News


నిఫ్టీ 70 పాయింట్ల గ్యాప్‌డౌన్‌

Friday 2nd August 2019
Markets_main1564717456.png-27483

ఛైనాపై సెప్టెంబర్‌ నుంచి 10 శాతం అదనపు టారీఫ్‌లు విధిస్తామంటూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ గత రాత్రి హెచ్చరించిన నేపథ్యంలో  ప్రపంచ మార్కెట్లు పతనంకావడంతో భారత్‌ స్టాక్‌ సూచీలు శుక్రవారం సైతం  గ్యాప్‌డౌన్‌తో ప్రారంభమయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 200  పాయింట్ల నష్టంతో 36,800 పాయింట్ల సమీపంలోనూ, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 70 పాయింట్ల గ్యాప్‌డౌన్‌తో 10,910 పాయింట్ల సమీపంలోనూ మొదలయ్యాయి. ట్రేడింగ్‌ ప్రారంభంలో మెటల్‌ షేర్లు తీవ్రంగా నష్టపోయాయి. వేదాంత, జెఎస్‌డబ్ల్యూ స్టీల్‌, హిందాల్కో, టాటా స్టీల్‌లు 1-3 శాతం మధ్య క్షీణించాయి. వీటితో పాటు గ్రాసిమ్‌, కోల్‌ ఇండియా, ఓఎన్‌జీసీ, హెచ్‌డీఎఫ్‌సీలు 1-2 శాతం మధ్య నష్టపోయాయి. మరోవైపు క్రితం రోజు ఫలితాల్ని వెల్లడించిన భారతి ఎయిర్‌టెల్‌ ట్రేడింగ్‌ ప్రారంభంలో 3.6 శాతంపైగా లాభపడింది. ఆసియన్‌ పెయింట్స్‌, ఇన్ఫోసిస్‌లు స్వల్పంగా పెరిగాయి. 



You may be interested

శుక్రవారం వార్తల్లోని షేర్లు

Friday 2nd August 2019

వివిధ వార్తలకు అనుగుణంగా శుక్రవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు  యస్‌ బ్యాంక్‌, హెచ్‌డీఐఎల్‌:- నిధులను ఎవర్‌గ్రీన్‌ రుణాలకు మళ్లించినట్లు విదేశీ ఇన్వెస్టర్‌ ఒకరు ఆర్‌బీఐకు ఫిర్యాదు చేశారు.  తల్వాకర్స్ బెటర్ వాల్యూ వాల్యూ ఫిట్‌నెస్‌:- జూలై 31న చెల్లించాల్సిన రూ.3.5 కోట్ల వడ్డీరేట్ల చెల్లింపుల్లో విఫలమైనట్లు ఎక్చ్సేంజీలకు సమాచారం ఇచ్చింది దిష్‌మాన్‌ కార్బోజెన్‌:- యూఎస్‌ఎఫ్‌డీఏ కంపెనీ అనుబంధ సంస్థ న్యూలాండ్‌ యూనిట్‌ను తనిఖీలు పూర్తి చేసినట్లు తెలిపింది.  ఎసీసీ:- కంపెనీ సీఎఫ్‌ఓగా రజనీ కేసరీ నియమితులయ్యరు.  ఎల్‌ఐసీ

మూడో రోజూ ‘ఫ్రీజ్‌’ అయిన కాపీ డే

Thursday 1st August 2019

కేఫ్‌ కాఫీ డే వ్యవస్థాపకుడు వి.జి.సిద్ధార్థ అదృశ్యం, అటుపిమ్మట ఆత్మహత్య చేసినట్లు తర్వాత కాఫీ డే షేర్లు భారీగా పడిపోతున్నాయి. గత సెషన్‌లో 20 శాతం పతనమై డౌన్‌ సర్య్కూట్‌ ఫ్రీజ్‌ అయిన ఈ షేరు, గురువారం ట్రేడింగ్‌లో కూడా భారీగా పడిపోయింది. తాజాగా స్టాక్‌ ఎక్సెంజీలు కాఫీ డే షేరు డౌన్‌ సర్య్కూట్‌ ఫ్రీజ్‌ పరిమితిని 10 శాతానికి తగ్గించడంతో ఈ కంపెనీ షేరు విలువ గురువారం ట్రేడింగ్‌లో 10

Most from this category