News


స్వల్పలాభాలతో ప్రారంభం...వెంటనే నష్టాల్లోకి

Wednesday 20th March 2019
Markets_main1553053345.png-24699

అమెరికా కేంద్ర బ్యాంక్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ పాలసీ నిర్ణయం బుధవారం రాత్రి వెలువడనున్న నేపథ్యంలో భారత్‌ సూచీలు స్వల్పలాభాలతో మొదలయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 70 పాయింట్ల లాభంతో 38,434 పాయింట్ల వద్ద, నిఫ్టీ 20 పాయింట్ల పెరుగుదలతో 11,552 పాయింట్ల వద్ద మొదయల​య్యాయి. అయితే ట్రేడింగ్‌ ప్రారంభమైన కొద్ది నిముషాల్లోకే సూచీలు నష్టాల్లోకి జారిపోయాయి. ఉదయం 9.20 గంటలకు సెన్సెక్స్‌ 30 పాయింట్లు, నిఫ్టీ 16 పాయింట్ల చొప్పున నష్టాల్లోకి మళ్లాయి. ఇండియాబుల్స్‌ హౌసింగ్‌, ఇన్ఫోసిస్‌, హిందాల్కో, విప్రో, వేదాంతలు 1-3 శాతం లాభాల్లోనూ, జీ టెలి, ఐఓసీ, హింద్‌ పెట్రో, బీపీసీఎల్‌, ఓఎన్‌జీసీలు 1-2 శాతం నష్టాలోనూ ప్రారంభమయ్యాయి. 



You may be interested

బుధవారం వార్తల్లో షేర్లు

Wednesday 20th March 2019

వివిధ వార్తలకు అనుగుణంగా బుధవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు ముత్తూట్‌ క్యాపిటల్‌ సర్వీసెస్‌:- ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.250 కోట్ల విలువ సెక్యూరిటైజేషన్ లావాదేవీ ప్రక్రియను పూర్తి చేసినట్లు స్టాక్‌ ఎక్చ్సేంజ్‌లు సమాచారం ఇచ్చింది. ఫ్యూచర్‌ ఎంటర్‌ప్రైజెస్‌:- బ్రిక్‌రేటింగ్‌ సంస్థ ఎన్‌సీడీలపై రేటింగ్‌ను పెంచింది. గతంలో తాము కేటాయించిన ఎఎ(నెగిటివ్‌) నుంచి ఎఎ(స్థిరత్వం)కు పెంచుతున్నట్లు ప్రకటించింది. ఓఎన్‌జీసీ:- మార్చి 23వ తేది నుంచి షేరు మధ్యంతర డివిడెండ్‌ను పరిగణలోకి తీసుకుంటున్నట్లు బోర్డు తెలిపింది.  కాక్స్‌&కింగ్స్‌:- హంగేరీలోని

ఫ్లాట్‌గా ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ

Wednesday 20th March 2019

అమెరికా కేంద్ర బ్యాంక్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ పాలసీ నిర్ణయం బుధవారం రాత్రి వెలువడనున్న నేపథ్యంలో ఆసియా మార్కెట్లు స్వల్ప లాభనష్టాల మధ్య ఊగిసలాడుతున్న నడుమ వరుసగాఏడు రోజులపాటు పెద్ద ర్యాలీ జరిపిన భారత్‌ సూచీలు ఈ రోజు ఫ్లాట్‌గా ప్రారంభమయ్యే సంకేతాల్ని ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ అందిస్తోంది.  ఈ ఉదయం ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ దాదాపు మార్పేదీ లేకుండా ట్రేడవుతోంది.  ఇక్కడి ఎన్‌ఎస్‌ఈలోని నిఫ్టీ ఫ్యూచర్‌తో అనుసంధానంగా ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఉదయం 8.50  గంటలకు 11,571 పాయింట్ల వద్ద కదులుతోంది. క్రితం రోజు ఇక్కడ

Most from this category