News


టాటా స్టీల్‌ను మెచ్చిన అనలిస్టులు

Wednesday 14th November 2018
Markets_main1542177369.png-21991

‘బై రేటింగ్‌’ కొనసాగించిన సీఎల్‌ఎస్‌ఏ
‘అవుట్‌పెర్ఫార్మ్‌ రేటింగ్‌’ ఇచ్చిన మాక్వైరీ

ముంబై:  ప్రస్తుత ఆర్థిక సంవత్సర(2018-19) రెండో త్రైమాసిక ఫలితాలు ఆశాజనకంగా ఉన్న నేపథ్యంలో టాటా స్టీల్‌ లిమిటెడ్‌ షేరు ధర బుధవారం 4 శాతం మేర లాభపడింది. ఇంట్రాడేలో రూ.610.60 గరిష్టస్థాయిని తాకింది. క్యూ2(జులై-సెప్టెంబర్‌)లో కంపెనీ నికర లాభం రూ.3,116 కోట్లుగా నమోదైనట్లు మంగళవారం టాటా స్టీల్‌ బోర్డ్‌ ఎక్స్ఛేంజీలకు సమాచారం ఇచ్చింది. ఏడాది ప్రాతిపదికన 269 శాతం వృద్ధిరేటు నమోదైనట్లు తెలిపింది. నికర ఆదాయం 34 శాతం వృద్ధి చెంది రూ.43,544 కోట్లుగా ఉందని ప్రకటించింది. నిర్వహణ లాభాలు 20 శాతం పెరిగినట్లు వివరించింది. తాజా ఫలితాల అనంతం ఈ కంపెనీ షేరుకు ఇంతకుముందు ఇచ్చిన ‘బై రేటింగ్‌’ను కొనసాగిస్తున్నట్లు అంతర్జాతీయ బ్రోకరేజ్‌ సంస్థ సీఎల్‌ఎస్‌ఏ తెలిపింది. రూ.855 వద్ద టార్గెట్‌ ధరను ప్రకటించింది. మరో ప్రముఖ సంస్థ మాక్వైరీ ఈ షేరుకు ‘అవుట్‌పెర్ఫార్మ్‌ రేటింగ్‌’ ఇచ్చింది. రూ.730 టార్గెట్‌ ధరను ప్రకటించింది. You may be interested

రూపీ ర్యాలీ: భారీ నష్టాల్లో ఐటీ షేర్లు

Wednesday 14th November 2018

డాలర్‌ మారకంలో రూపాయి విలువ బలపడటంతో ఐటీ షేర్లు నష్టపోతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరల భారీ పతనం కారణంగా రానున్న రోజుల్లో క్యాడ్‌ తగ్గుతుందనే అంచనాలతో నేడు దేశీ ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌ మారకంలో రూపాయి విలువ రెండు నెలల గరిష్టాన్ని అందుకుంది. రూపాయి బలపడటంతో డాలర్‌ మారకంలో ఆదాయాల్ని ఆర్జించే పలు ఐటీ కంపెనీల షేర్లు నష్టాల బాట పట్టాయి. ఎన్‌ఎస్‌ఈ ఐటీ షేర్లకు ప్రాతినిథ్యం వహించే

చమురు ధరలు పతనంతో పెట్రో షేర్ల ర్యాలీ

Wednesday 14th November 2018

అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరల పతనం ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీ(ఓఎంసీ) షేర్లకు కలిసొస్తుంది. అధిక డిమాండ్‌ , సరఫరా అంచనాల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్‌ క్రూడ్‌ ఒక్కరోజులోనే 4.65 డాలర్ల పతనమై 65.03 డాలర్ల వద్దకు చేరుకున్నాయి. చమురుధరలు పతనంతో కంపెనీ మార్జిన్లు పెరుగవచ్చనే అంచనాలతో ఓఎంసీ షేర్ల ర్యాలీ కొనసాగుతోంది.  నేడు ఓఎంసీ షేర్లలో ప్రధానంగా హెచ్‌పీసీఎల్‌, బీపీసీఎల్‌, ఐఓసీ షేర్లు 12శాతం ర్యాలీ చేశాయి. నిఫ్టీ-50

Most from this category