News


ఈ ఆరు స్టాకులు లార్జ్‌క్యాప్‌లోకి...

Tuesday 2nd July 2019
Markets_main1562063483.png-26743

  • ఏఎంఎఫ్‌ఐ మెథడాలజీ ప్రకారం లార్జ్‌క్యాప్‌లోకి 6 స్టాకులు.. 
  • మిడ్‌ క్యాప్‌లోకి 23 స్టాకులు చేరనున్నాయి : ఈస్ట్‌ ఇండియా సెక్యురిటీస్‌ 
  • దీర్ఘకాలానికి మిడ్‌ క్యాప్‌లో పెట్టుబడులు మంచిదే

లార్జ్‌క్యాప్‌లోకి కొత్తగా కంపెనీలు..
బెంచ్‌మార్కు సూచీలు సెన్సెక్స్‌, నిఫ్టీలు ఈ ఏడాది మొదటి ఆరు నెలలో 9 శాతం లాభపడ్డాయి. ఈ లాభాలలో లార్జ్‌ క్యాప్‌ల పాత్ర చాలా కీలకమైనది. ఇప్పుడు ద్వితియార్థం మొదలుకానుంది. మూచ్యువల్‌ ఫండ్‌ల అసోసియేషన్‌(ఏఎంఎఫ్‌ఐ) మెథడాలజీ ప్రకారం లార్జ్‌క్యాప్‌ విభాగంలోకి కొత్తగా ఆరు కంపెనీల స్టాకులు చేరనున్నాయని ఈస్ట్‌ ఇండియా సెక్యూరిటీస్‌ ప్రకటించింది. అవి పీఎన్‌బీ, ఐడీబీఐ బ్యాంక్‌, పవర్‌ ఫైనాన్స్‌, టొరంటో పార్మా, ఏబీబీ ఇండియా, ఏసీసీ కంపెనీలని, ఈ స్టాకులు ఎల్‌ అండ్‌ టీ ఫైనాన్స్‌, అశోక్‌ లేలాండ్‌, పేజి ఇండస్ట్రీస్‌, ఎమ్‌ఆర్‌ఎఫ్‌, సెయిల్‌, ఇండియా బుల్స్‌ వెంచర్స్‌ స్టాకులకు బదులుగా చేరనున్నాయని తెలిపింది.  ఈ తొలగింపు జాబితాలోని  స్టాకులు లార్జ్‌క్యాప్‌ నుంచి మిడ్‌క్యాప్‌ విభాగంలోకి రానున్నాయని పేర్కొంది.
   
ఏఎంఎఫ్‌ఐ నివేదిక..
 నకిలీ మూచ్యువల్‌ ఫథకాలను అరికట్టేందుకు, స్టాక్‌ హోల్డింగ్‌లను హేతుబద్ధీకరించేందుకు సెబీ మూచ్యువల్‌ ఫండ్‌ ఫథకాలను పునర్మించింది. ఏఎంఎఫ్‌ఐ లార్జ్‌/మిడ్‌/స్మాల్‌ క్యాప్‌ కంపెనీల ఆరు నెలల సరాసరి మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ను పరిశీలించి నివేదిక విడుదల చేస్తుంది. ఈ నివేదిక ప్రతి ఆరు నెలల కొకసారి విడుదలవుతోంది.  ఏఎంఎఫ్‌ఐ నివేదికలోని మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌లో మొదట వంద స్థానాలలో ఉన్న కంపెనీలు లార్జ్‌ క్యాప్స్‌గా, 101 స్థానం నుంచి 250 వ స్థానం వరకు ఉన్న కంపెనీలు మిడ్‌ క్యాప్‌ కంపెనీలుగా, ఆ తర్వాత ఉన్న కంపెనీలు స్మాల్‌ క్యాప్‌ కంపెనీలుగా వర్గీకరించబడతాయి. 
 
మిడ్‌ క్యాప్‌ విభాగంలోకి 23 కంపెనీలు..
   23 స్టాక్‌లు మిడ్‌ క్యాప్‌ విభాగంలోకి రానున్నాయని ఈస్ట్‌ ఇండియా సెక్యూరిటీస్‌ తెలిపింది. వీటిలో కార్పోరేషన్‌ బ్యాంక్‌, అలహాబాద్‌ బ్యాంక్‌, ఇండియా ఓవర్‌సీస్‌ బ్యాంక్‌, యూకో బ్యాంక్‌, టీటీకే ప్రెస్టెజీ, వీ గార్డ్‌, కజారియా సిరమిక్స్‌, ప్రెస్టెజీ ఎస్టేట్స్‌, వినతి ఆర్గానిక్స్‌, సింఫనీ స్టాకులున్నాయి. ఈ మిడ్‌ క్యాప్‌ విభాగం నుంచి థామస్‌ కుక్‌, మిందా ఇండస్ట్రీస్‌, ఎస్కార్ట్స్‌, ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌, డిష్‌ టీవీ ఇండియా, దివాన్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌, రిలయన్స్‌ ఇన్ఫ్రా మొదలైన కంపెనీలు  వైదలగనున్నాయని తెలిపింది.  

పెట్టుబడులకు ఏది మంచిది?
 ద్వితియార్ధం మొదలు కానుంది. ఇలాంటి సమయంలో ఎక్కడ ఇన్వెస్ట్‌ చేయాలి? గత కొంత కాలంగా లార్జ్‌క్యాప్స్‌ ప్రదర్శన తగినంతగా లేదు. నిఫ్టీ మిడ్‌ క్యాప్‌ ఇండెక్స్‌లోని కొన్ని ముఖ్యమైన స్టాక్‌లు దిద్దుబాటుకు గురికావడంతో ఆ సూచీ నష్టపోయింది.  నిఫ్టీ మిడ్‌క్యాప్‌ సూచీలో సుమారు 45స్టాక్‌లు గత 18 నెలల కాలంలో 30 నుంచి 90 శాతం వరకు దిద్దుబాటుకు గురయ్యాయి. ఆర్ధిక వ్యవస్థ మందగమనంలో ఉండడం, ఎన్‌బీఎఫ్‌సీల లిక్విడిటీ సమస్య, దేశియ వినియోగం అంతంత మాత్రంగానే ఉండడంతో మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ సూచీలలో తీవ్ర హెచ్చుతగ్గులు నెలకొన్నాయని నిపుణులు తెలిపారు.
 
   దీర్ఘకాలంలో పెట్టుబడులు పెట్టాలనుకుంటే మిడ్‌ క్యాప్‌ల వలన అధిక లాభాలను పొందవచ్చు. కానీ నాణ్యమైన స్టాక్‌లను ఎంచుకోవడం ముఖ్యం. ‘ లార్జ్‌క్యాప్‌ కంటే మిడ్‌ క్యాప్‌లు 14 శాతం రాయితీతోనే ట్రేడవుతున్నాయి. ఆర్ధిక వ్యవస్థలో లిక్విడిటీ లభ్యత మెరుగుదల, మార్కెట్‌ సెంటిమెంట్‌లు మిడ్‌క్యాప్‌ ప్రదర్శనపై ముఖ్యంగా ప్రభావం చూపుతాయి’ అని  బ్రోకరేజ్‌ సంస్థ మోతిలాల్‌ ఓస్వాల్‌ పేర్కొంది. ఫెడరల్‌ బ్యాంక్‌, డీసీబీ బ్యాంక్‌, ఇండియన్‌ హొటల్స్‌, కేఈసీ ఇంటర్నేషనల్‌, అశోక బిల్డ్‌కాన్‌, ఏబీఎఫ్‌ఆర్‌ఎల్‌, జెన్స్‌ర్‌ వంటి మిడ్‌ క్యాప్‌ కంపెనీలను పరిశీలించవచ్చని
సూచించింది. 30-40 ఏళ్ల కోసం ఎవరైనా పెట్టుబడులు పెట్టాలనుకుంటే లార్జ్‌, మిడ్‌ క్యాప్‌ల మిశ్రమ స్టాకులను పరిశీలించవచ్చని ఎమ్కే వెల్త్‌ మానేజమెంట్‌ సీఈఓ బావేష్‌ శాంగ్వీ అన్నారు. ఇందులో 70 శాతం లార్జ్‌, మల్టీ క్యాప్‌లకు, 30 శాతం మిడ్‌ క్యాప్‌ ఫండ్‌లకు కేటాయించడం మంచిదని తెలిపారు.   You may be interested

11,900పైన నిఫ్టీ ముగింపు

Tuesday 2nd July 2019

130 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్‌  ట్రేడింగ్‌ ఆద్యంతం లాభనష్టాల మధ్య ఊగిసలాడిన సూచీలు చివరికి లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్‌ 130 పాయింట్లు లాభపడి 39,816.48 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 44పాయింట్లు పెరిగి 11900 పైన 11,910.35 వద్ద ముగిసింది. సూచీలకు ఇది వరుసగా రెండో రోజు లాభాల ముగింపు. డాలర్‌ మారకంలో రూపాయి (9 పైసలు) బలహీనపడటంతో ఐటీ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. మెటల్‌, ఎఫ్‌ఎంజీసీ, ఫైనాన్స్‌ సర్వీసెస్‌, అటో రంగ

హెచ్‌డీప్‌సీ ద్వయం...రికార్డు హై

Tuesday 2nd July 2019

ఒడిదుడుకుల మార్కెట్లో హెచ్‌డీఎఫ్‌సీ ద్వయం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, హెచ్‌డీఎఫ్‌సీ షేర్లు రికార్డు గరిష్టాలను అందుకున్నాయి.  హెచ్‌డీఎఫ్‌సీ:- నేడు హెచ్‌డీఎఫ్‌సీ షేరు ఎన్‌ఎస్‌లో రూ.2,256.80ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. మార్కెట్‌ ప్రారంభం నుంచి షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో ఇంట్రాడేలో 1.50శాతం లాభపడి రూ.2,278.50ల వద్ద కొత్త జీవితకాల గరిష్టాన్ని నమోదు చేశాయి. మధ్యాహ్నం గం.2:30ని.లకు షేరు గతముగింపు(రూ.2,245.90)తో పోలిస్తే 1.40శాతం లాభంతో రూ.2,277.75ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. కాగా షేరు ఏడాది

Most from this category