News


మ్యూచువల్‌ ఫండ్స్‌ వర్గీకరణల్లో యాంఫి మార్పులు

Saturday 4th January 2020
Markets_main1578078068.png-30656

మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థల అసోసియేషన్‌ ‘యాంఫి’ అర్ధ సంవత్సర స్టాక్స్‌ జాబితాను విడుదల చేసింది. సెబీ, స్టాక్‌ ఎక్సేంజ్‌లతో సంప్రదించిన అనంతరం స్టా‍క్స్‌తో జాబితాను రూపొందించినట్టు యాంఫి తెలిపింది. లార్జ్‌క్యాప్‌, మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ కంపెనీలను వాటి మార్కెట్‌ విలువ ఆధారంగా నిర్ణయించే విషయంలో సెబీ 2017లో మార్గదర్శకాలను విడుదల చేసింది. వీటి ఆధారంగా స్టాక్స్‌తో కూడిన జాబితాను యాంఫి రూపొందించి విడుదల చేయాల్సి ఉంటుంది. తాజా జాబితాలో పలు స్టాక్స్‌ మిడ్‌క్యాప్‌ నుంచి లార్జ్‌క్యాప్‌నకు, పలు స్టాక్స్‌ స్మాల్‌క్యాప్‌ నుంచి లార్జ్‌క్యాప్‌ విభాగంలోకి చేరడం గమనార్హం.

 

అదానీ ట్రాన్స్‌మిషన్‌, ఇన్ఫోఎడ్జ్‌ ఇండియా, కన్సాయ్‌ నెరోలాక్‌ పెయింట్స్‌, ముత్తూట్‌ ఫైనాన్స్‌, ఆర్‌ఈసీ లార్జ్‌క్యాప్‌ విభాగంలోకి వెళ్లాయి. అదే సమయంలో క్యాడిలా హెల్త్‌కేర్‌, ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌, న్యూ ఇండియా అష్యూరెన్స్‌, వొడాఫోన్‌ ఐడియా, యస్‌ బ్యాంకు లార్జ్‌క్యా్‌ప్‌ నుంచి మిడ్‌క్యాప్‌ విభాగంలోకి వెళ్లడం గమనార్హం. 

 

స్మాల్‌క్యాప్‌ నుంచి మిడ్‌క్యాప్‌ కేటగిరీలోకి వెళ్లిన కంపెనీల్లో అదానీ గ్రీన్‌, అక్జో నోబెల్‌, క్రెడిట్‌ యాక్సెస్‌ గ్రామీణ్‌, డాక్టర్‌ లాల్‌ పాథ్‌ల్యాబ్స్‌, ఫ్యూచర్‌ లైఫ్‌ స్టయిల్‌, ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌, మిండా ఇండస్ట్రీస్‌, నిట్‌ టెక్నాలజీస్‌, షాఫ్లర్‌ ఇండియా, జైడస్‌ వెల్‌నెస్‌, జేకే సిమెంట్స్‌, పీవీఆర్‌ ఉన్నాయి. ఇటీవలే లిస్టింగ్ అయిన ఐఆర్‌సీటీసీ, ఐఐఎఫ్‌ఎల్‌ వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీలు కొత్తగా మిడ్‌క్యాప్‌ విభాగంలో చోటు సంపాదించాయి.

 

మిడ్‌క్యాప్‌ నుంచి స్మాల్‌క్యాప్‌ కేటగిరీలోకి వెళ్లిన వాటిల్లో సెంట్రల్‌ బ్యాంక్‌, గ్రాఫైట్‌ ఇండియా, ఇండియన్‌ బ్యాంకు, జుబిలంట్‌ లైఫ్‌, నేషనల్‌ అల్యూమినియం, సెంచురీ టెక్స్‌టైల్స్‌, ఎన్‌బీసీసీ, ఎన్‌ఎల్‌సీ ఇండియా, క్వెస్‌కార్ప్‌, స్టెరిలైట్‌ టెక్నాలజీస్‌, టీటీకే ప్రెస్టీజ్‌, ఐఐఎఫ్‌ఎల్‌ ఫైనాన్స్‌ ఉన్నాయి. స్మాల్‌క్యాప్‌ విభాగంలో కొత్తగా చోటు సంపాదించుకున్న వాటిల్లో సీఎస్‌బీ బ్యాంకు, గుజరాత్‌ ఫ్లోరోకెమికల్స్‌, ఇండియామార్ట్‌ ఇంటర్‌మెష్‌, స్పందన స్ఫూర్తి ఫైనాన్షియల్‌ ఉన్నాయి. మరిన్ని వివరాలను యాంఫి వెబ్‌పోర్టల్‌ నుంచి తెలుసుకోవచ్చు. You may be interested

విద్యుత్ వాహనాలకు ఊతం

Saturday 4th January 2020

ఫేమ్‌-2 కింద 2,636 చార్జింగ్ స్టేషన్లకు అనుమతులు తెలంగాణలో 138, ఏపీలో 266 ఏర్పాటు కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్‌ వెల్లడి న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ వాహనాల తయారీ, వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన ఫేమ్ ఇండియా స్కీమ్ రెండో విడతలో భాగంగా 2,636 చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు కేంద్రం అనుమతులు ఇచ్చింది. 24 రాష్ట్రాల్లోని 62 నగరాల్లో ఇవి ఏర్పాటు కానున్నట్లు కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్‌ వెల్లడించారు. ఆయా నగరాల్లో

ద్విచక్ర వాహనాలకు స్థిర అవుట్‌లుక్‌: ఇక్రా

Saturday 4th January 2020

ముంబై: ప్రయాణికుల (పీవీ), వాణిజ్య వాహనాల (సీవీ) పట్ల తన నెగెటివ్‌ అవుట్‌లుక్‌ను రేటింగ్‌ ఏజెన్సీ ఇక్రా కొనసాగించింది. ఆర్థిక వృద్ధి నిదానించడం, రిటైల్‌ డిమాండ్‌ ఆశాజనకంగా లేకపోవడం వల్లే ఈ దృక్పథానికి వచ్చినట్టు తెలిపింది. అలాగే, ద్విచక్ర వాహనాలపై స్టెబుల్‌ అవుట్‌లుక్‌ను ప్రకటించింది. తగినంత నిధుల లభ్యత లేకపోవడం, రుణ షరతులు కఠినంగా మారడం, గ్రామీణ ఆదాయం బలహీనంగా ఉండడం గత కొన్ని త్రైమాసికాల్లో వినియోగ డిమాండ్‌పై గణనీయంగా

Most from this category