News


మరో గ్యాప్‌అప్‌ ఓపెనింగ్‌

Thursday 31st October 2019
Markets_main1572493450.png-29250

రెండు రోజులుగా భారీ లాభాల్ని ఆర్జించిన భారత్‌ స్టాక్‌ సూచీలు గురువారం మళ్లీ గ్యాప్‌అప్‌తో మొదలయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 160 పాయింట్ల లాభంతో 40,211 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 51 పాయింట్ల లాభంతో 11,895 పాయింట్ల వద్ద మొదలయ్యాయి. అమెరికా కేంద్ర బ్యాంక్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్లను మరో పావుశాతం తగ్గించడంతో గత రాత్రి అమెరికా ఎస్‌ అండ్‌ పీ-500 సూచి సరికొత్త రికార్డుస్థాయి వద్ద ముగిసింది. తాజాగా ఆసియా స్టాక్‌ సూచీలు సైతం లాభాలతో ట్రేడవుతున్నాయి. ఇక ఇక్కడ ఇన్ఫోసిస్‌, ఎస్‌బీఐ, జీటెలి, గ్రాసిమ్‌, సన్‌ఫార్మా, ఐసీఐసీఐ బ్యాంక్‌ షేర్లు 1-2.5 శాతం గ్యాప్‌అప్‌తో ఆరంభమయ్యాయి. ట్రేడింగ్‌ ప్రారంభంలో యస్‌బ్యాంక్‌ 3 శాతం నష్టపోగా, ఇన్‌ఫ్రాటెల్‌ 3 శాతం, టాటా మోటార్స్‌ 2 శాతం చొప్పున తగ్గాయి. 



You may be interested

12 పైసలు బలపడిన రూపీ

Thursday 31st October 2019

దేశీయ కరెన్సీ రూపీ, డాలర్‌ మారకంలో గురువారం సెషన్‌లో 12 పైసలు బలపడి 70.77 వద్ద ప్రారంభమైంది. కాగా ఫెడ్‌ వడ్డీ రేట్ల నిర్ణయానికి ముందు ఇన్వెస్టర్లు జాగ్రత్త వహించారు. ఫలితంగా గత సెషన్‌లో రూపీ డాలర్‌ మారకంలో 5 పైసలు బలహీనపడి 70.89 వద్ద ముగిసింది. ఫెడరల్‌ రిజర్వ్‌ బ్యాంక్‌ బుధవారం వడ్డీ రేట్లను 25 బేసిష్‌ పాయింట్లను తగ్గించింది. దీంతో వడ్డీ రేటు  2 శాతం నుంచి

ఇండిగోకు ఐఏటీఏలో సభ్యత్వం

Thursday 31st October 2019

న్యూఢిల్లీ: చౌక చార్జీల విమానయాన సంస్థ ఇండిగో.. అంతర్జాతీయ విమానయాన సంఘం (ఐఏటీఏ)లో సభ్యత్వం పొందినట్లు బుధవారం ప్రకటించింది. ఇటీవలి కాలంలోనే సంస్థ సేవలు టర్కీ, వియత్నాం, మయన్మార్, చైనా వంటి దేశాలకు విస్తరించిన విషయం తెలిసిందే కాగా, సరిగ్గా ఇటువంటి సమయంలో సభ్యత్వం పొందడం వల్ల ప్రపంచంలో అత్యుత్తమ వాయు రవాణా వ్యవస్థగా ఇండిగోను తీర్చిదిద్దాలనే లక్ష్యానికి సహకారం లభించిందని సంస్థ సీఈఓ రోనోజోయ్ దత్తా అన్నారు. ఇండిగో

Most from this category