News


ఆర్‌ఐఎల్‌లో కాల్‌ రేషియో స్ప్రెడ్‌ వ్యూహం!

Wednesday 20th November 2019
Markets_main1574229704.png-29728

రిస్కు తీసుకునే ట్రేడర్లు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేరులో కాల్‌ రేషియో స్ప్రెడ్‌ వ్యూహం అవలంబించవచ్చని నిపుణులు సలహా ఇస్తున్నారు. షేరులో కనిపిస్తున్న జోరు మరికొంత కాలం కొనసాగుతుందన్న అంచనాలతో ఈ వ్యూహం అవలంబిస్తారు. కంపెనీ పోటీదారులైన ఎయిర్‌టెల్‌, వీఐఎల్‌ బాటలో టారిఫ్‌లు పెంచాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో ఆర్‌ఐఎల్‌ షేరు మరింత ముందుకే కొనసాగవచ్చని నిపుణుల అంచనా. 
వ్యూహం:


కాల్‌ రేషియో స్ప్రెడ్‌లో భాగంగా 1560 కాల్‌ కొనుగోలు చేసి 1620 కాల్స్‌ రెండిటిని విక్రయించాలి. ఆర్‌ఐఎల్‌ కన్సాలిడేషన్‌ జరిపితే స్వల్పనష్టాలతో బయటపడతారు. షేరు 1620 రూపాయలకు వచ్చినప్పుడు గరిష్ఠలాభం ఉంటుంది. ఒకవేళ షేరు 1560 దిగువన క్లోజయితే స్వల్ప నష్టం వస్తుంది. అదేవిధంగా షేరు 1660ని దాటితే నష్టం బాగా పెరుగుతుంది. అందువల్ల వ్యూహానికి రూ. 1640ని స్టాప్‌లాస్‌గా ఉంచుకోవాలి. డోలత్‌ క్యాపిటల్‌, యాక్సిస్‌ సెక్యూరిటీస్‌, బయోంట్‌ క్యాపిటల్‌ తదితర సంస్థలు ఈ వ్యూహాన్ని సూచిస్తున్నాయి. 
షేరు కదలికలను బట్టి వ్యూహంలో అమ్మాల్సిన, కొనాల్సిన కాల్స్‌ మారుతుంటాయి. అందువల్ల షేరు ధరను పరిశీలించి తగిన అధ్యయన అనంతరమే వ్యూహంలోకి దిగాలి. వ్యూహంలో తప్పకుండా యూబీపీ(అప్పర్‌ బ్రేక్‌ ఈవెన్‌ పాయింట్‌), ఎల్‌బీపీ(లోయర్‌ బ్రేక్‌ ఈవెన్‌ పాయింట్‌)ను పాటించాలి. ప్రస్తుతం ఆర్‌ఐఎల్‌ ఆప్షన్‌ చార్టులో 1600 స్ట్రైక్‌ ప్రైస్‌ వద్ద కాల్స్‌, 1500 స్ట్రైక్‌ ప్రైస్‌ వద్ద పుట్స్‌ అధికంగా ఉన్నాయి. 



You may be interested

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ @ రూ.10లక్షల కోట్లు

Wednesday 20th November 2019

ముకేశ్ అంబానీ సారథ్యంలోని  దేశీయ ప్రైవేట్‌ రంగ దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ కంపెనీ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.10లక్షల కోట్లకు అతి చేరువులో ఉంది. రిలయన్స్‌ అనుబంధ టెలికం సంస్థ ‘రిలయన్స్ జియో’ త్వరలోనే చార్జీలను పెంచనున్నట్లు మంగళవారం ప్రకటించింది. వొడాఫోన్‌ ఐడియా, భారతీ ఎయిర్‌టెల్‌ సోమవారమే ఛార్జీల పెంపు ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు సెప్టెంబర్ లో కొత్తగా 69.83 లక్షల యూజర్లు జత కావడంతో జియో

స్థిరంగా పసిడి

Wednesday 20th November 2019

దేశీయ ఎంసీఎక్స్‌ మార్కెట్లో పసిడి బుధవారం స్థిరంగా ట్రేడ్‌ అవుతోంది. నేటి ఎంసీఎక్స్‌లో డిసెంబర్‌ కాంటాక్టు 10గ్రాముల పసిడి ధర రూ.32ల స్వల్ప నష్టంతో రూ.38173.00 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇన్వెస్టర్లు తన పెట్టుబడును ఈక్విటీల్లోకి మళ్లిస్తుండంతో దేశీయ ఈక్విటీ మార్కెట్‌ ర్యాలీ రెండోరోజూ కొనసాగుతుంది. అలాగే డాలర్‌ మారకంలో రూపాయి బలహీనంగా ట్రేడ్‌ అవుతోంది. ఫలితంగా పసిడి ఫ్యూచర్లకు డిమాండ్‌ తగ్గుతోంది. ఇక నిన్నటి ఫారెక్స్‌ మార్కెట్లో రూపాయి

Most from this category