News


నిఫ్టీలో షార్ట్‌ స్ట్రాడిల్‌ వ్యూహం బెటర్‌!

Thursday 10th October 2019
Markets_main1570688288.png-28798

నిపుణుల సూచన
ప్రస్తుత పరిస్థితుల్లో నిఫ్టీలో షార్ట్‌ స్ట్రాడిల్‌ వ్యూహం అవలంబించవచ్చని ఎఫ్‌అండ్‌ఓ నిపుణులు సూచిస్తున్నారు. నెలాఖరు వరకు సూచీ 10800- 11600 పాయింట్ల మధ్యనే కదలాడుతుందన్న అంచనాలతో ఎక్కువమంది నిపుణులు ఉన్నారు. ఇలాంటప్పుడు 11200 స్ట్రైక్‌ప్రైస్‌ వద్ద కాల్‌ మరియు పుట్‌ను రైట్‌ చేయడం(విక్రయించడం) ద్వారా షార్ట్‌ స్ట్రాడిల్‌ వ్యూహం పాటించవచ్చని చెబుతున్నారు. 
- ఈ వ్యూహంలో 11200 కాల్‌ మరియు పుట్‌ రెండిటి లాట్స్‌ను సుమారు 400 రూపాయల(బుధవారం ధరల ఆధారంగా) వద్ద విక్రయిస్తారు. 
- నిఫ్టీ ఎక్స్‌పైరీరోజున(అక్టోబర్‌ 31న) 11200 పాయింట్ల వద్ద ముగిస్తే ఆప్షన్‌ రైటర్‌కు పైన చెప్పిన రూ. 400 లాభం పూర్తిగా వస్తుంది.
- ఈ వ్యూహంలో నిఫ్టీ అటు 11593 పాయింట్లను కానీ, ఇటు 10807 పాయింట్లను కానీ దాటితే మాత్రం రైటర్‌కు పూర్తి నష్టం వస్తుంది. ఈ రెండు స్థాయిలను అప్పర్‌ బ్రేక్‌ ఈవెన్‌ పాయింట్‌(UBEP), లోయర్‌ బ్రేక్‌ ఈవెన్‌ పాయింట్‌(LBEP) అంటారు. 
- ఈ వ్యూహంలో రెండు ఆప్షన్స్‌కు సరిపడా మొత్తాన్ని మార్జిన్‌గా ఉంచుకోవాలి. 
- 11200 పాయింట్ల నుంచి అటు కానీ, ఇటు కానీ ఒక్కో పాయింట్‌ కదలిన కొద్దీ ఆ మేరకు ప్రాఫిట్‌లో ఒక్కో రూపాయి తగ్గుతుంది. యూబీఈపీ, ఎల్‌బీఈపీల వద్ద లాభం, నష్టం ఏమీ ఉండవు. వాటిని దాటిన అనంతరం నష్టం ఆరంభమవుతుంది. 
ప్రస్తుతంఆప్షన్‌ డేటా చూస్తే 11000 పాయింట్ల వద్ద మద్దతు, 11600 వద్ద నిరోధం ఉన్నట్లు కనిపిస్తోందని యాక్సిస్‌ సెక్యూరిటీస్‌ అభిప్రాయపడింది. ఇటీవల కాలంలో ఐవీ(ఇంప్లైడ్‌ ఒలటాలిటీ) బాగా పెరిగిందని, ఇది ఇకపై దిగివచ్చే సూచనలున్నందున పైన చెప్పిన వ్యూహం సత్ఫలితాలనిస్తుందని మోతీలాల్‌ ఓస్వాల్‌ అభిప్రాయపడింది. 
పైవన్నీ నిపుణుల సూచనలు మాత్రమే, పెట్టుబడులకు ముందు సొంత అధ్యయనం తప్పనిసరి.



You may be interested

బ్యాంక్‌ నిఫ్టీ 700 పాయింట్లు డౌన్‌!

Thursday 10th October 2019

యుఎస్‌-చైనా మధ్య ప్రాథమిక వాణిజ్య చర్చలలో ఎటువంటి పురోగతి లేకపోవడంతో అంతర్జాతీయ మార్కెట్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఫలితంగా దేశీయ ఈక్విటీ మార్కెట్లు కూడా నెగిటివ్‌గా కదులుతున్నాయి. గత సెషన్‌లో 1000 పాయింట్లకు పైగా లాభపడిన నిఫ్టీ బ్యాంక్‌ ఇండెక్స్‌ గురువారం ట్రేడింగ్‌లో భారీగా నష్టపోయి ట్రేడవుతోంది. ఉదయం 11.41 సమయానికి నిఫ్టీ బ్యాంక్‌ ఇండెక్స్‌ 2.45 శాతం లేదా 703.85 పాయింట్లు నష్టపోయి 28,082.00 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఈ

పెరిగిన బంగారం

Thursday 10th October 2019

యుఎస్‌-చైనా వాణిజ్య చర్చలలో భాగంగా వాషింగ్టన్‌ వచ్చిన చైనా ప్రతినిధులు షేడ్యుల్‌కు ముందే తిరిగి చైనా వెళ్లనుండడంతో ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పంద అవకాశాలు తగ్గాయి. ఫలితంగా ఇన్వెస్టర్లు బంగారాన్ని స్వర్గదామంలో చూస్తున్నారు. యుఎస్‌-చైనా వాణిజ్య యుద్ధం వలన గురువారం ట్రేడింగ్‌లో బంగారం ధరలు ఒక వారం గరిష్ఠానికి చేరుకున్నాయి. తక్షణ బంగారం 0.4 శాతం లాభపడి ఔన్సు 1,511.24 డాలర్లకు, యుఎస్‌ గోల్డ్‌ ప్యూచర్‌ 0.3 శాతం

Most from this category