News


కరెక్షన్‌కు ఈ స్థాయిలో బ్రేక్‌ పడుతుందా..?

Tuesday 6th August 2019
Markets_main1565029920.png-27555

స్టాక్‌ మార్కెట్లు సోమవారం కూడా నష్టాల పాలయ్యాయి. కేంద్ర ప్రభుత్వ తాజా నిర్ణయాలు, వాణిజ్య యుద్ధం విషయమై తాజా ఆందోళనలు అమ్మకాలకు దారితీయడంతో నష్టాలు తప్పలేదు. ఐటీ సూచీ తరహా అన్నీ నష్టాల్లోనే ఉన్నాయి. మిడ్‌క్యాప్‌ సూచీ 1.4 శాతం, స్మాల్‌క్యాప్‌ సూచీ 2 శాతం మేర నష్టపోయాయి. ఈ నేపథ్యంలో స్టాక్‌ సూచీల తదుపరి గమనంపై నిపుణుల విశ్లేషణ పరిశీలిస్తే...

 

నిఫ్టీ సమీప ట్రెండ్‌ ప్రతికూలంగానే ఉంటుంది. హ్యామర్‌ తరహా క్యాండిల్‌ ప్యాటర్న్‌ ఏర్పాటవడం బుల్స్‌ మళ్లీ తిరిగి రావచ్చన్న ఆశలు రేకెత్తిస్తోంది. కానీ, నిఫ్టీ బలంగా నిలదొక్కుకోవడం లేదా అప్‌సైడ్‌ రివర్సల్‌ను ధ్రువీకరించాల్సి ఉంటుంది. అయితే, మార్కెట్లో ఎగువవైపు బౌన్స్‌ అవడం అన్నది సాధ్యం కాకపోవచ్చు’’ అని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ టెక్నికల్‌ రీసెర్చ్‌ అనలిస్ట్‌ నాగరాజ్‌ శెట్టి వివరించారు. నిఫ్టీకి 10,780-10,750 మద్దతు స్థాయిలుగా, 10,970 నిరోధ స్థాయిగా పేర్కొన్నారు.  

 

‘‘నిఫ్టీ రికార్డు గరిష్టాల నుంచి 11 శాతం దిద్దుబాటుకు గురి అయింది. ఇది రెండేళ్ల సగటు స్థాయి. ఈ స్థాయిలు 2017 జవనరి నుంచి కొనసాగుతున్నాయి. ఈ తరహా మద్దతు స్థాయికి సమీపంలో ప్రతిస్పందనను దగ్గరగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. అంతర్గతంగా స్టాక్స్‌ లాభ, నష్టాల రేషియో మెరుగుపడడం, స్థిరత్వం అనేవి తిరిగి కోలుకునేందుకు అవసరం అవుతాయి’’ అని యస్‌ సెక్యూరిటీస్‌ తెలిపింది. 

 

‘‘బేరిష్‌ సెటప్‌ ఉన్నప్పటికీ ఎటువంటి వెలుపలి అంశాల ప్రభావం లేకపోతే నిఫ్టీ సాంకేతికంగా పుల్‌బ్యాక్‌కు అవకాశం లేకపోలేదు. స్వల్పకాల చార్ట్‌ల్లో నిఫ్టీ ఇప్పటికీ ఓవర్‌సోల్డ్‌ (అధిక అమ్మకాల జోన్‌)లోనే ఉన్నట్టు తెలుస్తోంది. ఏమైనా పుల్‌బ్యాక్‌ ఉన్నప్పటికీ అది చాలా పరిమితమే. అధిక స్థాయిల్లో నిలదొక్కుకోకపోవచ్చు. మంగళవారం సెషన్‌లో 10,910-10,950 కీలక నిరోధ స్థాయిలు. 10,800, 10730 మద్దతు స్థాయిలు. అప్రమత్తంగా ఉండాలన్నది మా సూచన’’ అని జెమ్‌స్టోన్‌ ఈక్విటీ రీసెర్చ్‌ అండ్‌ అడ్వైజరీ సర్వీసెస్‌ టెక్నికల్‌ అనలిస్ట్‌ మిలాన్‌ వైష్ణవ్‌ తెలిపారు.

 

‘‘బలమైన డౌన్‌ట్రెండ్‌లోనే ఉన్నప్పటికీ, నిఫ్టీ దీర్ఘకాలిక మద్దతు స్థాయి అయిన 10,783కు సమీపంలో క్లోజవడం కాస్త ఆశాజనకం. ఇక్కడి నుంచి పుల్‌బ్యాక్‌కు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి’’ అని చార్ట్‌వ్యూ ఇండియాకు చెందిన మజర్‌ మహమ్మద్‌ తెలిపారు. నిఫ్టికీ ప్రస్తుత స్థాయి కీలకమని, క్లోజింగ్‌లో దీన్ని కోల్పోతే సూచీ తదుపరి 10,566-497 స్థాయికి దిగజారే అవకాశం ఉందన్నారు. నిఫ్టీ గత కొన్ని వారాలుగా పడిపోతూనే ఉందని, రానున్న సెషన్లలో కన్సాలిడేటెడ్‌ కావచ్చని షేర్‌ఖాన్‌కు చెందిన గౌరవ్‌ రత్నపార్ఖి తెలిపారు. మొత్తం మీద ఇండెక్స్‌ అవుట్‌లుక్‌ బేరిష్‌గానే ఉందన్నారు. You may be interested

విల్సన్‌ సోలార్‌ ఐపీవో నేటి నుంచే... కంపెనీ విశేషాలు

Tuesday 6th August 2019

సోలార్‌ ఇంజనీరింగ్‌, నిర్మాణ రంగ కంపెనీ, షాపూర్‌జీ పల్లోంజీ గ్రూపులో భాగమైన ‘స్టెర్లింగ్‌ అండ్‌ విల్సన్‌ సోలార్‌’ (ఎస్‌డబ్ల్యూఎస్‌ఎల్‌) ఐపీవో ఆగస్ట్‌ 6 నుంచి (మంగళవారం) ప్రారంభం అవుతోంది. ఒక్కో షేరుకు ధరల శ్రేణి రూ.775-780. బుధవారం ( ఈ నెల 8న)తో ఇష్యూ ముగుస్తుంది. ఐపీవోలో కనీసం 19 షేర్లకు (ఒక లాట్‌) దరఖాస్తు చేసుకోవాలి. ఈ ఇష్యూకు ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌, యాక్సిస్‌ క్యాపిటల్‌, క్రెడిట్‌ సూసే ఇండియా,

రేటింగ్‌ కట్‌.. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ డౌన్‌

Monday 5th August 2019

విదేశీ బ్రోకరేజీ సంస్థ క్రెడిట్ సూసీ ముఖేష్‌ అంబానీ కంపెనీ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేరు టార్గెట్‌ ధరను 26 శాతం తగ్గించడంతో ఈ కంపెనీ షేరు విలువ సోమవారం ట్రేడింగ్‌లో 3.66 శాతం నష్టపోయి రూ.1,141.00 వద్ద ముగిసింది. ఈ బ్రోకరేజి రిలయన్స్ ఇండస్ట్రీస్ రేటింగ్‌ను ‘న్యూట్రల్’ నుంచి ‘అండర్‌పెర్‌ఫార్మ్’ కి తగ్గించింది. అంతేకాకుండా ఈ కంపెనీ షేరు టార్గెట్‌ ధరను రూ.1,350 నుంచి రూ.995కు తగ్గించింది. ఆర్థిక సంవత్సరం 2021/22లో

Most from this category