STOCKS

News


ఈ వారం స్టాక్‌ రికమెండేషన్లు

Monday 2nd December 2019
Markets_main1575260395.png-29995

ట్రెంట్‌    కొనచ్చు
బ్రోకరేజ్‌ సం‍స్థ: మోతిలాల్‌ ఓస్వాల్‌
ప్రస్తుత ధర: రూ. 520
టార్గెట్‌ ధరై రూ.605

ఎందుకంటే: టాటా గ్రూప్‌నకు చెందిన ట్రెంట్‌ కంపెనీ నాలుగు విభాగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. వెస్ట్‌సైడ్‌(బ్రాండెడ్‌ ఫ్యాషన్‌ దుస్తులు), జూడియో(యువతరం కోసం క్యాజువల్‌ వేర్‌ దుస్తులు), స్టార్‌(ఫుడ్‌ అండ్‌ గ్రోసరీ రిటైల్‌ స్టోర్‌), ల్యాండ్‌మార్క్‌(ఫ్యామిలీ ఎంటర్‌టైన్మెంట్‌ కాన్సెప్ట్‌) విభాగాలు వార్షికంగా మంచి వృద్ధినే సాధిస్తున్నాయి. ఈ రిటైల్‌ సంస్థ ఇటీవలనే జూడియో పేరుతో వేల్యూ ఫ్యాషన్‌ పార్మాట్లో స్టోర్స్‌ను ప్రారంభించింది. యువతను ఆకర్షించడమే లక్ష్యంగా ఈ కంపెనీ అందుబాటులోకి తెచ్చిన ఈ జూడియో స్టోర్స్‌కు మంచి స్పందనే లభిస్తోంది. ఫోకో(ఎఫ్‌ఓసీఓ-ఫ్రాంచైజీ ఓన్డ్‌ కంపెనీ ఆపరేటెడ్‌)  విధానంలో వీటని నిర్వహిస్తున్నందున కంపెనీకి తక్కువ వ్యయాలు (కేవలం ఇన్వెంటరీ నిర్వహణ మాత్రమే కంపెనీది), అధిక లాభాలు ఉంటాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వంద జూడియో స్టోర్స్‌ను ఏర్పాటు చేయాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటికే 60 స్టోర్స్‌ను ఏర్పాటు చేసింది. ఈ స్టోర్స్‌ల్లో ఫార్మల్స్‌ను కాకుండా క్యాజువల్‌ వేర్‌ దుస్తులను, రూ.500 కంటే తక్కువ ధర ఉత్పత్తులనే అందిస్తోంది. రానున్న 3-5 ఏళ్లలో ట్రెంట్‌ కంపెనీకి జూడియో వల్లనే ఆదాయం, నిర్వహణ లాభం జోరుగా పెరగనున్నాయి. ప్రస్తుతం 60గా ఉన్న జూడియో స్టోర్స్‌ 2022 నాటికి 300కు పెంచుకోనున్నది. 2022 నాటికి ఒక్క జూడియో ఆదాయమే రూ.1,450 కోట్లకు పెరుగుతుందని అంచనా. 2022 నాటికల్లా కంపెనీ మొత్తం ఆదాయంలో జూడియో స్టోర్స్‌ వాటా 26 శాతంగా ఉండనున్నది. నిర్వహణ లాభంలో కూడా ఈ స్టోర్స్‌ వాటా ఇదే స్థాయిలో ఉండగలదని అంచనా. మొత్తం మీద  రెండేళ్లలో  ట్రెంట్‌ కంపెనీ ఆదాయం 29 శాతం, నిర్వహణ లాభం 62 శాతం, నికర లాభం 62 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి చెందగలవని అంచనా. మార్జిన్లు అధికంగా ఉండే ప్రైవేట్‌ లేబుల్స్‌ అమ్మకాలు దాదాపు 90 శాతంగా ఉండటం, స్టోర్స్‌ల్లో స్టాక్స్‌ను త్వరితంగా అప్‌డేట్‌ చేస్తుండటం, ఇటీవలనే భారీ స్థాయిలో నిధులు సమీకరించడం, ప్రస్తుతం నష్టాల్లో ఉన్న జూడియో స్టోర్స్‌ విభాగం 3-5 ఏళ్లలోనే లాభాల్లోకి వచ్చే అవకాశాలు... సానుకూలాంశాలు. 


ఎన్‌టీపీసీ    కొనచ్చు

బ్రోకరేజ్‌ సం‍స్థ: ఎడెల్‌వీజ్‌ ఫైనాన్షియల్స్‌
ప్రస్తుత ధర: రూ. 116
టార్గెట్‌ ధరై రూ.150

ఎందుకంటే:- భారత్‌లో అతి పెద్ద విద్యుదుత్పత్తి కంపెనీ ఇదే. 1975లో ఏర్పాటైన ఈ కంపెనీ ప్రస్తుత విద్యుదుత్పత్తి సామర్థ్యం 53.6 గిగావాట్లకు పెరిగింది. 2032 కల్లా దీనిని 130 గిగావాట్లకు పెంచుకోవాలనేది ఈ కంపెనీ లక్ష్యం. తెహ్రి హైడ్రో డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌(టీహెచ్‌డీసీ), నార్త్‌ ఈస్టర్న్‌ ఎలక్ట్రిక్‌ పవర్‌ కార్పొరేషన్‌(నీప్కో)ల్లో కేంద్ర ప్రభుత్వ వాటాలను ఎన్‌టీపీసీ పూర్తిగా కొనుగోలు చేయనున్నది. సరైన సమయంలో కంపెనీకి అందివచ్చిన అవకాశం ఇదని చెప్పవచ్చు. నవీకరణ విద్యుదుత్పత్తిని భారీగా పెంచుకోవాలని ఎన్‌టీపీసీ భావిస్తున్న తరుణంలో ఈ రెండు కంపెనీల కొనుగోలు మంచి అవకాశం. ఈ రెండు సంస్థల్లో వాటా కొనుగోలు వల్ల ఈ కంపెనీ పునరుత్పత్తి విద్యుత్తు విభాగం కెపాసిటీ ప్రస్తుతమున్న 3 గిగా వాట్ల నుంచి 5 గిగా వాట్లకు పెరుగుతుంది. అంతే కాకుండా ఈ రెండు కంపెనీల బ్యాలెన్స్‌ షీట్లు, క్యాష్‌ ఫ్లోస్‌ ఆరోగ్యకరంగా ఉన్నాయి. నీప్కో రిటర్న్‌ ఆన్‌ ఈక్విటీ(ఆర్‌ఓఈ) 8 శాతంగానే ఉన్నా, టీహెచ్‌డీసీ ఆర్‌ఓఈ 20 శాతంగా ఉండటం ఎన్‌టీపీసీకి దీర్ఘకాలంలో ప్రయోజనం కలిగించనున్నది. ఎన్‌టీపీసీ నిర్వహణలో ఉన్న కోల్డమ్‌ హైడ్రో ప్రాజెక్ట్‌ ఆర్‌ఈఓ 20 శాతంగా ఉండటంతో ఇక్కడి నిర్వహణ విధానాలతో నీప్కో ఆర్‌ఈఓని కూడా 20 శాతానికి పెంచుకునే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుత ధరకు, పుస్తక విలువకు(ప్రైస్‌ టు బుక్‌వాల్యూ) మధ్య నిష్పత్తి 1గా ఉండటం (ఈ కంపెనీ పుస్తక విలువ (రూ.109)మార్కెట్‌ ధరకు దగ్గరగా ఉంది) ఈ షేర్‌ కొనుగోలుకు మరో ఆకర్షణీయ అంశమని చెప్పవచ్చు. ఇటీవలే కోల్‌ మైనింగ్‌ కార్యకలాపాల్లోకి ప్రవేశించడం వల్ల కంపెనీకి మరింత ఇంధన భద్రత సమకూరడం.... సానుకూలాంశం. You may be interested

బ్యాంకింగ్‌, చమురు రంగాల షేర్లలోకి అత్యధిక ఎఫ్‌పీఐలు

Monday 2nd December 2019

నవంబర్‌లో విదేశీ ఇన్వెస్టర్లు ఎంపిక చేసిన రంగాల షేర్లలో ఎక్కువ పెట్టుబడులు పెట్టాయి. దేశీయ ఈక్విటీల్లో ఎఫ్‌పీఐల పెట్టుబడుల్లో 70 శాతం ప్రధానంగా రెండు రంగాల్లోకి వచ్చాయి. బ్యాంకింగ్‌, చమురు మరియు గ్యాస్‌ రంగాల షేర్లలో ఎఫ్‌పీఐల పెట్టుబడుల్లో సింహభాగం చేరాయి. నవంబర్‌ 1- 15 కాలంలో ఎఫ్‌ఐఐలు దేశీయ స్టాక్స్‌లో 14326 కోట్ల పెట్టుబడులు పెట్టగా ఇందులో 46 శాతం అంటే 6630 కోట్లు బ్యాంకు స్టాకుల్లోకి, చమురు

టారీఫ్‌ల పెంపు: టెలికాం షేర్లకు రెక్కలు

Monday 2nd December 2019

కొత్త జీవితకాల గరిష్టాన్ని అందుకున్న జియో ఏడాది గరిష్టానికి ఎయిర్‌టెల్‌ 23శాతం పెరిగిన వోడాఫోన్‌-ఐడియా దేశీయ టెలికాం కంపెనీలు కాల్‌ సర్వీసులపై టారీఫ్‌ల పెంచడంతో సోమవారం ఈ రంగానికి చెందిన షేర్లు భారీగా లాభపడ్డాయి. దాదాపు నాలుగేళ్ల అనంతరం టారీఫ్‌ భారీ స్థాయిలో పెంచుతూ ఆదివారం ఆయాఆయా కంపెనీలు ప్రకటించాయి. వోడాఫోన్‌-ఐడియా, ఎయిర్‌టెల్ టారీఫ్‌ల పెంపు ఏకంగా 50శాతం దాకా, జియో టారీఫ్‌ల పెంపు 40శాతం దాకా ఉండనుంది. భారతి ఎయిర్‌టెల్, వొడాఫోన్‌ ఐడియా

Most from this category