News


మార్కెట్లపై అనలిస్టుల అభిప్రాయాలు ఇలా..?

Sunday 5th January 2020
Markets_main1578247195.png-30683

ఇరాక్‌లో ఇరాన్‌ సైనిక కమాండర్‌ను అమెరికా దాడి చేసి హతం చేయడంతో.. మళ్లీ యుద్ధ వాతావరణం నెలకొంది. ప్రతీకారం తప్పదని ఇరాన్‌ హెచ్చరించడం, అమెరికా వ్యక్తులు, ఆస్తులకు నష్టం కలిగిస్తే ఇరాన్‌లోని 52 స్థావరాలను ధ్వంసం చేయాల్సి వస్తుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ హెచ్చరించడం చూడా జరిగిపోయాయి. ఇకపై వాతావరణం ఎలా ఉంటుందోనన్న ఆందోళన ప్రపంచమంతటా నెలకొంది. ఈక్విటీ మార్కెట్లపై ఈ ప్రభావం కొంత మేరకు ఉండొచ్చని అనలిస్టులు భావిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖ అనలిస్టుల అభిప్రాయాలు ఇవి..

 

‘‘మార్కెట్లు పడితే దాన్నొక కొనుగోళ్లకు అవకాశంగా ఇన్వెస్టర్లు వినియోగించుకోవచ్చు. వృద్ధిని దెబ్బతీసే విశ్వసించతగిన ఆధారాలు కనిపించనంత వరకు ఇన్వెస్టర్లు ఈ విషయమై వ్యూహాత్మకంగా వ్యవహరించాల్సి ఉంటుంది’’

- వీలీ, ఐషేర్స్‌ ఈఎంఈఏ ఇ‍న్వెస్ట్‌మెంట్‌ స్ట్రాటజీ హెడ్‌, లండన్‌

 

‘‘ఉద్రిక్తతలు పెరిగితే బంగారం విజేతగా నిలుస్తుంది. చమురు ధరలు కూడా పెరుగుతాయి. బాండ్‌ ఈల్డ్స్‌ తక్కువగా ఉన్నాయి. అమెరికాలో కొనసాగుతున్న ఈక్విటీ ర్యాలీ ఆగుతుంది. కానీ పరిస్థితి పెద్దగా మారిపోదు. ఫారెక్స్‌ మార్కెట్లో  చమురు విషయమై సున్నిత కరెన్సీలు లాభపడతాయి. యెన్‌ లాభపడుతుంది’’

- కిట్‌ జూకెస్‌, ఎఫ్‌ఎక్స్‌ చీఫ్‌ స్ట్రాటజిస్ట్‌, లండన్‌

 

‘‘జనవరి మధ్య వరకు ఇన్వెస్టర్లు తమ పొజిషన్ల నుంచి వెనక్కి పోకపోవచ్చు. అయితే, లిక్విడిటీ తగ్గితే మార్కెట్లను దిగువవైపు నడిపించొచ్చు. తదుపరి రెండు రోజులు ఎలా ఉంటుందో చూడాలి. చమురు ధరల పెరుగుదలపై ఈ ప్రభావం ఇప్పటికే చూపించేసింది’’

- కేవాన్‌ పీటర్సన్‌, గ్లోబల్‌ మాక్రో స్ట్రాటజిస్ట్‌, సింగపూర్‌

 

‘‘అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం ప్రభావం నుంచి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కోలుకుంటుందన్న మార్కెట్ల అంచనాలకు ఇది విఘాతం కలిగిస్తుంది. రిస్క్‌ సెంటిమెంట్‌ సున్నితంగానే ఉంది. సెంట్రల్‌ బ్యాంకులు నిదానంగా స్పందించడం లేదా దీర్ఘ కాలం పాటు స్పందించకపోవచ్చు’’

- వాలెంటిన్‌ మారినోవ్‌, జీ-10 కరెన్సీ రీసెర్చ్‌ హెడ్‌

 

‘‘ఇరాన్‌లో పరిస్థితి మరింత దారుణంగా మారుతుందని ఇన్వె‍స్టర్లు ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే అమెరికా దాడి తర్వాత ప్రతీకార దాడి ఉండొచ్చు. ఇన్వెస్టర్లు కొంత రిస్క్‌ తగ్గించుకునే ప్రయత్నం చేయవచ్చు. స్టాక్స్‌ బాగా ర్యాలీ చేసి ఉన్నందున, లాభాల స్వీకరణకు అవకాశం ఉంటుంది’’

- ‍స్టీవెన్‌ లీంగ్‌, హాంగ్‌కాంగ్‌You may be interested

ఇరాన్‌ పరిణామాలు, క్యూ3 ఫలితాలే దిక్సూచీ

Monday 6th January 2020

అమెరికాపై ప్రతీకార చర్య తప్పదన్న ఇరాన్‌ ఇరాన్‌కు హెచ్చరికలు జారీ చేసిన ట్రంప్‌ మార్కెట్‌పై ప్రభావం చూపుతోన్న అంతర్జాతీయ పరిణామాలు ఇన్ఫోసిస్‌, డీమార్ట్‌, ఇమామీ ఫలితాలు ఈవారంలోనే.. న్యూఢిల్లీ: దేశీ కార్పొరేట్‌ కంపెనీల క్యూ3 (అక్టోబర్‌ – డిసెంబర్‌) ఫలితాల ప్రకటనలు, స్థూల ఆర్థిక గణాంకాలు, అమెరికా–ఇరాన్‌ దేశాల మధ్య కమ్ముకున్న యుద్ధమేఘాలు వంటి పలు కీలక అంశాలు ఈ వారంలో దేశీ స్టాక్‌ మార్కెట్‌కు దిశా నిర్దేశం చేయనున్నాయని దలాల్‌ స్ట్రీట్‌ వర్గాలు భావిస్తున్నాయి.

ఇన్వెస్టింగ్‌ విషయంలో ఈ మూడూ వద్దు

Sunday 5th January 2020

స్టాక్‌ ఇన్వెస్టింగ్‌ అన్నది అంత ఈజీ టాస్క్‌ కాదు. తగినంత పరిజ్ఞానం, అవగాహన, ప్రణాళిక ఉంటేనే విజయం సాధ్యపడుతుంది. ముఖ్యంగా స్టాక్‌ మార్కెట్‌ పెట్టుబడుల విషయంలో ఎన్నో అపోహలు వినిపిస్తుంటాయి. ఇన్వెస్టర్లు వాటిని గుడ్డిగా అనుసరిస్తుంటారు కూడా. ఇవి ఏంటి, వీటిని ఎలా అధిగమించాలన్నది ఎడెల్‌వీజ్‌ పర్సనల్‌ వెల్త్‌ అడ్వైజరీ హెడ్‌ రాహుల్‌జైన్‌ తెలియజేస్తున్నారిలా..    బ్లూచిప్‌ స్టాక్స్‌  ఇన్వెస్టర్లు స్టాక్‌ను కొనుగోలు చేసే ముందు మార్కెట్‌ విలువ కాకుండా షేరు ధరను చూస్తుంటారు.

Most from this category