News


బౌన్స్‌బ్యాక్‌ ఉంటుందా?

Tuesday 20th August 2019
Markets_main1566284631.png-27890

తప్పదంటున్న నిపుణులు
విదేశీ పోర్టుఫోలియో ఇన్వెస్టర్లు ఇటీవలి కాలంలో ఫ్యూచర్స్‌ మార్కెట్లో విపరీతంగా అమ్మకాలకు పాల్పడ్డారు. ఫలితంగా మార్కెట్లు ఓవర్‌సోల్డ్‌ జోన్‌లోకి వెళ్లిపోయాయి. ఇలా జరిగినప్పుడు తమ పొజిషన్లను కవర్‌ చేయడానికి మళ్లీ కొనుగోళ్లు జరపాల్సిన పరిస్థితి నెలకొంది. ఇది మొదలైతే మార్కెట్లలో మళ్లీ భారీ ర్యాలీ ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.  మార్కెట్లో ఎఫ్‌పీఐలు లక్ష షార్ట్‌ పొజిషన్లు తీసుకున్నాయని, ఇది చాలా ఎక్కువని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇలా ఎఫ్‌పీఐలు బేరిష్‌గా ఉన్న నెల తర్వాత మార్కెట్లు కనీసం 5 నుంచి 8 శాతం వరకు పెరిగడం గతంలో ఐదుమార్లు జరిగింది. అందువల్ల ఈ సారి కూడా ర్యాలీ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు.ఆప్షన్స్‌ కూడా మార్కెట్‌ ఓవర్‌సోల్డ్‌ జోన్‌లో ఉందన్న విషయాన్ని చెబుతున్నాయి. ముఖ్యంగా పుట్‌-కాల్‌ నిష్పత్తి ఎక్కువగానే ఉంది. గత 31రోజుల పీసీఆర్‌ సగటు చూస్తే 0.66 శాతంగా నమోదైంది. అంటే మార్కెట్లో  కాల్స్‌ కంటే అత్యధికంగా పుట్స్‌నే కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. సాధారణంగా ట్రేడర్లు మార్కెట్‌పై నిరాశలో ఉంటే పుట్స్‌ను కొనుగోలు చేస్తుంటారు. మార్కెట్లో నెలకొన్న ఈ ప్రతికూల ఒత్తిడి తగ్గడానికి షార్ట్‌ కవరింగ్‌ రూపంలో ర్యాలీ జరుగుతుంటుంది.

మరోవైపు సూచీల్లో ర్యాలీ వచ్చినా అది స్వల్పకాలమేనని కొందరు నిపుణుల అంచనా. ర్యాలీ జరిగినా.. సెంటిమెంట్‌ పుంజుకొనే అవకాశాలు ఇప్పటి వరకు లేవని చెబుతున్నారు. బడ్జెట్లో టాక్స్‌ ప్రతిపాదనలు, దేశంలో అత్యధిక కార్పొరేట్‌ సంస్థలు నిరాశాజనక ఫలితాలు ప్రకటించడం, అమెరికా ఫెడ్‌ రిజర్వు పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టకపోవడం, అమెరికా-చైనా ట్రేడ్‌వార్‌ కొలిక్కి రాకపోవడం వంటివి మార్కెట్లపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ఇటీవల సీఎల్‌ఎస్‌ఏ నోట్‌ ప్రకారం ఆర్థిక మందగమనం కారణంగా జూన్‌ త్రైమాసికంలో కార్పొరేట్‌ లాభాల్లో కోత పడిందని పేర్కొంది. పరిస్థితులను గమనిస్తుంటే సమీప భవిష్యత్తులో ర్యాలీ ఉన్నా మార్కెట్‌లో సంక్షోభం మాత్రం ఇప్పట్లో తొలగే అవకాశాలు తక్కువని నిపుణుల అంచనా. 



You may be interested

యస్‌ బ్యాంక్‌ షేర్లకు సీజీ పవర్‌ షాక్‌ ..!

Tuesday 20th August 2019

సీజీ పవర్‌ అండ్‌ ఇండస్ట్రీస్‌ జరిపిన నేరపూరిత ఉదంతం యస్‌ బ్యాంక్‌ షేర్లకు షాక్‌ ఇచ్చింది. కంపెనీ బ్యాలెన్స్‌ షీట్‌పై ఆందోళనలు తెరపైకి రావడంతో యస్‌ బ్యాంక్‌ షేర్లు మంగళవారం 6శాతం పతనయ్యాయి. సీజీ పవర్‌ అండ్‌ ఇండస్ట్రీస్‌ కంపెనీకి చెందిన ఉద్యోగులు కొందరు గత రెండేళ్లుగా అనధికారిక లావాదేవీలు జరిపినట్లు రిస్క్‌ అండ్‌ బ్యాలెన్స్‌ కమిటీ తెలిపింది. ఈ నేరపూరిత వ్యవహారం ద్వారా కంపెనీ అప్పులను తగ్గించి చూపడమే కాకుండా

నిరాశపరిచిన స్టెర్లింగ్‌ అండ్‌ విల్సన్‌ సోలార్‌ షేర్ల లిస్టింగ్‌

Tuesday 20th August 2019

10శాతం డిస్కౌంట్‌తో లిస్టింగ్‌  రెండువారాల కిందట ఐపీఓ ఇష్యూను పూర్తి చేసుకున్న స్టెర్లింగ్‌ అండ్‌ విల్సన్‌ సోలార్‌ షేర్ల లిస్టింగ్‌  నిరాశపరించింది. ఇటీవల మార్కెట్లో నెలకొన్న అనిశ్చితి పరిస్థితులు, ఐపీఓకు అనుకున్నంత స్థాయిలో సబ్‌స్క్రైబ్‌ కాకపోవడం లిస్టింగ్‌పై ప్రతికూల ప్రభావాన్ని చూపినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఫలితంగా మంగళవారం బీఎస్‌ఈలో ఐపీఓ ఇష్యూ ధర(రూ.780.00)తో పోలిస్తే షేర్లు 10.50శాతం డిస్కౌంట్‌తో రూ.700.00 వద్ద లిస్ట్‌ అయ్యాయి. ఇంట్రాడేలో ఒకదశలో 11.50శాతం వరకు పతనమైన

Most from this category