంగారం ధర పెరిగింది. సోమవారం దేశీయ ఎంసీఎక్స్‌లో  10 గ్రాముల బంగారం  ధర మధ్యహ్నం 3 గంటల ప్రాంతంలో రూ.309 పెరిగి రూ.40,661.00 వద్ద ట్రేడ్‌ అవుతోంది. కాగా  శుక్రవారం

Most from this category