STOCKS

News


‘‘టైమ్స్‌ గ్రూప్‌’’ చేతికి అంబానీ మీడియా ఆస్తులు..!?

Thursday 28th November 2019
Markets_main1574937876.png-29927

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ తన న్యూస్‌ మీడియా ఆస్తులను ఇండియా టైమ్స్‌ గ్రూప్‌నకు విక్రయించేందుకు చర్చలు జరుపుతున్నారని వార్తలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. నష్టాల్లో నడుస్తున్న మీడియా వ్యాపారాన్ని వదిలించుకునే దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేశారని, అందులో భాగంగా తన న్యూస్‌ మీడియా ఆస్తులను ఇండియా టైమ్స్‌ గ్రూప్‌నకు అమ్మేందుకు చర్చలు జరుపుతున్నారని తెలుస్తోంది. గతవారంలో నెట్‌వర్క్‌ 18 మీడియా అండ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ లిమిటెడ్‌లో కొంతవాటాను జపాన్‌ ఎలక్ట్రానిక్స్‌ దిగ్గజం సోని కార్పోరేషన్‌ కొనుగోలు చేసే అవకాశాలున్నట్లు వార్తలు వెలుగులోకి వచ్చిని సంగతి తెలిసిందే. మొత్తం వాటాను ఒకేసారి అమ్మడం లేదా కొంత వాటాను మాత్రమే విక్రయించడం లాంటి అంశాలను ముకేశ్‌ పరిశీలిస్తున్నట్లు తెలిస్తున్నట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులు తెలిపారు. మరోవైపు ముకేశ్‌కి చెందిన నెట్‌వర్క్‌ 18 మీడియా, ఇన్వెస్ట్‌మెంట్‌ ఆస్తుల మదింపు నిర్వహణకు టైమ్స్ ఆఫ్ ఇండియా పబ్లిషర్‌ బెన్నెట్ కోల్మన్‌... సలహాదారులను నియమించే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ వ్యవహరంపై టైమ్స్‌ గ్రూప్‌ ప్రతినిధులను వివరణ కోరేందుకు ప్రయత్నించగా వారు అందుబాటులోకి రాలేదు. మరోవైపు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ప్రతినిధులు ప్రస్తుతం నడుస్తున్న ప్రతిపాదికన టీవీ 18 మాతృసంస్థ వాల్యూవేషన్ల అంచనా వేస్తున్నామని తెలిపారు. ఈ అంశంపై ఇంతకు మించి మాట్లాడేందుకు వారు నిరాకరించారు.


ఈ విక్రయ వార్తలతో బీఎస్‌ఈలో ఇంట్రాడే నెట్‌వర్క్‌18 మీడియా షేరు 10.50శాతం లాభపడింది. మధ్యాహ్నం గం.1:30ని.లకు షేరు క్రితం ముగింపు(రూ.29.05)తో పోలిస్తే 3.50శాతం లాభంతో రూ.30.05 వద్ద ట్రేడ్‌ అవుతోంది.


టీవీ18 బ్రాడ్‌కాస్ట్‌ షేరు ఇంట్రాడేలో 6.50శాతం లాభపడి రూ.24.85 వరకు పెరిగింది. మధ్యాహ్నం గం.1:40నిలకు షేరు క్రితం ముగింపు(రూ.23.30)తో పోలిస్తే 3.50శాతం లాభంతో రూ.24.50 వద్ద ట్రేడ్‌ అవుతోంది. You may be interested

బీఎన్‌పీ పారిబా నుంచి 30 సిఫార్సులు

Thursday 28th November 2019

దేశీయ మార్కెట్‌,  ఎకానమీ వ్యతిరేక దిశల్లో కదులుతున్నాయని ప్రముఖ బ్రోకింగ్‌ సంస్థ బీఎన్‌పీ పారిబా అభిప్రాయపడింది. క్యు2లో కార్పొరేట్‌ ఫలితాలు చాలా వరకు అంచనాలకు మించాయని కానీ దీనివల్ల భవిష్యత్‌ అంచనాలు మరింత పెరిగాయని తెలిపింది. తాజాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఈపీఎస్‌ అంచనాలు 11 శాతం, వచ్చే ఏడాదికి 19 శాతానికి చేరాయని పేర్కొంది. ప్రస్తుతం ఇండియా మార్కెట్‌పై ఓవర్‌వెయిట్‌గానే ఉన్నామని తెలిపింది. ఈఏడాది చివరకు సెన్సెక్స్‌ టార్గెట్‌

రిలయన్స్‌ కదులుతున్న రైలు!

Thursday 28th November 2019

‘రిలయన్స్‌ కదులుతున్న ట్రైన్‌ లాంటింది. ప్రస్తుత స్థాయిల వద్ద ఈ షేరును కొనుగోలు చేయడం ఉత్తమం కాదు. కానీ ఈ షేరు దిద్దుబాటుకు గురయినప్పుడు కొనుగోలు చేయడం మంచిది. కానీ రిలయన్స్‌లో ఇప్పటికే ఇన్వెస్టర్‌గా ఉన్నవాళ్లు మరికొన్ని షేర్లను జోడించుకోండి. ప్రస్తుత స్థాయి నుంచి రిలయన్స్‌ 8-10 శాతం కదులుతుందని అంచనా వేస్తున్నాం. కానీ కొత్త పెట్టుబడులకు ఈ షేరు మంచి రిస్క్‌ రివార్డును అందించలేదు’ అని ఎలిక్సిర్‌ ఈక్విటీస్‌,

Most from this category