STOCKS

News


నిఫ్టీలో షార్ట్‌ స్ట్రాంగిల్‌ వ్యూహం బెటర్‌!

Wednesday 8th January 2020
Markets_main1578461054.png-30758

నిపుణుల సూచన
రిస్కు తీసుకునేందుకు సంశయించని ట్రేడర్లు ప్రస్తుత పరిస్థితుల్లో నిఫ్టీ ఆప్షన్స్‌లో షార్ట్‌ స్ట్రాంగిల్‌ వ్యూహం అవలంబించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఇందుకోసం వచ్చే వారం ఎక్స్‌పైరీ అయ్యే ఆప్షన్‌ సీరిస్‌ను ఎంచుకోవాలని తెలిపారు. ఇరాన్‌, యూఎస్‌ ఉద్రిక్తతలతో సూచీల్లో ఆటుపోట్లు పెరిగిన సంగతి తెలిసిందే. వీఐఎక్స్‌ కీలక 15 స్థాయికి పైన ప్రస్తుతం కదలాడుతోంది. ఇలాంటప్పుడు పరిమిత లాభాల కోసం కొంత రిస్కు తీసుకొని పైన చెప్పిన వ్యూహం పాటించవచ్చని ఐసీఐసీఐ డైరెక్ట్‌, యాక్సిస్‌ సెక్యూరిటీస్‌లకు చెందిన అనలిస్టులు సూచిస్తున్నారు. జనవరి 16 లోపు నిఫ్టీ 400 పాయింట్ల రేంజ్‌లో కదలాడుతుందన్న అంచనాతో ఈ వ్యూహం పాటిస్తారు. నిఫ్టీ 11885-12315 పాయింట్ల మధ్య కదిలినంత కాలం వ్యూహంలో ఫలితాలు బాగుంటాయి. ఈ రేంజ్‌ను దాటితే నష్టాలు వస్తాయి. అందువల్ల స్టాప్‌లాస్‌ కచ్ఛితంగా పాటించాలి.

ఈ వ్యూహంలో 12200 కాల్‌ను 12000 పుట్‌ను విక్రయించడం జరుగుతుంది. నిఫ్టీ పైన చెప్పిన రేంజ్‌లో ఉన్నంత కాలం ఈ రెండూ లాభసాటిగానే ఉంటాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కాస్త సద్దుమణిగితే సూచీల్లో స్థిరత్వం వస్తుందని, అప్పుడు పరిమిత రేంజ్‌లోనే స్థిరంగా కదులుతాయని, అలాంటప్పుడు ఆప్షన్‌ సెల్లర్‌కు మంచి లాభం ఉంటుందని ఐసీఐసీఐ డైరెక్ట్‌ అనలిస్టు అమిత్‌ గుప్తా చెప్పారు. ట్రేడ్‌డీల్‌ కారణంగా మార్కెట్లు అంత వేగంగా పడిపోకపోవచ్చన్నారు. అదేవిధంగా ఇరాన్‌ సమస్య కారణంగా మార్కెట్లు మరీ అంత వేగంగా పెరగకపోవచ్చని యాక్సిస్‌ సెక్యూరిటీస్‌ అనలిస్టు రాజేశ్‌పల్వియా చెప్పారు. అందువల్ల సూచీలు రేంజ్‌ బౌండ్‌లో ఉంటాయని, పై వ్యూహం మంచి ఫలితాలు ఇస్తుందని అంచనా వేశారు. You may be interested

నష్టాల మార్కెట్లోనూ ఈ షేర్లు ప్లస్‌

Wednesday 8th January 2020

యస్‌ బ్యాంక్‌, గోవా కార్బన్‌ నవీన్‌ ఫ్లోరిన్‌ కెమికల్స్‌ హెచ్చరించిన విధంగా ఇరాక్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై తాజాగా ఇరాన్‌ మిసైళ్లతో దాడి చేసిన వార్తలతో దేశీ స్టాక్‌ మార్కెట్లు నేలచూపులతో ప్రారంభమయ్యాయి. ఆపై బలహీనంగా కదులుతున్నాయి. ఉదయం 10.30 ప్రాంతంలో సెన్సెక్స్‌ 120 పాయింట్లు క్షీణించి 40,750 వద్ద ట్రేడవుతోంది. ఇక నిఫ్టీ 44 పాయింట్లు తక్కువగా 12,008 వద్ద కదులుతోంది. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ఆందోళనకు లోనైన

రూ.41,000 పైకి పసిడి

Wednesday 8th January 2020

4 ట్రేడింగ్‌ సెషన్లలో రూ.2000 ర్యాలీ  దేశీయ ఎంసీఎక్స్‌ మార్కెట్లో బుధవారం పసిడి ఫ్యూచర్ల ధర రూ.41వేల అందుకుంది. మధ్యప్రా‍చ్య దేశాల్లో నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతలు, అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ఏడేళ్ల గరిష్టానికి చేరుకోవడం, దేశీయ ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌ మారకంలో రూపాయి విలువ 20పైసలు బలహీనపడటం తదితర కారణాలు పసిడి ఫ్యూచర్లకు డిమాండ్‌ను పెంచాయి. ఫలితంగా నేడు ఎంసీఎక్స్‌ మార్కెట్లో  10గ్రాముల పసిడి ధర నిన్నటి ముగింపు(రూ.40,663)తో పోలిస్తే రూ.615లు

Most from this category