News


కరోనాతో ఏపీఐ ఫార్మా షేర్ల లాభాల పంట!

Thursday 20th February 2020
Markets_main1582188441.png-31960

నాట్కో ఫార్మా, ‍శిల్పా మెడి, గ్రాన్యూల్స్‌కు జోష్‌
గత రెండు నెలల్లో 40- 110 శాతం మధ్య ప్లస్‌

దేశీయంగా యాక్టివ్‌ ఫార్మాస్యూటికల్‌ ఇన్‌గ్రెడియంట్స్‌(ఏపీఐ) తయారు చేసే కంపెనీల కౌంటర్లు గత కొద్ది రోజులుగా జోరు చూపుతున్నాయి. ఫార్ములేషన్స్‌, ఫినిష్డ్‌ డోసేజీల తయారీలో వినియోగించే ఏపీఐలను దేశీయంగా పలు కంపెనీలు రూపొందిస్తున్నాయి. అయితే చైనా నుంచి సైతం అధిక శాతంలో దేశీ హెల్త్‌కేర్‌ దిగ్గజాలు ఏపీఐలు, ఇంటర్మీడియెట్లను దిగుమతి చేసుకుంటుంటాయి. ఇటీవల చైనాలోని హుబే ప్రొవిన్స్‌లో ప్రాణాంతక కరోనా వైరస్‌ వ్యాపించడంతో అక్కడి పారిశ్రామిక ప్రాంతాలన్నిటా ఉత్పత్తి నిలిచిపోయింది. ఇది దేశీయంగా ఏపీఐ తయారీ కంపెనీలకు మరిన్ని అవకాశాలు సృష్టించనున్నట్లు పరిశ్రమవర్గాలు పేర్కొంటున్నాయి. దీంతో గత రెండు నెలలుగా ర్యాలీ బాట పట్టిన ఏపీఐ తయారీ కంపెనీల షేర్లు ఇటీవల కొద్ది రోజులుగా మరింత దూకుడు ప్రదర్శిస్తున్నాయి. వివరాలు చూద్దాం..

విదేశీ అవకాశాలు..
ప్రపంచవ్యాప్తంగా ప్రిస్క్రిప్షన్‌ ఔషధాలను తయారు చేసే ఫార్మా దిగ్గజాలు చైనా నుంచి అధిక పరిమాణంలో ఏపీఐలు, ఇంటర్మీడియెట్లను దిగుమతి చేసుకుంటుంటాయని విశ్లేషకులు చెబుతున్నారు. కరోనా కారణంగా చైనాలో పలు ఫార్మా యూనిట్లు మూతూపడటంతో ఇండియావంటి మార్కెట్లవైపు దృష్టిసారిస్తున్నట్లు తెలియజేశారు. త్వరితగతిన నియం‍త్రణ సంస్థల అనుమతులు పొందగలడం, యూఎస్‌ఎఫ్‌డీఏ ప్రమాణాలు తదితర అంశాలు దేశీ కంపెనీలకు అవకాశాలను పెంచే వీలున్నట్లు తెలియజేశారు. దీంతో ఇటీవల దేశీ ఏపీఐ కంపెనీల ప్రొడక్టులపట్ల ఎంక్వయిరీలు పెరిగినట్లు వివరించారు. ఈ నేపథ్యంలో హెల్త్‌కేర్‌ రంగ హైదరాబాద్‌ కంపెనీలు నాట్కో ఫార్మా, గ్రాన్యూల్స్‌ ఇండియా తదితరాలు లబ్ది పొందనున్నట్లు పేర్కొన్నారు. నిజానికి చైనా నుంచి దిగుమతులకే అధిక ప్రాధాన్యం ఇస్తుండటంతో దేశీయంగా పలు కంపెనీలు ఉత్పత్తి సామర్థ్యాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోవడంలేదని పారిశ్రామిక సమాఖ్య(సీఐఐ) చెబుతోంది. వెరసి ఇకపై ప్లాంట్లలో ఉత్పత్తి పెరిగే వీలున్నదని జియోజిత్‌ ఫైనాన్షియల్స్‌ అభిప్రాయపడింది. 

షేర్లు ర్యాలీ
వెటరినరీ ఏపీఐలను సైతం తయారు చేయగల లాసా సూపర్‌జనరిక్స్‌ షేరు ఈ ఏడాది ఇప్పటివరకూ 108 శాతం దూసుకెళ్లగా.. ఈ బాటలో గత రెండు నెలల్లో శిల్పా మెడికేర్‌, గుజరాత్‌ థెమిస్‌, సొలారా యాక్టివ్‌ ఫార్మా, గ్రాన్యూల్స్‌ ఇండియా, వేన్‌బరీ, వొకార్డ్‌ కౌంటర్లు 60-40 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా.. ఏపీఐల ధరలు పెరగడం ద్వారా ఫినిష్‌డ్‌ ప్రొడక్టులను తయారు చేసే కంపెనీలపై భారం పడే వీలున్నట్లు జియోజిత్‌ అంచనా వేస్తోంది. సన్‌ ఫార్మా, లుపిన్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, అరబిందో తదితరాలను ఈ సందర్భంగా పేర్కొంటోంది. ఈ ఏడాది క్యూ3(అక్టోబర్‌- డిసెంబర్‌)లో పటిష్ట ఫలితాలు ప్రకటించిన గ్రాన్యూల్స్‌ రానున్న రెండేళ్లలో మార్జిన్లను 5.4 శాతంవరకూ పెంచుకునే వీలున్నట్లు జియోజిత్‌ అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో గ్రాన్యూల్స్‌ షేరుకి రూ. 190 టార్గెట్‌ను ప్రకటించింది. సెంట్రమ్‌ సైతం రూ. 205 టార్గెట్‌ ధరను ఇచ్చింది.

మార్చి నుంచి
నిజానికి రెండు నెలలకు సరిపడా ఏపీఐలను ఫార్మా కంపెనీలు నిల్వ పెట్టుకుంటాయని పరిశ్రమవర్గాలు తెలియజేశాయి. ఫిబ్రవరి చివరికల్లా పరిస్థితులు కుదురుకుని చైనాలో ఉత్పత్తి పూర్తిస్థాయిలో ప్రారంభమైతే సమస్యలుండవని వివరించాయి. లేదంటే.. ఏపీఐలకు కొరత ఏర్పడటంతోపాటు ధరలు భారీగా పెరిగే అవకాశమున్నదని అంచనా వేస్తున్నాయి. ఇప్పటికే పారాసెట్మల్‌ ధరలు 40 శాతం బలపడినట్లు పేర్కొన్నాయి. ఇక యాంటీబాక్టీరియల్‌ ఔషధాల తయారీకి వినియోగించే ఎజిత్రోమైసిన్‌ ధరలు 70 శాతం జంప్‌చేసినట్లు చెబుతున్నాయి.

 You may be interested

ఔన్స్‌ బంగారం 2000 డాలర్లకు...?

Thursday 20th February 2020

రోజురోజుకి బంగారం ధరలు రాకెట్‌లా దూసుకుపోతున్నాయి.కోవిడ్‌-19 ప్రభావంతో గురువారం ప్రపంచ మార్కెట్లో ఏడేళ్లగరిష్టానికి పసిడి ధరలు చేరుకున్నాయి. అయితే వైరస్‌ ప్రభావం ఆర్థిక వృద్ధిపై పడకుండా  చైనా కొన్ని సహాయక చర్యలు చేపట్టనున్నట్లు ప్రకటించడంతో అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్‌ బంగారం ధర దాదాపు 2 వేల డాలర్లకు చేరే అవకాశం ఉందని సిటీగ్రూపుకు చెందిన కమోడిటీ నిపుణులు అంచనా వేస్తున్నారు. బుధవారం ఫ్యూచర్‌లో ఔన్స్‌ బంగారం ధర 8.20 డాలర్లు

రూ.2,000కు చేరువలో ఐఆర్‌సీటీసీ

Thursday 20th February 2020

దలాల్‌ స్ట్రీట్‌లో ఐఆర్‌సీటీసీ షేరు పరుగులు ఆపడం లేదు. షేరు గురువారం ట్రేడింగ్‌లో మరోసారి కొత్త జీవితకాల గరిష్టాన్ని నమోదు చేసి, రూ.2,000 మ్యాజిక్‌ మార్క్‌కు చేరువయ్యింది. నేడు ఈ షేరు బీస్‌ఈలో రూ.1875.00 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. మార్కెట్‌ ఆరంభం నుంచి ఇన్వెస్టర్లు ఈ షేరు కొనుగోలుకు మొగ్గుచూపడంతో ఒక దశలో 6శాతం పెరిగి రూ.1939.80 వద్ద కొత్త జీవితకాల గరిష్టాన్ని నమోదు చేసింది. లిస్టింగ్‌ ధర నుంచి

Most from this category