STOCKS

News


ఇన్ఫోసిస్‌ సీఈఓపై మరో ఫిర్యాదు

Tuesday 12th November 2019
Markets_main1573555302.png-29535

  కంపెనీ లాభాలను ఎక్కువ చేసి చూపేందుకు అనైతిక పద్ధతులను ఉపయోగిస్తున్నారని, ఇన్ఫోసిస్‌ సీఈఓ సలీల్‌ పరేఖ్‌పై తాజాగా వచ్చిన విజిల్‌ బ్లోయర్‌ ఫిర్యాదు మరవకముందే, మరోక విజిల్‌ బ్లోయర్‌ ఈ సీఈఓకు వ్యతిరేకంగా కంపెనీ చైర్మన్‌, సహవ్యవస్థాపకుడు నందన్‌ నీలకేని, ఇతర స్వతంత్ర బోర్డు డైరక్టర్లకు లేఖ రాశారని ఐఏఎన్‌ఎస్‌ వార్తా సంస్థ సోమవారం పేర్కొంది. ‘ఇన్ఫోసిస్‌ సీఈఓగా సలీల్‌ పరేఖ్‌ 20 నెలల కిందట నియమితులయ్యారు. నియమావళి ప్రకారం ఆయన బెంగుళూరు నుంచి తన కార్యకలాపాలను కొనసాగించాలి. కానీ ఆయన ఇప్పటికీ కూడా ముంబై నుంచే కంపెనీని ఆపరేట్‌ చేస్తున్నారు’ అని విజిల్‌బ్లోయర్‌  తేది లేని, పేరులేని లేఖలో పేర్కొన్నారు. తాను ఇన్ఫోసిస్‌లో ఫైనాన్స్‌ డిపార్టమెంట్‌లో పనిచేస్తున్నానని, ప్రతీకారం తీర్చుకుంటారన్న భయంతో తన వ్యక్తిగత సమాచారాన్ని బయటపెట్టడంలేదని, దానికి మన్నించాలని, కానీ ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోవాలని ఈ విజిల్‌ బ్లోయర్‌ లేఖలో అన్నారు. ‘కంపెనీలో ఉద్యోగిగా, షేరుహోల్డర్‌గా భాగం పంచుకున్న తనకు, కంపెనీ విలువను తగ్గిస్తున్న సలీల్‌ పరేఖ్‌ గురించి కొన్ని విషయాలను కంపెనీ చైర్మన్‌, స్వతంత్ర డైరక్టర్లతో పంచుకోవడం నా బాధ్యతగా బావిస్తున్నాను. కంపెనీపై అధికంగా నమ్మకం పెట్టుకున్న ఉద్యోగులు, షేర్‌హోల్డర్లకు అనుగుణంగా మీరు కూడా తమ బాధ్యతను నిర్వర్తిస్తారని ఆశిస్తున్నాను’ అని లేఖలో పేర్కొన్నారు. కంపెనీ రెండు నెలల సమయం ఇచ్చినప్పటికి సలీల్‌ పరేఖ్‌ బెంగుళూరుకు మారలేదు. కంపెనీ హెడ్‌ ఆఫిస్‌ను నెలకు రెండు సార్లు సందర్శిస్తారని ఈ ఉద్యోగి లేఖలో పేర్కొన్నారు. ‘సీఈఓ సందర్శన కోసం ​విమాన ఖర్చులు, స్థానిక రవాణా రూపేణా కంపెనీ రూ. 22 లక్షలను ఖర్చు చేస్తోంది. నెలకు నాలుగు బిజినెస్‌ క్లాస్‌ విమాన టికెట్లు, ముంబైలో ఇంటి నుంచి ఎయిర్‌పోర్టుకు డ్రాపింగ్‌, బెంగుళూరులో ఎయిర్‌పోర్టు నుంచి ఆఫిస్‌కు పికప్‌, అలానే తిరుగు ప్రయాణంలో కూడా’ అని ఈ విజిల్‌బ్లోవర్‌ ఆరోపించారు. ఈ వార్త విడుదలయ్యే సమయానికి, దీనిపై ఇన్ఫోసిస్‌ ఎటువంటి వ్యాఖ్యలను చేయలేదు. You may be interested

డీమోనిటైజేషన్‌ స్థాయికి క్యూ2 రుణ వృద్ధి

Tuesday 12th November 2019

దేశ ఆర్థిక వృద్ధి రికవరీకి ఇంకా చాలా సమయమే పడుతుందన్న దానికి నిదర్శంగా ఒకవైపు ఆటో అమ్మకాలు బలహీనంగా ఉండగా, మరోవైపు జూలై-సెప్టెంబర్‌ త్రైమాసికంలో రుణాల వృద్ధి 6 శాతానికి తగ్గి, తిరిగి డీమోనిటైజేషన్‌ కనిష్టానికి చేరింది. ఈ విషయాన్ని క్రెడిట్‌సూసే ఒక నివేదిక ద్వారా తెలియజేసింది. సెప్టెంబర్‌ త్రైమాసికంలో రుణాల వృద్ధి 6 శాతంగా ఉందని పేర్కొంది. ఎన్‌బీఎఫ్‌సీ రంగంలో రుణాల వృద్ధి తిరిగి గాడిన పడిందని, వార్షికంగా

బంగారం ఈటీఎఫ్‌ల్లో అమ్మకాలు

Tuesday 12th November 2019

బంగారం ఈటీఎఫ్‌ల నుంచి ఇన్వెస్టర్లు ఈ అక్టోబర్‌లో రూ.31కోట్ల పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. అంతకుముందు రెండునెలల్లో బంగారం ఈటీఎఫ్‌ల్లోకి దాదాపు రూ.200 కోట్ల నికర పెట్టుబడులు ప్రవహించగా, అక్టోబర్‌లో మాత్రం కొంతమేర పెట్టుబడులు వెనక్కువెళ్లాయి. సెప్టెంబర్‌లో రూ.44.11 కోట్ల నికర పెట్టుబడులు రాగా, ఆగస్ట్‌లో ఏకంగా రూ.145.29 కోట్ల నికర పెట్టుబడులు వచ్చాయి. సాధారణంగా అనిశ్చితి సమయాల్లో బంగారం సంబంధిత పెట్టుబడులను రక్షణాత్మక ఆస్తులుగా భావిస్తారు. బంగారం ధరలు అనూహ్యంగా పెరగడం, అమెరికా-చైనాల

Most from this category