News


లార్జ్‌క్యాప్స్‌పైనే నమ్మకం!

Friday 14th February 2020
Markets_main1581673457.png-31797

ఆండ్రూ హోలండ్‌
దేశీయ మార్కెట్లో రంగాలవారీగా పెద్ద కంపెనీల షేర్లపైనే నమ్మకం ఉంచుతున్నట్లు అవెండాస్‌ క్యాపిటల్‌ సీఈఓ ఆండ్రూహోలండ్‌ చెప్పారు. బడ్జెట్‌ ఓకే అని, ఎకానమీని పునరుజ్జీవం చెందించేందుకు ఆర్‌బీఐ భారీ చర్యలు తీసుకుంటోందని చెప్పారు. మార్చిచివరకు ప్రభుత్వం, ఆర్‌బీఐ చర్యలు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాయో తేలిపోతుందన్నారు. ప్రభుత్వం కన్నా ఆర్‌బీఐ తీసుకుంటున్న చర్యలు ఎకానమీకి మంచి ప్రయోజనం చేకూరుస్తాయని, కాకపోతే ఇందుకు సమయం పడుతుందని తెలిపారు. విత్తలోటు పెరుగుతుందనే భయాలతో ప్రభుత్వం ఎకానమీపై గట్టి చర్యలు తీసుకోలేకపోతుందన్నారు. చైనా వైరస్‌ సమస్య వల్ల కూడా ఎకానమీలో పునరుజ్జీవానికి కొంత జాప్యం జరుగుతుందని కానీ మార్చి చివరకల్లా సెంటిమెంట్‌లో మార్పు వస్తుందని తెలిపారు. అప్పటికి అంతర్జాతీయంగా కూడా పాజిటివ్‌ సెంటిమెంట్‌ పెరుగుతుందన్నారు. బడ్జెట్‌, ఆర్‌బీఐ సమావేశం జరిగి స్వల్పకాలమే అవుతోందని, కానీ ఇవి క్రమంగా ఫలితాలనిస్తాయని తెలిపారు. ఇందుకు కనీసం ఒక నెలన్నా సమయం పడుతుందన్నారు.

మార్కెట్లో క్వాలిటీ కంపెనీల షేర్లలో లాంగ్‌ పొజిషన్లు కొనసాగిస్తున్నామని, షార్టింగ్‌సైడ్‌ చాలా అప్రమత్తంగా ఉంటున్నామని వివరించారు. అయితే కొని​రంగాలు, కొన్ని షేర్లు పేలవప్రదర్శన కొనసాగిస్తాయని, వీటిలో షార్ట్‌ చేయవచ్చని సూచించారు. ఫార్మా రంగంలో ఇంకా కొన్ని సమస్యలున్నా, రికవరీకి మార్గం సుగమం అవుతోందన్నారు. ఐటీపై న్యూట్రల్‌గా ఉన్నామని, మార్కెట్లు ఆటుపోట్లకు గురైతే రక్షణాత్మకంగా వ్యవహరించడానికి ఐటీ షేర్లు పనికివస్తాయని, అంతకుమించి వీటిలో పెద్దగా ఆసక్తి చూపేందుకు కారణాల్లేవని చెప్పారు. ఐటీ రంగంలో సైతం లార్జ్‌క్యాప్స్‌పైనే పెట్టుబడులు బెటరన్నారు. మిడ్‌క్యాప్స్‌లో ఏమైనా ఆకర్షణీయమైనవి కనిపిస్తాయామోనని అన్వేషిస్తున్నట్లు తెలిపారు. You may be interested

రెండో రోజూ యస్‌బ్యాంక్‌ ర్యాలీ

Friday 14th February 2020

ఇంట్రాడేలో రూ.40ల స్థాయిని అందుకున్న షేరు కంపెనీలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రముఖ ఇన్వెస్టర్లు ఆసక్తి చూపుతున్నారని యస్‌ బ్యాంక్‌ ప్రకటనతో రెండోరోజూ ఈ బ్యాంకు షేర్ల ర్యాలీ చేశాయి. ఈ రెండు రోజుల్లో షేరు 9శాతం లాభపడింది. నేడు ఈ కంపెనీ షేరు రూ.37.70 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది.  నిధుల సమీకరణ సన్నాహాలలో ఉన్న నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2019-20) మూడో త్రైమాసిక ఫలితాలను ఈ నెల 14(శుక్రవారం)కల్లా విడుదల చేయనున్నట్లు

ఇన్వెస్ట్‌మెంట్స్‌కు వినియోగ రంగాలే భేష్‌

Friday 14th February 2020

లార్జ్‌ క్యాప్స్‌, మిడ్‌ క్యాప్స్‌ అంతరం తగ్గనుంది ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, రియల్టీ, హౌసింగ్‌ ఫైనాన్స్‌ ఓకే ఇకపై ఆర్థిక వృద్ధి ఊపందుకుంటుంది - పంకజ్‌ బొబాడే, ఫండమెంటల్‌ రీసెర్చ్‌ హెడ్‌, యాక్సిస్‌ సెక్యూరిటీస్‌ బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం, పాలసీ సమీక్షలో రిజర్వ్‌​బ్యాంక్‌ చేసిన ప్రతిపాదనలు ఆర్థిక పురోగతికి దోహదం చేయనున్నాయి. దీంతో మధ్య, దీర్ఘకాలాలలో స్టాక్‌ మార్కెట్లు పుంజుకుంటాయని విశ్వసిస్తున్నట్లు యాక్సిస్‌ సెక్యూరిటీస్‌ ఫండమెంటల్‌ రీసెర్చ్‌ హెడ్‌ పంకజ్‌ బొబాడే చెబుతున్నారు. బడ్జెట్‌ ప్రతిపాదనలు, మార్కెమార్కెట్లతోపాటు, వివిధ

Most from this category