News


ప్రస్తుతానికి ఐరన్‌ బటర్‌ఫ్లై వ్యూహం బెటర్‌!

Monday 20th May 2019
Markets_main1558330317.png-25834

మార్కెట్లో ఎన్నికలానంతర ర్యాలీ ఆరంభమైంది. 2014 ప్రీఎలక‌్షన్‌ ర్యాలీని ఈ దఫా మార్కెట్లు ప్రతిబింబించాయి. అదేతరహాలో పోస్ట్‌ ఎలక‌్షన్‌ ర్యాలీ కూడా ఉండొచ్చని నిపుణుల అంచనా. నిఫ్టీకి 11100 పాయింట్ల స్థాయి అత్యంత కీలకమైనదిగా మారింది. ఈ స్థాయి వద్ద కీలక మూవింగ్‌ యావరేజ్‌లు, కీలక ఫిబొనాక్కి స్థాయిలు ఉన్నాయి. ఈ స్థాయికి పైన ఉన్నంత వరకు నిఫ్టీకి పెద్దగా ఇబ్బంది ఉండదని నిపుణుల విశ్లేషణ. ప్రస్తుతం మార్కెట్లకు సంస్కరణల అమలు కొనసాగుతుందన్న భరోసా కనిపిస్తోంది. ఎగ్జిట్‌పోల్స్‌లో తాజా ‍ప్రభుత్వం మరలా వస్తుందన్న అంచనాలు వచ్చాయి. దీంతో సూచీల్లో బుల్స్‌ పట్టు పెరిగింది. అయితే ఎగ్జిట్‌ పోల్స్‌ ప్రతిసారీ నిజం కావాలని లేదు. అందువల్ల అప్రమత్తంగా వ్యవహరించదలిచిన ఇన్వెస్టర్లు ఐరన్‌ బటర్‌ఫ్లై లేదా ఐరన్‌ కాండొర్‌ వ్యూహాలను అవలంబించాలని నిపుణుల సలహా. ఇంకొక పదిరోజుల్లో ఎక్స్‌పైరీ ఉన్న నేపథ్యంలో ఈ వ్యూహాలు మంచి ఫలితాలిస్తాయని నిపుణుల భావన. వీటిలో ఐరన్‌ బటర్‌ఫ్లై మెరుగు. ఈ ఐరన్‌బటర్‌ఫ్లై వ్యూహంలో ఒక ఓటీఎం(అవుట్‌ఆఫ్‌ ద మనీ) పుట్‌ మరియు కాల్‌ను కొనుగోలు చేస్తారు. అదే సమయంలో ఏటీఎం(ఎట్‌ ద మనీ) కాల్‌ మరియు పుట్‌ను విక్రయిస్తారు. ఊహించని కదలికలు ఉండే సందర్భాల్లో ఈ వ్యూహం మంచి రక్షణ కల్పిస్తుంది.


 



You may be interested

2వారాల గరిష్టానికి రూపాయి

Monday 20th May 2019

ఎగ్జిట్‌ పోల్స్‌ ఈసారి కూడా భాజపాకే జై కొట్టడంతో ఫారెక్స్‌ మార్కెట్లో రూపాయి విలువ 2వారాల గరిష్టానికి ఎగిసింది. నేడు ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌ మారకంలో రూపాయి విలువ గత ముగింపు(70.22)తో పోలిస్తే 73 పైసలు బలపడి 69.49 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఇంట్రాడేలో 86 పైసల వరకు లాభపడి 69.44 స్థాయి వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. ఈ స్థాయి రూపాయికి 2వారాల కనిష్టస్థాయి కావడం విశేషం. ఇన్వెస్టర్లు,

ఈ వారంలో కొత్త గరిష్ఠాలకు మార్కెట్‌?!

Monday 20th May 2019

రెండు వారాలుగా ఉత్కంఠతతో గరిష్ఠస్థాయిల వద్ద కదలాడుతున్న వీఐఎక్స్‌ సూచీ సోమవారం బాగా దిగివచ్చింది. బుల్స్‌, బేర్స్‌ పోరులో సోమవారం బుల్స్‌కు పట్టుచిక్కింది. గతవారమే ఇందుకు సంకేతాలు కనిపించాయి. వారాంతంలో నిఫ్టీ మంచి లాభం నమోదు చేసింది. సోమవారం ఇదే ధోరణి కంటిన్యూ చేస్తూ నిఫ్టీ 200 పాయింట్ల పైన లాభపడింది. బ్యాంకు నిఫ్టీ తన రికార్డు గరిష్టానికి కేవలం 1 శాతం దూరంలో ఉంది. నిఫ్టీ నిరోధం 11550

Most from this category