News


మరో శుభారంభం

Tuesday 5th November 2019
Markets_main1572926253.png-29354

ఏడు ట్రేడింగ్‌ సెషన్లుగా అప్రతిహత ర్యాలీ చేస్తున్న భారత్‌ స్టాక్‌ సూచీలు మంగళవారం మరో శుభారంభాన్ని చేశాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 150 పాయింట్ల లాభంతో 40,452 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 33 పాయింట్ల గ్యాప్‌అప్‌తో 11,975 పాయింట్ల వద్ద మొదలయ్యాయి. గత రాత్రి అమెరికా ఎస్‌ అండ్‌ పీ500, నాస్‌డాక్‌ కాంపోజిట్‌ ఇండెక్స్‌లు కొత్త రికార్డుస్థాయిలో ముగియడం, తాజాగా ఆసియా సూచీలు లాభాలతో ట్రేడ్‌అవుతున్న నేపథ్యంలో ఇక్కడి షేర్లు కూడా జతకలిసాయి. 



You may be interested

నేడు క్యూ2 ఫలితాలను ప్రకటించే కొన్ని ప్రధాన కంపెనీలు

Tuesday 5th November 2019

టెక్‌ మహీంద్రా, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌, టైటాన్‌ కంపెనీ, దివీస్‌ ల్యాబొరేటరీస్‌, గోద్రేజ్‌ ప్రొపర్టీస్‌, ఆర్‌ఈసీ, అజంతా ఫార్మా, అపోలో టైర్స్‌, బెర్జర్‌ పెయింట్స్‌, డాబర్‌ ఇండియా, గుజరాత్‌ గ్యాస్‌, ఎన్‌సీసీ, గతి, జిల్లెట్‌ ఇండియా, జీటీఎల్‌ ఇన్‌ఫ్రా, వీఎస్‌టీ టిల్లర్స్‌  ట్రాక్టర్స్‌ లిమిటెడ్‌ తదితర కంపెనీలు తమ రెండో త్రైమాసిక ఫలితాలను విడుదల చేయనున్నాయి. 

బంధన్ బ్యాంకులో ఎఫ్‌ఐఐ పరిమితి పెంపు..

Tuesday 5th November 2019

న్యూఢిల్లీ: ప్రమోటరు షేర్‌హోల్డింగ్‌ను ఆర్‌బీఐ నిర్దేశిత స్థాయికి తగ్గించే క్రమంలో విదేశీ పెట్టుబడుల పరిమితిని 49 శాతానికి పెంచేందుకు బంధన్ బ్యాంక్ బోర్డు ఆమోదం తెలిపింది. ప్రస్తుతం 24 శాతంగా ఉన్న విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌ఐఐ), విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్‌పీఐ) పెట్టుబడుల పరిమితిని ప్రత్యేక తీర్మానం ద్వారా 49 శాతానికి పెంచే ప్రతిపాదనకు అక్టోబర్ 24న జరిగిన బోర్డు సమావేశంలో డైరెక్టర్లు ఆమోదం తెలిపినట్లు బ్యాంకు వెల్లడించింది.

Most from this category