News


పాజిటివ్‌ ఓపెనింగ్‌

Wednesday 17th July 2019
Markets_main1563334690.png-27110

అంతర్జాతీయ మార్కెట్లు ప్రతికూలంగా వున్నా, బుధవారం భారత్‌ సూచీలు పాజిటివ్‌గా ప్రారంభమయ్యాయి. ఇలా పాజిటివ్‌ ప్రారంభాన్నివ్వడం వరుసగా ఇది మూడో రోజు. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 40 పాయింట్ల లాభంతో 39,141 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 8 పాయింట్ల లాభంతో 11,670 పాయింట్ల వద్ద మొదలయ్యాయి. యూపీఎల్‌, జీ టెలిఫిల్మ్‌, కోటక్‌బ్యాంక్‌, టెక్‌ మహింద్రా, ఆసియన్‌ పెయింట్స్‌ షేర్లు 1-2 శాతం మధ్య లాభాలతో మొదలయ్యాయి. మరోవైపు గెయిల్‌, టాటా మోటార్స్‌, సిప్లా, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, హీరో మోటార్స్‌లు స్వల్పనష్టాలతో ట్రేడింగ్‌ను ఆరంభించాయి. 



You may be interested

బుధవారం వార్తల్లోని షేర్లు

Wednesday 17th July 2019

వివిధ వార్తలకు అనుగుణంగా బుధవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు  పంజాజ్‌ అండ్‌ సింధ్‌ బ్యాంక్‌:- ఏడాది కాలపరిమితి కలిగిన ఎంసీఎల్ఆర్‌పై వడ్డీరేట్లను 8.70శాతానికి పెంచింది. జూన్‌ 16 నుంచి సవరించిన వడ్డీరేట్ల అమల్లోకి రానున్నాయి.  ఐఎల్‌ఎఫ్‌సీ ఇంజనీరింగ్స్‌:- ఆడిట్‌ ఫీజు పేమెంట్‌ చెల్లింపు విఫలమవడంతో బీఎస్‌ఆర్‌ అండ్‌ అసోసియేట్స్‌ అడిటర్‌ సంస్థ రాజీనామా పత్రాన్ని సమర్పించింది.  ఇంటర్‌గ్లోబ్‌ ఏవియేషన్స్‌:- కార్పొరేట్ పాలన లోపం గురించి రాకేష్‌ గంగ్వాల్‌ లేవనెత్తిన ఆరోపణలపై కార్పోరేషన్‌ మంత్రిత్వశాఖ వివరణ

సన్‌ ఫార్మాకు నవోదయం ఆరంభమైందా...?

Tuesday 16th July 2019

సన్‌ ఫార్మా లాభాలు ఎన్నో ఏళ్ల కనిష్ట స్థాయిలకు చేరాయి. షేరు ధర కూడా 2013 నాటి స్థాయిల్లోనే కదలాడుతోంది. కానీ, ‘సన్‌ఫార్మా’ బలమైన టర్న్‌ అరౌండ్‌ స్టోరీగా మోర్గాన్‌ స్టాన్లీ చెబుతోంది. తాజాగా ఈ స్టాక్‌కు రేటింగ్‌ను ఓవర్‌ వెయిట్‌ (అధిక ప్రాధాన్యం)కు పెంచడంతోపాటు రూ.505 టార్గెట్‌ను కూడా ఇవ్వడం గమనార్హం. గత ఐదు రోజుల్లోనే ఈ స్టాక్‌ రూ.381 స్థాయి నుంచి రూ.433 స్థాయికి పెరిగిపోవడం విశేషం.    2020-21

Most from this category