STOCKS

News


మార్కెట్లపై అనలిస్టులు ఎంతో బుల్లిష్‌!

Monday 30th September 2019
Markets_main1569786731.png-28607

కార్పొరేట్‌ పన్నును 30 శాతం నుంచి 22 శాతానికి తగ్గిస్తూ పది రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మన మార్కెట్లను బేరిష్‌ దశ నుంచి బుల్లిష్‌ దిశగా పరుగులు పెట్టించింది. దీనికి అదనంగా పలు చర్యలను కూడా ప్రకటించింది. దీంతో మన మార్కెట్లు మెరుగైన స్థాయిలో ఉన్నాయని అనలిస్టులు భావిస్తున్నారు. ఆసియాలోని ఇతర మార్కెట్లతో పోలిస్తే మన మార్కెట్లు అధిక పెట్టుబడులను ఆకర్షించగలవని నమ్ముతున్నారు. ఇంతకుముందెన్నడూ లేనంత బుల్లిష్‌ను వారు ప్రదర్శిస్తున్నారు. అనలిస్టుల ట్వీట్లు దీన్ని అద్దం పడుతున్నాయి. 

 

ఈక్విటీ మార్కెట్లు 2019 చివరికి గరిష్ట స్థాయిలో క్లోజ్‌ అవుతాయన్న అభిప్రాయాన్ని ప్రముఖ మార్కెట్‌ నిపుణుడు సందీప్‌ సభర్వాల్‌ వ్యక్తం చేశారు. ఏదైనా స్టాక్‌ను రేటింగ్‌ సంస్థలు డౌన్‌గ్రేడ్‌ చేస్తే పెట్టుబడులకు చక్కని అవకాశంగా సభర్వాల్‌ సూచించారు. ‘‘బుల్లిష్‌ మార్కెట్‌ దశ మొదలైంది. ఎలుకలు ఓడను విడిచిపెట్టి వస్తున్నాయి. అలాగే, బ్రోకరేజీలు కూడా డౌన్‌గ్రేడ్‌ చేయడం మొదలు పెడుతున్నాయి. క్రెడిట్‌ సూసే డౌన్‌గ్రేడ్‌ చేసిందని 10-20 ఏళ్లుగా ఉంచుకున్న స్టాక్స్‌ను విక్రయించడం హాస్యాస్పదం. ఏషియన్‌ పెయింట్స్‌ను డౌన్‌గ్రేడ్‌ చేయడం వల్ల 10 శాతం పడింది. ఆ తర్వాత 30 శాతం ర్యాలీ చేసింది. అలాగే, బ్రిటానియాను డౌన్‌గ్రేడ్‌ చేసింది. దాంతో 10 శాతం పడిపోయింది. ఆ తర్వాత నుంచి 25 శాతం ర్యాలీ చేసింది. ఇప్పుడు జుబిలంట్‌ ఫుడ్‌వర్క్స్‌ను అదే సంస్థ డౌన్‌గ్రేడ్‌ చేసింది’’అంటూ సందీప్‌ సభర్వాల్‌ ట్వీట్‌ చేశారు. మన మార్కెట్లో భారీ అమ్మకాలకు దారితీసిన సౌదీ దాడులకు ముందున్న ధర కంటే బ్రెంట్‌ క్రూడ్‌ ఇప్పుడు కేవలం ఒక శాతం పైనే ఉందని తెలిపారు. భారీ పన్ను సంస్కరణను ప్రభుత్వం తీసుకొచ్చిందని, మరిన్ని రానున్నాయని అభిప్రాయపడ్డారు. కనుక నెగెటివ్‌కు చోటు లేదని, ఏదైనా స్వల్పకాల డౌన్‌సైడ్‌ ఉంటే దాన్ని కొనుగోళ్లకు అవకాశంగా వినియోగించుకోవాలని సూచించారు. మధ్య స్థాయి వినియోగ కంపెనీల షేర్ల ధరలు లార్జ్‌క్యాప్‌ బ్లూచిప్‌ కంపెనీల కంటే తక్కువగా ఉన్నాయని, పెట్టుబడులకు ఇవి అవకాశంగా పేర్కొన్నారు. 

 

‘‘నరేంద్ర మోదీ న్యూయార్క్‌ బ్లూంబర్గ్‌ సదస్సులో ఎన్నో విషయాలను వెల్లడించారు. వ్యక్తిగత ఆదాయపన్ను, డివిడెండ్‌ పంపిణీ పన్ను, ఎల్‌టీసీజీ, పెద్ద ఎత్తున ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణ జాబితాలో ఉన్నాయి’’ అంటూ బసంత్‌ మహేశ్వరి వెల్త్‌ అడ్వైజర్స్‌ సహ వ్యవస్థాపకుడు బసంత్‌ మహేశ్వరి ట్వీట్‌ చేశారు. ‘‘ప్రస్తుత మార్కెట్‌ పరిస్థితిపై నేను రాసి, పాడిన ఏడో పాట ఇది.. నిద్ర లేవండి భారత్‌ అతి త్వరలోనే 5 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థ కాబోతోంది’’ అంటూ ప్రముఖ ఇన్వెస్టర్‌ విజయ్‌ కేడియా ట్వీట్‌ చేశారు. You may be interested

ఆర్‌బీఐ పాలసీ, ఆర్థికాంశాలే దిక్సూచి..!

Monday 30th September 2019

ఆర్‌బీఐ పాలసీ, ఆర్థికాంశాలే దిక్సూచి..! ఆర్‌బీఐ పరపతి విధాన నిర్ణయం శుక్రవారం వెల్లడి మంగళవారం వెల్లడికానున్న సెప్టెంబర్‌ నెల వాహన అమ్మకాల డేటా గాంధీ జయంతి సందర్భంగా బుధవారం మార్కెట్‌కు సెలవు న్యూఢిల్లీ: కీలక వడ్డీ రేట్లకు సంబంధించిన ఆర్‌బీఐ ప్రకటన, దేశీ స్థూల ఆర్థిక అంశాలు ఈ వారం స్టాక్ మార్కెట్‌కు దిశానిర్దేశం చేయనున్నాయని దలాల్‌ స్ట్రీట్‌ వర్గాలు భావిస్తున్నాయి. శుక్రవారం (అక్టోబర్‌ 4న) ఆర్‌బీఐ నాలుగో ద్వైమాసిక సమీక్ష జరగనుండగా.. ఈ సమావేశంలో

మిడ్‌క్యాప్స్‌లో చక్కని అవకాశాలు

Monday 30th September 2019

గత 13 ఏళ్లలో మిడ్‌క్యాప్‌ ఇండెక్స్‌ అన్నది ఒక ఏడాదికి మించి ఎక్కువ కాలం పాటు లార్జ్‌క్యాప్‌ ఇండెక్స్‌ కంటే పనితీరులో వెనుకబడిన సందర్భం లేదు. ఒకప్పుడు నిఫ్టీకి 50 శాతం ప్రీమియంగా నడిచిన మిడ్‌క్యాప్‌ 100 సూచీ ఇప్పుడు 20 శాతం డిస్కౌంట్‌తో ట్రేడవుతోంది. 2011 నాటి పరిస్థితులకు దగ్గరగా ఉంది. ఇది డౌన్‌సైడ్‌ విషయంలో​సౌకర్యవంతమైన పరిస్థితి అని విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. నిఫ్టీ మిడ్‌క్యాప్‌ 100లోని స్టాక్స్‌లో మూడింట

Most from this category