News


టాటా గ్రూపు స్టాక్స్‌ పరిస్థితి ఏంటి..?

Thursday 19th December 2019
Markets_main1576695499.png-30291

సైరస్‌ మిస్త్రీని టాటా గ్రూపు చైర్మన్‌గా తొలగించడం చట్ట విరుద్ధమని ఎన్‌సీఎల్‌ అప్పిలేట్‌ ట్రి‍బ్యునల్‌ ఇచ్చిన తీర్పు ప్రభావం.. బుధవారం ట్రేడింగ్‌ సెషన్‌లో టాటా గ్రూపు స్టాక్స్‌పై చూపించింది. కొన్ని షేర్లు స్వల్పంగాను, కొన్ని చెప్పుకోతగ్గంత నష్టపోయాయి. అత్యధికంగా టాటా కమ్యూనికేషన్స్‌ 7 శాతం క్షీణించింది. ఈ పరిస్థితుల్లో టాటా గ్రూపు షేర్‌ హోల్డర్లు ఆందోళన పడిపోకుండా, తాము దీర్ఘకాలం కోసం ఇన్వెస్ట్‌ చేశామా? లేక స్వల్ప కాలం కోసమా అన్నదాని ఆధారంగా నిర్ణయం తీసుకోవాలని నిపుణులు సూచిస్తుననారు. స్వల్ప కాలంలో అయితే టాటా గ్రూపు షేర్లలో అస్థితరలు ఉంటాయని అంచనా వేస్తున్నారు.

 

స్వల్ప కాలంలో అస్థిరతలు ఉన్నప్పటికీ దీర్ఘకాలం కోసం అయితే దీని ప్రభావం ఏమీ ఉండదన్న అభిప్రాయం విశ్లేషకుల నుంచి వినిపిస్తోంది. ‘‘అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌ నుంచి వచ్చిన కుదుపులాంటి తీర్పు కారణంగా వాటాదారులు స్వల్పకాలానికి నష్టపోవచ్చు. కానీ, దీర్ఘకాలంలో ఈ కంపెనీలకు విలువ అనేది వాటి వ్యాపార ప్రణాళికలు, పాలన తీరు ఆధారంగానే నిర్ణయించబడుతుంది’’ అని సెబీ మాజీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ జితేంద్రనాథ్‌గుప్తా పేర్కొన్నారు. టాటా గ్రూపు కంపెనీల ఆలోచనా తీరు భిన్నంగా ఉంటుందని, తాజా పరిణామ ప్రభావం పెద్దగా ఉండదని ఐడీబీఐ క్యాపిటల్‌ రీసెర్చ్‌ హెడ్‌ ఏకే ప్రభాకర్‌ అభిప్రాయం వ్యక్తం చేశారు. ‘‘నిర్మాణాత్మకంగా జరిగే మార్పు ఏమీ ఉండదు. స్వల్పకాలంలో ప్రతికూలత అయితే ఉంటుంది. కానీ, కొనుగోళ్లకు ఇదొక అవకాశం అవుతుంది. సైరస్‌ మిస్త్రీని టాటా సన్స్‌ చైర్మన్‌గా పునరుద్ధరించడం టాటా మోటార్స్‌పై ఎక్కువ ప్రభావం చూపుతుంది’’ అని ప్రభాకర్‌ వివరించారు. 

 

ఒకవేళ మిస్త్రీ తిరిగి టాటా గ్రూపు చైర్మన్‌గా వచ్చినా, ప్రస్తుత చైర్మన్‌ చంద్రశేఖరన్‌ తీసుకున్న నిర్ణయాల్లో వేటినీ ఉపసంహరించుకోకపోవచ్చని,  పెద్ద గందరగోళం కూడా ఉండకపోవచ్చని మార్కెట్‌ నిపుణుడు ప్రభుల్‌బసు రాయ్‌ అభిప్రాయపడ్డారు. వచ్చే ఒకటి రెండు వారాల్లో స్వల్పకాల ఆటుపోట్లు మినహా పెద్దగా అసౌకర్యం ఉంటుందని తాను అనుకోవడం లేదన్నారు. ‘‘అస్థిరతలు కొంత సమయం పాటు కొనసాగుతాయి. అయినా కానీ, టాటా గ్రూపులో ఫండమెంటల్‌గా బలమైన టాటా స్టీల్‌, టాటా మోటార్స్‌ కంపెనీల పట్ల నేను సానుకూలంగా ఉన్నాను’’ అని హేమ్‌ సెక్యూరిటీస్‌ అనలిస్ట్‌ ఆస్తాజైన్‌ అన్నారు. 


 You may be interested

మిస్త్రీ చేతికి టాటా పగ్గాలు

Thursday 19th December 2019

(అప్‌డేటేడ్‌) - చైర్మన్‌గా చంద్రశేఖరన్ నియామకం చెల్లదు - కంపెనీ లా అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌ ఆదేశాలు - ప్రైవేట్ సంస్థగా మార్పునకూ తిరస్కరణ - టాటా గ్రూప్‌ అప్పీలుకు 4 వారాల అవకాశం న్యూఢిల్లీ: టాటా గ్రూప్ చైర్మన్‌ పదవి నుంచి నాటకీయ ఫక్కీలో ఉద్వాసనకు గురైన సైరస్‌ మిస్త్రీకి ఎట్టకేలకు ఊరట లభించింది. మళ్లీ ఆయన్ను ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా నియమించాలని, గ్రూప్ సంస్థల బోర్డుల్లో డైరెక్టరుగా కొనసాగించాలని నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్ఏటీ)

రెండోరోజూ కొనసాగిన రికార్డు ర్యాలీ

Wednesday 18th December 2019

ఇంట్రాడే, ముగింపులో రికార్డు స్థాయిలే.. 12200పైన ముగిసిన నిఫ్టీ 206 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్‌ మెటల్‌, ఫార్మా, అటో రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో సూచీల రికార్డు ర్యాలీ రెండో రోజూ కొనసాగింది. సెన్సెక్స్‌ 206 పాయింట్లు లాభంతో 41,558 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 57 పాయిoట్లు 12200 పైన 12,221 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌, నిఫ్టీలు అటు ట్రేడింగ్‌నూ, ముగింపులోనూ కొత్త రికార్డు స్థాయిలు కావడం విశేషం. అంతర్జాతీయంగా నెలకొన్న సానుకూల

Most from this category