News


బీపీసీఎల్‌ విక్రయం ఆలస్యమైతే కరెక్షనే!

Wednesday 25th December 2019
Markets_main1577213493.png-30414

బీపీసీఎల్‌లో ప్రభుత్వ వాటాలను ప్రైవేటు సంస్థకు విక్రయించే ప్రతిపాదనను వచ్చే ఆర్థిక సంవత్సరానికి వాయిదా వేస్తే అది తప్పకుండా మార్కెట్లపై ప్రభావం చూపిస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. బీపీసీఎల్‌లో వ్యూహాత్మక పెట్టుబడుల విక్రయాన్ని 2020 మార్చి 31 తర్వాతకు వాయిదా వేసే అవకాశం ఉన్నట్టు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ ఓ వార్త కథనం మంగళవారం వెలుగు చూసింది. దీంతో బీపీసీఎల్‌ ధర 3 శాతం పడిపోయి రూ.477.40 వద్ద క్లోజయింది. 

 

బీపీసీఎల్‌ ప్రైవేటీకరణను 2021 ఆర్థిక సంవత్సరానికి వాయిదా వేస్తే దేశీయ ఈక్విటీ మార్కెట్లో కరెక్షన్‌కు అది ట్రిగ్గర్‌ అవుతుందని, ఎందుకంటే  ఇది ద్రవ్యలోటు లక్ష్యాలపై ప్రభావం చూపిస్తుందని ప్రభుదాస్‌ లీలాధర్‌ పీఎంఎస్‌ సీఈవో అజయ్‌ బోడ్కే అంచనా వేశారు. ‘‘ఇది కరెక్షన్‌కు దారితీస్తుంది. పన్ను వసూళ్లలోనూ లోటు నెలకొంది. వీటికి పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యంలో లోటు కూడా తోడవుతుంది. అలాగే, టెలికం కంపెనీల స్పెక్ట్రమ్‌ చెల్లింపులపై రెండేళ్లపాటు మారటోరియం విధించడం కూడా ద్రవ్య పరిస్థితులపై గణీయమైన ప్రభావం చూపుతోంది’’అని బోడ్కే వివరించారు. 

 

ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వరంగ సంస్థల్లో వాటాల అమ్మకం ద్వారా రూ.1.05 లక్షల కోట్లను సమకూర్చుకోవాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఇందుకు బీపీసీఎల్‌ ప్రైవేటీకరణ ఎంతో అవసరం. బీపీసీఎల్‌లో ప్రభుత్వ వాటాతో కనీసం రూ.50వేల కోట్లకు పైగా ఆదాయం ఖజానాకు లభిస్తుంది. ప్రైవేటీకరణ వార్తలతో ఈ ఏడాది బీపీసీఎల్‌ షేరు నికరంగా 32 శాతం ర్యాలీ కూడా చేసింది. బీపీసీఎల్‌ వాటాల విక్రయం వాయిదా వార్తలు నిజమే అయితే ద్రవ్యలోటు, పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యాన్ని ప్రభుత్వం ఏ విధంగా చేరుకుంటుందన్న దానిపై ఆందోళనలు మొదలవుతాయని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ రిటైల్‌ రీసెర్చ్‌ హెడ్‌ దీపక్‌జసాని అభిప్రాయపడ్డారు. ‘‘మార్కెట్లకు ఇదొక ప్రతికూల సంకేతం అవుతుంది. కొన్ని ప్రతికూలతలు ఉన్నా సానుకూల సంకేతాల దన్నుతో మార్కెట్లు ముందుకు వెళుతున్నాయి. ప్రతికూల వార్తలు ఇప్పుడు తెరపైకి వస్తే వచ్చే రెండు రోజుల్లో కొంత కరెక్షన్‌ ఉంటుంది’’ అని జసానీ వివరించారు. బీపీసీఎల్‌ను విక్రయించినా, విలువ ఏమీ తెచ్చిపెట్టదంటూ దీనికి రూ.451 టార్గెట్‌తో సెల్‌ రేటింగ్‌ను హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ ఇచ్చింది. ఈ అంశం మార్కెట్లకు ప్రతికూలంగా మారుతుందని షేర్‌ఖాన్‌ రీసెర్చ్‌ హెడ్‌ సంజీవ్‌హోతా కూడా అభిప్రాయపడ్డారు.You may be interested

2019లో ముకేశ్ అంబానీ సంపాదన ఎంతంటే..!?

Wednesday 25th December 2019

అక్షరాలా రూ. 1.2 లక్షల కోట్లు 2019లో పెరిగిన ముకేశ్ అంబానీ సంపద విలువ ప్రస్తుతం సుమారు రూ. 4.3 లక్షల కోట్లు అత్యంత సంపన్నుల జాబితాలో 12వ స్థానం న్యూఢిల్లీ: అపర కుబేరుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీకి 2019 సంవత్సరం బాగా కలిసొచ్చింది. ఈ ఏడాది ఆయన సంపద విలువ ఏకంగా 16.5 బిలియన్ డాలర్ల మేర (సుమారు రూ. 1.2 లక్షల కోట్లు) పెరిగింది. 60.8 బిలియన్ డాలర్లకు చేరింది.

‘2020లో 400 మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ స్టాక్స్‌ రెట్టింపు’

Wednesday 25th December 2019

స్మాల్‌క్యాప్‌ ఇన్వెస్టర్‌గా పేర్కొనే పొరింజు వెలియాత్‌, ఈక్విటీ ఇంటెలిజెన్స్‌ అనే పోర్ట్‌ఫోలియో మేనేజ్‌మెంట్‌ సర్వీసెస్‌ అధిపతి కూడా అయిన ఆయన.. 2020లో మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యా్ప్‌ స్టాక్స్‌ ర్యాలీ ఉంటుందని అంచనా వేస్తున్నారు. మిడ్‌క్యాప్‌, స్మాల్‌ క్యాప్‌ విభాగాల్లో 1,000 కంపెనీలు ఉండగా, సుమారు 350-400 వరకు సగటున 100 శాతం కంటే ఎక్కవ రాబడులను వచ్చే ఏడాదిలో ఇస్తాయని ఓ వార్తా సంస్థకు తెలిపారు.    మ్యూచువల్‌ ఫండ్స్‌ పెట్టుబడులు 15-20 లార్జ్‌క్యాప్‌

Most from this category