మరో పాజిటివ్ ఓపెనింగ్
By Sakshi

ఆసియా మార్కెట్లు క్షీణతతో ట్రేడవుతున్నా, మరో రెండు రోజుల్లో కేంద్ర బడ్జెట్ ప్రతిపాదనలు వెలువడనున్న నేపథ్యంలో బుధవారం భారత్ సూచీలు సానుకూలంగా ప్రారంభమయ్యాయి. భారత్ మార్కెట్ పాజిటివ్‌గా ఆరంభంకావడం వరుసగా ఇది మూడో రోజు. బీఎస్ఈ సెన్సెక్స్ 91 పాయింట్ల పెరుగుదలతో 39,907 పాయింట్ల వద్ద, నిఫ్టీ 22 పాయింట్ల లాభంతో 11,932 పాయింట్ల వద్ద మొదలయ్యాయి. బీపీసీఎల్, ఐఓసీ, ఆసియన్ పెయింట్స్, గ్రాసిమ్, యస్‌బ్యాంక్‌లు స్వల్పలాభంతో ప్రారంభంకాగా, ఐషర్ మోటార్స్, డాక్టర్ రెడ్డీస్, వేదాంత, టీసీఎస్‌లు స్వల్ప నష్టాలతో మొదలయ్యాయి.
You may be interested
68.85 వద్ద ప్రారంభమైన రూపీ
Wednesday 3rd July 2019డాలర్ మారకంలో రూపీ బుధవారం(జులై 3) ట్రేడింగ్‌లో బలపడి 68.85 వద్ద ప్రారంభమైంది. ఈ వారం బడ్జెట్ వెలువడనున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు వేచి చూసే దోరణిని అనుసరించడంతో గత సెషన్లో రూపీ ప్లాట్‌గా 68.93 వద్ద ముగిసింది. చమురు ధరలు తగ్గినప్పటికి డాలర్ బలపడడంతో రూపీ ప్లాట్‌గానే ముగిసింది. అమెరికా తయారిరంగ వృద్ధి రేటు అంచనాల కంటే ఎక్కువగా ఉండడంతో పీఎమ్ఐ నివేదిక వెలువడిన తర్వాత డాలర్ మూడు నెలల
యస్ బ్యాంకు విషయంలో ఏం చేయొచ్చు?
Tuesday 2nd July 2019ప్రైవేటు రంగంలో ఐదో అతిపెద్ద బ్యాంకు, యస్ బ్యాంకు. ఏడాది క్రితం వరకు యస్ బ్యాంకు పరిస్థితి బాగానే ఉంది. బ్యాంకు సారథిగా వ్యవస్థాపకుడు రాణా కపూర్ కొనసాగడానికి వీల్లేదంటూ ఆర్బీఐ పెట్టిన ఆంక్షలతో బ్యాంకుకు సమస్యలు మొదలయ్యాయి. ఖాతాల్లో ఎన్పీఏలను తగ్గించి చూపించిందన్న ఆరోపణలు రావడం, రాణా కపూర్ పదవీ కాలం పొడిగింపునకు ఆర్బీఐ నో చెప్పడంతో ఈ స్టాక్ రూ.404 గరిష్ట ధర నుంచి పడిపోవడం మొదలైంది.