News


మిశ్రమంగా ముగిసిన ఏడీఆర్‌లు

Saturday 2nd November 2019
Markets_main1572691015.png-29309

అమెరికా స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌లో ట్రేడయ్యే భారత కంపెనీల ఏడీఆర్‌లు శుక్రవారం మిశ్రమంగా ముగిశాయి. అక్టోబర్‌లో అమెరికా ఉపాధి కల్పన మార్కెట్‌ అంచనాలకు మించి నమోదు కావడం, వాణిజ్య చర్చలు సఫలం దిశగా సాగుతున్నాయని వైట్‌హౌస్‌ అధికారుల ప్రకటించిన నేపథ్యంలో నిన్న అక్కడి సూచీలు రికార్డు స్థాయిలో ర్యాలీ చేశాయి. మరోవైపు ఆరు ప్రధాన కరెన్సీ విలువల్లో డాలర్‌ ఇండెక్స్‌ తీవ్ర ఒడిదుడుకులకు లోనై 97.23 స్థాయి వద్ద స్థిరపడింది. అంతర్జాతీయ మార్కెట్లో మెటల్‌ షేర్ల ర్యాలీలో భాగంగా వేదాంత ఏడీఆర్‌ అత్యధికంగా 5.64 శాతం లాభపడింది. టాటామోటర్స్‌ ఏడీఆర్‌ 2.50శాతం ర్యాలీ చేసింది. డాక్టర్‌ రెడ్డీస్‌ ఏడీఆర్‌ 1.76 శాతం పెరిగింది. బ్యాంకింగ్‌ రంగానికి చెందిన హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంక్‌ ఏడీఆర్‌లు అరశాతం వరకు లాభపడ్డాయి. డాలర్‌ రూపంలో ఆదాయాలను ఆర్జించే టెక్నాలజీ కంపెనీ షేర్లైన ఇన్ఫోసిస్‌, విప్రో ఏడీఆర్‌లు నష్టాలో​ముగిశాయి. ఇన్ఫోసిస్‌ ఏడీఆర్‌ 0.73శాతం నష్టపోగా, విప్రో ఏడీఆర్‌ అరశాతం నష్టపోయింది. 



You may be interested

స్మాల్‌ క్యాప్స్‌ ర్యాలీ..!

Sunday 3rd November 2019

గత వారం మార్కెట్లకు మంచి సానుకూలం. సెన్సెక్స్‌ 40,392.22 పాయింట్ల ఆల్‌టైమ్‌ గరిష్ట స్థాయిని నమోదు చేసింది. దీపావళి నుంచి మార్కెట్లలో లాభాలు కొనసాగుతూనే ఉన్నాయి. మార్కెట్లపై బుల్స్‌ పట్టు బలంగా ఉంది. కార్పొరేట్‌ కంపెనీల ఫలితాలు అంచనాలకు కొంచెం ఎగువనే ఉండడం, కార్పొరేట్‌ పన్ను తగ్గింపుతో రానున్న త్రైమాసికాల్లో మరింత మెరుగైన ఫలితాలకు అవకాశం ఉండడం, ఆర్థిక రంగ రికవరీతో కంపెనీలు మరింత ప్రయోజనం పొందగలవన్న అంచనాలు తాజా

5వారాల గరిష్టానికి పసిడి

Saturday 2nd November 2019

ప్రపంచమార్కెట్లో పసిడి ఫ్యూచర్‌ శుక్రవారం 5వారాల గరిష్టం వద్ద స్థిరపడింది. అమెరికాలో నిన్నరాత్రి డిసెంబర్‌ కాంట్రాక్టు ఔన్స్‌ పసిడి ఫ్యూచర్‌ ధర 3.40డాలర్ల నష్టంతో 1,511.40 డాలర్ల వద్ద ముగిసింది. నిన్నరాత్రి అమెరికా అక్టోబర్‌ ఉపాధి కల్పన గణాంకాలు ఆశించిన స్థాయిలో నమోదుకావడంతో అక్కడి సూచీలు రికార్డు స్థాయిలని అందుకోవడంతో పసిడి స్వల్ప నష్టాలను చవిచూసింది. అయితే, మాన్యూఫాక్చరింగ్‌ యాక్టివిటీ, బాండ్‌ ఈల్డ్స్‌ తగ్గడం పసిడి పతనాన్ని అడ్డుకున్నాయి. ఫెడ్‌ రిజర్వ్‌

Most from this category