News


ఆప్షన్‌ ట్రేడింగ్‌లో మితేష్‌ సక్సెస్‌ మం‍త్రం!

Tuesday 19th November 2019
personal-finance_main1574156158.png-29706

ఆరంభ నష్టాల నుంచి అద్భుత లాభాల దిశగా పయనం
ఆప్షన్‌ సెల్లింగే కీలకమని సలహా

 

ట్రయల్‌ అండ్‌ ఎర్రర్‌ సూత్రాన్ని కచ్ఛితంగా పాటించి ఆప్షన్‌ ట్రేడింగ్‌లో సక్సెసయిన వ్యక్తి మితేష్‌ పటేల్‌. తన వేతనంతో మార్కెట్లో అనేక ‍ప్రయోగాలు చేసి దశాబ్దకాలం తర్వాత చివరకు సక్సెస్‌ మంత్రాన్ని కనుగొన్నాడు. అసలెవరీ మితేష్‌? ఏం సాధించాడు?.. చూద్దాం..

గుజరాత్‌లోని చిన్న గ్రామంలో జన్మించిన మితేష్‌ కెమికల్‌ ఇంజనీరింగ్‌ చేశాడు. అనంతరం పలు కెమికల్‌ పరిశ్రమల్లో ఉద్యోగాలు చేశాడు. సూరత్‌లో ఉద్యోగ సమయంలో  2005 నుంచి స్టాక్‌ మార్కెట్‌ వైపు ఆకర్షితుడయ్యాడు. తొలి ట్రేడ్‌గా ఐటీసీని కొన్నాడు. అందరు ఆరంభ ట్రేడర్లలాగే తనకప్పుడే ఫండమెంటల్స్‌, టెక్నికల్స్‌ తెలియవని మితేష్‌ చెప్పారు. క్రమంగా మార్కెట్లో బేసిక్స్‌తో పాటు విశ్లేషణ నేర్చుకున్నాడు. ఆసమయంలో వడోదర ఆర్‌ఐఎల్‌ ప్లాంట్‌లో ఉద్యోగంలో చేరాడు. అక్కడ సీనియర్‌ ఉద్యోగుల్లో మంచి నిపుణులైన ట్రేడర్లుండేవారు. వాళ్ల ద్వారా మితేష్‌కు ఎఫ్‌అండ్‌ఓ మార్కెట్‌ పరిచయం అయింది. అయితే దాని గురించి అవగాహన లేక రెండు మూడు నెలల్లో అకౌంట్‌ ఖాళీ చేసుకున్నాడు. ఇక అప్పటినుంచి పొద్దున ట్రేడింగ్‌లో ఒక స్టాకు కొనుక్కోవడం ట్రేడింగ్‌ చివరకు లాభాలొస్తే తీసుకోవడం లేదా క్యారీ చేయడం కొనసాగించాడు. అప్పటివరకు బుల్‌ మార్కెట్‌ను చూస్తున్న మితేష్‌కు 2008లో బేర్‌ మార్కెట్‌ అంటే ఏంటో తెలిసివచ్చింది. తను మాత్రం తన యథావిధి డైలీ ట్రేడింగ్‌ కొనసాగిస్తూ వచ్చాడు. క్రమంగా తన క్యాపిటల్‌లో 50 శాతం కోల్పోయాడు. ఆర్‌ఐఎల్‌ షార్ట్స్‌లో, జిందాల్‌ స్టీల్‌ ఫ్యూచర్స్‌లో తాను బాగా నష్టపోయాయని మితేష్‌ చెప్పారు. దీంతో అసలు తాను ఎందుకు ఎప్పుడూ లాస్‌ సైడ్‌ ఉంటానని పరిశీలన ఆరంభించానని తెలిపారు. ఇదే సమయంలో న్యూడే ట్రేడింగ్‌ టిప్స్‌ అనే పుస్తకం, కొన్ని బ్లాగుల ద్వారా మార్కెట్‌ విశ్లేషణ విస్తృతం చేసుకున్నానన్నారు. ఈ సమయంలో తాను ఒక ప్రాథమిక సూత్రాన్ని అవగాహన చేసుకున్నట్లు తెలిపారు.
సూత్రాలు నేర్చుకున్నా..
‘‘ అప్‌ట్రెండ్‌లో షార్ట్‌ చేయడం, డౌన్‌ట్రెండ్‌లో లాంగ్స్‌ కొనడం చేయకూడదు.’’ అనే సూత్రం తనకు అనేక విషయాలు నేర్పిందని మితేష్‌ చెప్పారు. దీంతో పాటు స్టాప్‌లాస్‌ పెట్టుకోవడం, చార్టుల విశ్లేషణ నేర్చుకున్నానని తెలిపారు. పెరిగే మార్కెట్లో స్టాప్‌లాస్‌ను గత కనిష్ఠానికి దిగువన ఉంచుకోవాలని, డౌన్‌ట్రెండ్‌ మార్కెట్లో స్టాప్‌లాస్‌ను గత గరిష్టానికి పైన ఉంచుకోవాలని చెప్పారు. ఇదే సమయంతో తనకు సౌదీలో ఉద్యోగం వచ్చింది. దీంతో మరింత పెట్టుబడి పెట్టవచ్చని భావించాడు. అయితే ఎన్ని నష్టాలు వచ్చినా అప్పు చేసి పెట్టుబడి పెట్టలేదని ఆయన చెప్పారు. కరెక‌్షన్‌ అనంతరం మార్కెట్లు కన్సాలిడేషన్‌లోకి మరలాయి. ఆ సమయంలో రేంజ్‌ బౌండ్‌ ట్రేడింగ్‌ తదితరాలు తెలుసుకున్నట్లు మితేష్‌ తెలిపారు. 2011 వరకు తాను నిరంతరాయంగా నష్టపోతూనే ఉన్నట్లు చెప్పారు. తర్వాత 2011-14 సమయంలో బ్రేక్‌ ఈవెన్‌ సాధించానని, ఆ సమయంలో తన ట్రేడ్స్‌లో కనీసం 50 శాతం సక్సెస్‌ అయ్యేవని తెలిపారు. 2015వరకు తన మొత్తం నష్టాలు రూ.30 లక్షలుంటాయన్నారు. వీటిని నష్టాలనే కన్నా మార్కెట్‌కు తాను చెల్లించిన రుసుముగా ఆయన అభివర్ణిస్తారు. మంచి ఉద్యోగం, మార్కెట్‌లో సాధించాలనే తపన, అప్పు చేసి ట్రేడ్‌ చేయకపోవడం తనను నిలబెట్టాయని చెప్పారు. తన గత ట్రేడ్స్‌ విశ్లేషించుకుంటే సరిగ్గా నిరోధ స్థాయిల వద్ద ఎక్కువమార్లు కొనుగోళ్లు జరపడమే నష్టాలకు కారణమైనట్లు తెలిసిందన్నారు. సౌదీలో ఉన్నప్పుడే ఆప్షన్స్ గురించి తెలుసుకున్నానని చెప్పారు. 
ఆప్షన్స్‌లో ఆరంభ నష్టాలు
కొత్తలో తాను ఆప్షన్స్‌ కొనుగోలు చేసేవాడినని, దీంతో చాలావరకు నష్టాలే వచ్చేవని మితేష్‌ తెలిపారు. ఒక ట్రేడ్‌లో లాభం వచ్చినా మరో రెండుమూడింటలో నష్టాలు వచ్చేవన్నారు. ఆ సమయంతో తనకు బ్రోకర్‌ ఒక సలహా ఇచ్చాడని తెలిపారు. ‘‘ ఆప్షన్‌ విక్రేతే ఎక్కువ మార్లు లాభం పొందుతాడు. ఆప్షన్‌ కొనుగోలుదారు ఎక్కువమార్లు నష్టాలే చూస్తాడు’’. ఈ సూత్రం తనకు నష్టాలు కొంత మేర అరికట్టిందన్నారు. తర్వాత మితేష్‌ సామ్‌సంగ్‌లో చేరారు. ఆప్షన్‌ విక్రయాలకు ఆయన నిఫ్టీ ఆప్షన్స్‌ను పరిశీలించాడు. ఒక సీరిస్‌లో నిఫ్టీ ఒక వంద పాయింట్ల రేంజ్‌లో కదలాడింది. దీంతో ఆ పాయింట్లకు అటు ఇటు ఉన్న ఆప్షన్లన్నీ వాల్యూ కోల్పోవడం తను గమనించాడు. దీంతో షార్ట్‌ స్ట్రాంగిల్‌ వ్యూహం అవలంబించాలని డిసైడయ్యాడు. కానీ అప్పుడు కూడా ఒక ట్రేడ్‌ లాభాలనిస్తే మరొకటి నష్టాలనిచ్చేదని తెలిపారు. దీంతో టెక్నికల్‌ అనాలసిస్‌ను ఆప్షన్‌ సెల్లింగ్‌తో కలిపి ఆలోచించానని మితేష్‌ తెలిపారు. టెక్నికల్స్‌ ఉపయోగించి మద్దతు, నిరోధ స్థాయిలు గమనించడం, నిరోధాల వద్ద కాల్స్‌ విక్రయించడం, మద్దతుల వద్ద కాల్స్‌ విక్రయించడం ఆరంభించినట్లు చెప్పారు. అయితే ఈ ఆప్షన్స్‌ విక్రయం తనకు పెద్దగా నచ్చలేదని, ఎందుకంటే ఇందులో వాల్యూ క్షీణత మందకొడిగా ఉండేదని, పైగా తాను ఆప్షన్‌ గీక్స్‌ చూసేవాడిని కానని చెప్పారు. కానీ ఆప్షన్‌ విక్రయమే తనకు లాభాలనిచ్చిందని 2016 నవంబర్‌ నుంచి 2017 ఆగస్టు కాలంలో తన రూ. 20వేలు రూ. 26 లక్షలయ్యాయని చెప్పారు. కానీ ఆ సమయంలో తనకు ఆశ పెరిగి మరలా ఆప్షన్‌ కొనుగోలు వైపు మరలినట్లు చెప్పారు. దీంతో తిరిగి తన క్యాపిటల్‌ రూ.లక్షకు పడిపోయింది. ఇక అప్పటి నుంచి ఆప్షన్‌ బయింగ్‌కు దూరంగా ఉండాలని గట్టిగా నిర్ణయించుకున్నట్లు మితేష్‌ చెప్పారు. ఇదే సమయంలో తాను కష్టపడి కొనుక్కున్న ఇల్లు అమ్మి రూ. 55లక్షలను ట్రేడింగ్‌కు మరలించినట్లు చెప్పారు. అప్పుడు తనకు వచ్చిన నమ్మకంతో ఉద్యోగాన్ని వదిలి ఫుల్‌టైమ్‌ ట్రేడర్‌గా మారినట్లు వివరించారు. 
అమ్మకంతో లాభాలు
ఫుల్‌టైమ్‌ ట్రేడర్‌గా మారిన తర్వాత తన లాభాల్లో 90 శాతం ఆప్షన్స్‌ విక్రయం వల్లనే వచ్చాయని మితేష్‌ చెప్పారు. ఎక్కువగా వీక్లీ బ్యాంకు నిఫ్టీ ఆప్షన్స్‌ను విక్రయిస్తుంటానన్నారు. బ్యాంకు నిఫ్టీ ఇంట్రాడే కదలికలను జాగ్రత్తగా పరిశీలించి మద్దతు, నిరోధస్థాయిలను నిర్ణయించుకుంటానని, మద్దతుల వద్ద పుట్స్‌ను, నిరోధాల వద్ద కాల్స్‌ను విక్రయిస్తానని చెప్పారు. విక్రయించే స్ట్రైక్‌ప్రైస్‌ ప్రస్తుత ధరకు కనీసం ఒక్క శాతం దూరంలో ఉండేలా చూసుకుంటానన్నారు. ఒకవేళ అప్పటివరకు ఉన్న ట్రెండ్‌ మారుతున్నట్లుంటే వెంటనే తన పొజిషన్లను లాభనష్టాలతో సంబంధం లేకుండా తీసివేస్తానన్నారు. ఈ వ్యూహంతో పాటు ఆప్షన్‌ సైజ్‌ వ్యూహం కూడా తనకు కలిసివచ్చిందన్నారు. ఉదాహరణకు కొత్త సీరిస్‌ తొలిరోజు తన క్యాపిటల్‌లో కేవలం 30 శాతం మాత్రమే వెచ్చిస్తానని చెప్పారు. తీసుకున్న ట్రేడ్‌ అనుకూలంగా ఉంటే మరికొన్ని పొజిషన్లు రెండో రోజు తీసుకుంటానన్నారు. అలా 60 శాతం క్యాపిటల్‌ను పెట్టుబడిగా పెట్టి 40 శాతం నిధులను రక్షణ కోసం ఉంచుకుంటానని వివరించారు. వీక్లీ ఆప్షన్ల కారణంగా కాలం కరిగిపోవడం(టైమ్‌ డికే) వేగంగా ఉంటుందన్నారు. అమ్మిన ఆప్షన్‌ 80 శాతం క్షీణించాక ప్రాఫిట్‌ బుక్‌ చేస్తానని చెప్పారు. అలాగే బుధవారం మరిన్ని పొజిషన్లు ఉంచుకోనని చెప్పారు. ఫుల్‌టైమ్‌ట్రేడర్‌గా పెట్టుబడిపై కనీసం 5 శాతం సంపాదన ఉంటుందని చెప్పారు. 
వాల్యూంలతో కూడిన బ్రేకవుట్స్‌ బెటర్‌..
స్టాక్స్‌లోకానీ ఫ్యూచర్స్‌లో కానీ భారీ వాల్యూంలతో బ్రేకవుట్‌ సాధించిన షేర్లలో పెట్టుబడులకు తాను ప్రాధాన్యమిస్తానని మితేష్‌ చెప్పారు. ఫ్యూచర్స్‌లో లాభాలతో పాటు నష్టాలు కూడా అధికమేనన్నారు. ఈ విభాగాల్లో తాను ఇంట్రాడేకు ప్రాధాన్యమిస్తానని చెప్పారు. డైలీ చార్టుల్లో మద్దతు, నిరోధాలకు దగ్గర ఉన్నప్పుడు ట్రేడ్‌ చేయాలని చెప్పారు. 2015లో తాను జేఎస్‌పీఎల్‌ను రూ. 140 వద్ద షార్ట్‌ చేశానని రూ. 130 వద్ద కొనేశానని చెప్పారు. మరుసటి రోజు అది రూ. 122కు పడిపోయిందని, దీంతో ఆశపుట్టి రూ. 126 వద్ద మరిన్ని షార్ట్స్‌ తీసుకున్నానని చెప్పారు. ఆపైన అది నెమ్మదిగా రూ. 130కి చేరడంతో మొత్తం నష్టపోయానని, తర్వాత మూడు నెలలకు అదే షేరు రూ. 70కి పడిపోయిందని చెప్పారు. దీంతో మార్కెట్లో పేరాశను కంట్రోల్‌ చేసుకోవడం, పొజిషన్‌ సైజింగ్‌ నిర్ణయించుకోవడం, మనీ మేనేజ్‌మెంట్‌ కీలకమని తెలిసివచ్చిందన్నారు. ఇటీవల కాలంలో ఎక్స్‌పైరీ డేట్‌ చాలా ఒడిదుడుకుల ట్రేడింగ్‌కు స్థానమైందని మితేష్‌ చెప్పారు. చివరి రోజు ట్రేడింగ్‌తో తాను భారీ లాభాలను చూశానని, అదేవిధంగా భారీ నష్టాలు కూడా చూశానని తెలిపారు. గతంతో ఓపెన్‌ ఇంట్రెస్ట్‌ ఆధారంగా చివరి రోజు ట్రేడింగ్‌ చేసేవాడినని, కానీ ఇటీవల కాలంతో ఇది పెద్దగా సత్ఫలితాలు ఇవ్వడం లేదని తెలిపారు. అందువల్ల పైన చెప్పిన ఆప్షన్‌ ట్రేడింగ్‌ వ్యూహమే చివరిరోజు కూడా పాటిస్తున్నానని ఇందుకోసం 3, 10 నిమిషాల చార్టులు పరిశీలిస్తుంటానని చెప్పారు. తొలి పొజిషన్‌కు క్యాపిటల్‌లో 10 శాతం కేటాయిస్తానని చెప్పారు. స్పాట్‌ ధరకు కనీసం 200 పాయింట్లు దూరంగా ఉండే ఆప్షన్‌ను విక్రయిస్తానన్నారు. సాధారణంగా మధ్యాహ్నం 12.30 సమయంలో తాను ఆప్షన్‌ విక్రయం చేస్తానన్నారు. అలాగే 2.30 తర్వాత ఎలాంటి ట్రేడ్‌ చేయనన్నారు. క్యాపిటల్‌లో 2 శాతం మొత్తం స్టాప్‌లాస్‌గా పెట్టుకుంటానని వివరించారు. 


అంతిమంగా... ‘‘ మార్కెట్లో లాభాలకు జ్ఞానంతో పాటు బలమైన క్యాపిటల్‌ అవసరం. పరిమిత క్యాపిటల్‌తో ఆరంభిస్తే ఫైనాన్షియల్‌ స్థిరత్వం కోసం సుదీర్ఘకాలం పాటు చూడాల్సిఉంటుంది. ట్రేడర్‌కు మార్కెట్‌ మూడ్‌ కనిపెట్టడం, టెక్నికల్‌ విశ్లేషణ చాలా అవసరం. మరొకరి వ్యూహాలు కాపీ కొట్టడం కన్నా సొంతంగా వ్యూహరచన చేసుకోవడం మంచిది. స్థిరంగా ఒకటి రెండు ప్యాట్రన్స్‌, ఇండికేటర్లను అధ్యయనం చేస్తుండాలి.’’ అని మితేష్‌ సూచించారు. You may be interested

యస్‌ బ్యాంక్‌కు రాణాకపూర్‌ సంస్థలు గుడ్‌బై!

Tuesday 19th November 2019

రాణా కపూర్‌ ప్రమోటర్‌గా ఉన్న యస్‌ క్యాపిటల్‌, మోర్గాన్‌ క్రెడిట్స్‌, యస్‌ బ్యాంక్‌లో తమకున్న మిగిలిన 0.8 శాతం వాటాను విక్రయించాయి. ఈ విషయాన్ని యస్‌ బ్యాంక్‌ మంగళవారం ఎక్సేంజ్‌కు తెలిపింది. ఎక్సేంజ్‌ ఫైలింగ్‌ ప్రకారం..ఈ ప్రమోటర్‌ కంపెనీలు ఓపెన్‌ మార్కెట్‌ ద్వారా  నవంబర్‌ 13-14 తేదీలలో 2.04 కోట్ల షేర్లను విక్రయించాయి. ప్రస్తుతం ఈ కంపెనీలు కేవలం 900 యస్‌ బ్యాంక్‌ షేర్లను మాత్రమే కలిగివుండడం గమనార్హం. ప్రమోటర్లు

షేర్‌ఖాన్‌ బుల్లిష్‌గా ఉన్న స్టాకులివే!

Tuesday 19th November 2019

‘భారతీ ఎయిర్‌టెల్‌పై టార్గెట్‌ ధరను రూ. 440 కి సవరించాం. వచ్చే రెండేళ్లు భారతీ ఎయిర్‌టెల్‌కు సానుకూలంగా ఉంటాయని అంచనావేస్తున్నాం’ అని షేర్‌ఖాన్‌ వైస్‌ ప్రెసిడెంట్‌, హెమాంగ్‌ జానీ ఓ ఆంగ్ల చానెల్‌కిచ్చిన ఇంటర్యూలో అన్నారు. ఇంటర్యూలోని ముఖ్యంశాలు ఆయన మాటల్లోనే.. ఎయిర్‌టెల్‌పై బుల్లిష్‌  టెలికాం సెక్టార్‌ అనేక సమస్యలను ఎదుర్కొంటున్నప్పటికి, భారతీ ఎయిర్‌టెల్‌ మాత్రం గత కొన్ని సెషన్‌ల నుంచి ర్యాలీ చేస్తోంది. ఖచ్చితంగా ప్రభుత్వం ఏజీఆర్‌ బకాయిలు చెల్లించడానికి టెలికాం

Most from this category