News


రెండో రోజూ అల్ఫాజియో దూకుడు

Friday 17th January 2020
Markets_main1579238251.png-30987

లాభాల్లో మెట్రోపోలిస్‌ హెల్త్‌కేర్‌

వరుసగా రెండో రోజు ఒడిదొడుకుల మధ్య ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్లు కన్సాలిడేషన్‌ బాటలో సాగుతున్నాయి. ఏజీఆర్‌ బకాయిలపై టెలికం కంపెనీలు పెట్టుకున్న రివ్యూ పిటిషన్‌ను సుప్రీం కోర్టు తిరస్కరించిన నేపథ్యంలో బ్యాం‍కింగ్‌ కౌంటర్లలో అమ్మకాలు ఊపందుకోగా.. వొడాఫోన్‌ ఐడియా 30 శాతం కుప్పకూలింది. అయితే ఎయిర్‌టెల్‌తోపాటు.. జియో సేవల మాతృ సంస్థ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ కౌంటర్లు బలపడ్డాయి. ఉదయం 10.30 ప్రాంతంలో సెన్సెక్స్‌ 108 పాయింట్లు పుంజుకుని 42,041ను తాకగా.. నిఫ్టీ 20 పాయింట్లు బలపడి 12,375 వద్ద ట్రేడవుతోంది. కాగా.. ​పీఎస్‌యూ ఇంధన రంగ దిగ్గజం​ఓఎన్‌జీసీ నుంచి కాంట్రాక్టులు పొందిన నేపథ్యంలో అల్ఫాజియో ఇండియా కౌంటర్‌ వరుసగా రెండో రోజు జోరందుకోగా.. శ్రద్దా డయాగ్నోస్టిక్‌ సెంటర్‌ కొనుగోలు వార్తలతో మెట్రోపోలిస్‌ హెల్త్‌కేర్‌ కౌంటర్‌కు డిమాండ్‌ కనిపిస్తోంది. వెరసి ఒడిదొడుకుల మార్కెట్లోనూ ఈ రెండు షేర్లూ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం... 

అల్ఫాజియో ఇండియా
ప్రభుత్వ రంగ దిగ్గజం ఓఎన్‌జీసీ నుంచి రెండు కాంట్రాక్టులు దక్కించుకున్న నేపథ్యంలో వరుసగా రెండో రోజు అల్ఫాజియో ఇండియా లిమిటెడ్‌ కౌంటర్‌ జోరందుకుంది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు క్యూ కట్టడంతో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో అల్ఫాజియో షేరు 10 శాతం అప్పర్‌ సర్క్యూట్‌ను తాకింది. అమ్మేవాళ్లు కరవుకావడంతో రూ. 20 ఎగసి రూ. 220 సమీపంలో ఫ్రీజయ్యింది. గురువారం సైతం ఈ షేరు 10 శాతం జంప్‌చేసి రూ. 200 వద్ద ముగిసింది. ఓఎన్‌జీసీ నుంచి 3డీ సీస్మక్‌ డేటా ఔట్‌సోర్సింగ్‌ సేవల కోసం బొగఫా సింక్‌లైన్‌ ప్రాంతంలో రూ. 43.23 కోట్లు, ట్రిచనా ప్రాంతంలో సేవల కోసం రూ. 68.75 కోట్ల విలువైన ఆర్డర్లు లభించినట్లు అల్ఫాజియో ఇండియా తెలియజేసింది.

మెట్రోపోలిస్‌ హెల్త్‌కేర్‌
శ్రద్ధా డయోగ్నోస్టిక్‌ సెంటర్‌లో 51 శాతం వాటా కొనుగోలుకి కుదుర్చుకున్న ఒప్పందాన్ని(ఎప్‌పీఏ) పూర్తి చేసినట్లు మెట్రోపోలిస్‌ హెల్త్‌కేర్‌ లిమిటెడ్‌ తాజాగా పేర్కొంది. తద్వారా గుజరాత్‌ రాష్ట్రంలోనూ సేవలను విస్తరించే వీలు కలగనున్నట్లు తెలియజేసింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మెట్రోపోలిస్‌ హెల్త్‌కేర్‌ షేరు ఎన్‌ఎస్‌ఈలో 2.6 శాతం లాభంతో రూ. 1668 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 1673 వరకూ ఎగసింది. మెట్రోపోలిస్‌ హెల్త్‌కేర్‌లో ప్రమోటర్లకు 57.41% వాటా ఉంది.  You may be interested

ర్యాలీస్‌.. క్యూ3 జోష్‌- యస్‌ బ్యాంక్‌.. ఏజీఆర్‌ షాక్‌

Friday 17th January 2020

టాటా గ్రూప్‌ ఆగ్రో కెమికల్స్‌ కంపెనీ ర్యాలీస్‌ ఇండియా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2019-20) మూడో త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు ప్రకటించడంతో ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. దీంతో భారీ లాభాలతో కళకళలాడుతోంది. అయితే మరోపక్క ఇటీవల నేలచూపులతో కదులుతున్న ప్రయివేట్‌ రంగ సంస్థ యస్‌ బ్యాంక్‌ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. ఏజీఆర్‌ బకాయిలపై టెలికం కంపెనీలు దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను సుప్రీం కోర్టు తిరస్కరించిన నేపథ్యంలో టెలికం రుణాలు మొండిబకాయిలుగా మారే

మూడు దశాబ్దాల కనిష్టస్థాయికి చైనా వృద్ధి రేటు !

Friday 17th January 2020

బీజింగ్‌:  చైనా వృద్ధి రేటు మూడు దశాబ్దాల కనిష్టస్థాయికి చేరింది.  బలహీనమైన దేశీయ డిమాండ్‌తో పాటు, అమెరికాతో వాణిజ్య ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో చైనా జీడీపీ వృద్ధి రేటు కనిష్టస్థాయికి పడిపోయింది. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన చైనాలో  2019 సంవత్సరంలో 6.1 శాతం జి.డి.పి వృద్ధిరేటు నమోదైనట్లు చైనా అధికారిక నేషనల్‌ బ్యూరో ఆఫ్‌ స్టాస్టిక్స్‌ (ఎన్‌బీఎస్‌) వెల్లడించింది. ఎన్‌బీఎస్‌ కమిషనర్‌ నింగ్‌ జిజే దీనిపై స్పందిస్తూ... చైనా ఆర్థిక వ్యవస్థ

Most from this category