News


ఆస్తులు అమ్ము... అప్పులు తీర్చు..!

Friday 12th July 2019
Markets_main1562870180.png-26995

పారిశ్రామిక వేత్త అనిల్‌ అంబానీ చేస్తున్నది ఇదే ప్రస్తుతం. రుణాలు తీసుకుని వ్యాపారాలు మొదలు పెట్టారు. ఆ రుణాలను తీర్చలేక అవే వ్యాపారాలను ఒక దాని తర్వాత ఒకటి వరుసపెట్టి అమ్ముతున్నారు. పరిస్థితులు తల్లక్రిందులు అయితే ఇంతే ఉంటుంది. రోడ్డు ప్రాజెక్టుల నుంచి ఎఫ్‌ఎం రేడియో​ వ్యాపారం వరకు పలు ఆ‍స్తులు అమ్మి రూ.21,700 కోట్లు (3.2 బిలియన్‌ డాలర్లు) సమీకరించి, అప్పులు తీర్చాలన్నది అనిల్‌ అంబానీ ప్రయత్నం. 

 

అనిల్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ తొమ్మిది రోడ్డు ప్రాజెక్టులను విక్రయించడం ద్వారా రూ.9,000 కోట్లు సమకూర్చుకోవాలని అనుకుంటోంది. ఇక రిలయన్స్‌ క్యాపిటల్‌ అయితే బిగ్‌ ఎఫ్‌ఎం రేడియో వ్యాపారం విక్రయం ద్వారా రూ.1,200 కోట్లు, ఇతర ఫైనాన్షియల్‌ వ్యాపారాలను విక్రయించి మరో రూ.11,500 కోట్లను సమీకరించే పనిలో ఉంది. ఇందులో రిలయన్స్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌లో నూరు శాతం వాటాకు రూ.5,000 కోట్లు, రిలయన్స్‌ నిప్పన్‌ లైఫ్‌ ఏఎంసీ వాటా విక్రయం ద్వారా రూ.4,500 కోట్లు, ప్రైమ్‌ ఫోకస్‌లో వాటాల విక్రయం రూంలో రూ.1,000 కోట్లు వరకు రానున్నాయి. ఇక చివరికి నిధుల సమీకరణకు గాను ముంబైలో రిలయన్స్‌ ఇన్‌ఫ్రా ఆధ్వర్యంలో ఉన్న వ్యాపార సముదాయాన్ని కూడా లీజుకు ఇవ్వాలని నిర్ణయించుకుంది. 

 

తీవ్ర రుణ భారాన్ని మోస్తున్న అనిల్‌ అంబానీ అడాగ్‌ గ్రూపు కంపెనీల రేటింగ్‌లను రేటింగ్‌ ఏజెన్సీలు ఇటీవల డీగ్రేడ్‌కు మార్చిన విషయం​తెలిసిందే. దీంతో తన గ్రూపు గత 14 నెలల్లో రూ.35వేల కోట్ల రుణాలను తీర్చివేసిందని, అలాగే, భవిష్యత్తులో అన్ని రుణాలను చెల్లిస్తామని గత నెల 11న అనిల్‌ అంబానీ ప్రకటన కూడా చేయాల్సి వచ్చింది. గ్రూపులో ఆర్‌కామ్‌ మినహా మరో నాలుగు అతిపెద్ద కంపెనీలకు ఇప్పటికీ 93,900 కోట్ల రుణాలు ఉన్నాయి. రిలయన్స్‌ క్యాపిటల్‌ పెట్టుబడుల ఉపసంహరణలో జాప్యం నెలకొందని, ఆ సంస్థకు ఏప్రిల్‌లో రేటింగ్‌ డౌన్‌గ్రేడ్‌ సందర్భంగా కేర్‌ రేటింగ్స్‌ తెలిపింది. సకాలంలో ఆస్తులను విక్రయించలేకపోవడం, అనిల్‌ ఆధ్వర్యంలోని చాలా కంపెనీలకు ప్రమాద ఘంటికలను మోగిస్తోందని ఆదిత్య కన్సల్టింగ్‌ మేనేజింగ్‌ పార్ట్‌నర్‌ మాథ్యూ ఆంటోనీ సైతం పేర్కొన్నారు. 

 

కాగా, తొమ్మిది రోడ్డు ప్రాజెక్టుల విక్రయానికి సంబంధించిన చర్చలు ముందస్తు దశలో ఉన్నాయని కంపెనీ అధికార ప్రతినిధి వెల్లడించారు. 2020 నాటికి రుణ రహితంగా మారాలన్నది రిలయన్స్‌ ఇన్‌ఫ్రా యత్నం. గత ఏడాది కాలంలో తన రుణాలను 45 శాతం తగ్గించుకోగా, ఈ ఏడాది మార్చి నాటికి ఇంకా రూ.17వేల కోట్లకు పైగా రుణాలు మిగిలి ఉన్నాయి. You may be interested

సెన్సెక్స్‌ సెంచరీ లాభంతో షురూ

Friday 12th July 2019

11600పై ప్రారంభమైన నిఫ్టీ ఇండెక్స్‌  ప్రపంచమార్కెట్లలో నెలకొన్న సానుకూల సంకేతాలను అందిపుచ్చుకున్న దేశీయ మార్కెట్‌ శుక్రవారం లాభంతో మొదలైంది. సెన్సెక్స్‌ 118 పాయింట్ల లాభంతో 38,941.10 వద్ద, నిఫ్టీ 18 పాయింట్లను ఆర్జించి 11600 పైన 11,601.15 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. నిన్నరాత్రి అమెరికా మార్కెట్లు మరోసారి కొత్త రికార్డు స్థాయిలను అందుకున్నాయి. ఫెడరల్‌ రిజర్వ్‌ చైర్మన్‌ జెరోమీ పావెల్‌ వడ్డీ రేట్ల తగ్గింపు సంకేతాలు ఇవ్వడంతో బుధవారం జీవికాల గరిష్టాలను

మిడ్‌క్యాప్‌ వైపు చూడ్డానికి మంచి టైమ్‌

Friday 12th July 2019

మార్కెట్‌ బ్రెడ్త్‌ (పెరిగిన, నష్టపోయిన స్టాకుల మధ్య నిష్పత్తి) చాలా తగ్గిపోయిందని, ఈ స్థాయి నుంచి మార్కెట్లో బ్రోడ్‌ బేస్డ్‌ (అన్ని విభాగాల షేర్ల ర్యాలీ) రికవరీ జరగాలంటే తాజా ట్రిగ్గర్లు అవసరమన్నారు చార్ట్‌ అడ్వైజ్‌ సంస్థ శిక్షణ విభాగం హెడ్‌ రాజా వెంకట్రామన్‌. నిఫ్టీ-50లో 15 స్టాక్స్‌ ఈ ఏడాది 30 శాతం రాబడులను ఇవ్వగా, అదే సమయంలో మిగిలిన 35 స్టాక్స్‌ 11 శాతం నష్టపోయినట్టు చెప్పారు.

Most from this category