News


ఐపీవోలో షేర్లు అలాట్‌ అవడం లేదా..?

Sunday 23rd February 2020
Markets_main1582480869.png-32015

ఇటీవల వచ్చిన ఐఆర్‌సీటీసీ, ఉజ్జీవన్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకు, సీఎస్‌బీ బ్యాంకు ఐపీవోలు ఎన్నో రెట్లు అధికంగా సబ్‌స్క్రయిబ్‌ అయ్యాయి. ఎస్‌బీఐ ఐపీవో మార్చి 2న ప్రారంభం కానుంది. ఐపీవోలకు దరఖాస్తు చేసుకునే రిటైల్‌ ఇన్వెస్టర్లు సంఖ్య ఈ మధ్య కాలంలో బాగా పెరిగింది. దీంతో రిటైల్‌ ఇన్వెస్టర్ల కోటాకు డిమాండ్‌ పెరిగిపోయింది. ఫలితంగా అందరికీ షేర్లు అలాట్‌ అయ్యే పరిస్థితి ఉండడం లేదు. దీంతో అంతా మోసం అన్న అభిప్రాయం కొందరు ఇన్వెస్టర్లలో కలుగుతోంది. అధిక రెట్లు స్పందన వచ్చిన సందర్భాల్లో షేర్ల కేటాయింపునకు ఓ విధానం అంటూ ఉంది. కనుక ఐపీవోలో షేర్ల కేటాయింపు ప్రక్రియ గురించి తెలుసుకుందాం..

 

సెబీ నిబంధనల ప్రకారం ఐపీవోలో ఒక లాట్‌ విలువ రూ.10,000కు తగ్గకూడదు. రూ.15,000కు మించకూడదు. ఈ మధ్యలో ఏదో ఒక విలువకు సరిపడా లాట్‌ను నిర్ణయించుకోవచ్చు. ఉదాహరణకు ఐఆర్‌సీటీసీ ఐపీవోలో ఒక లాట్‌ను 40 షేర్లుగా ఖరారు చేశారు. షేరు ధరల శ్రేణిని రూ.315-320గా నిర్ణయించారు. గరిష్ట ధర ప్రకారం ఒక్కో లాట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ రూ.12,800 అవుతుంది. కనీసం ఒక ఇన్వెస్టర్‌కు ఒక లాట్‌ తక్కువ కాకుండా కేటాయించకూడదు. 

 

ఐఆర్‌సీటీసీ 2,01,60,000 షేర్లను ఆఫర్‌ చేసింది. ఇందులో 1,60,000 షేర్లను ఉద్యోగుల కోసం రిజర్వ్‌ చేశారు. పోను 2 కోట్ల షేర్లను క్వాలిఫైడ్‌ ఇనిస్టిట్యూషనల్‌ బయర్స్‌ (క్యూఐబీ), నాన్‌ ఇనిస్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్లు (ఎన్‌ఐఐ), రిటైల్‌ ఇండివిడ్యువల్‌ ఇన్వెస్టర్లు (ఆర్‌ఐఐ)లకు అందుబాటులో ఉంచారు. రిటైల్‌ ఇన్వెస్టర్లకు 35 శాతం కోటా ఉంటుంది. కనుక 70,00,000 షేర్లను వీరి కోసం కేటాయించారు. 

 

ఒక రిటైల్‌ ఇన్వెస్టర్‌ కనీసం ఒక లాట్‌ (40 షేర్లు) కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే, గరిష్టంగా 15 లాట్ల (రూ.2లక్షలకు మించకుండా) వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రిటైల్‌ ఇన్వెస్టర్లలో కొందరు రెండు లాట్లు, మూడు లాట్లు, 15 లాట్ల కోసం కూడా దరఖాస్తు చేసుకునే వారు ఉంటారు. రూ.315-320 ధరల శ్రేణిలో ఏ ధర అయినా నాకు సమ్మతమే అనుకునే వారు కటాఫ్‌ను ఎంచుకోవాలి. అలా కాకుండా రూ.316ను కోట్‌ చేశారనుకుంటే.. అప్పుడు ఐపీవో ఇష్యూ ధరను రూ.320గా ఖరారు చేస్తే, ఆ లోపు ధర కోట్‌ చేసిన అప్లికేషన్లు కేటాయింపు నుంచి బయటకు వెళ్లిపోయినట్టే.

 

రిటైల్‌ కోటాలో అందుబాటులో ఉన్న షేర్లకు సరిపడా లేదా తక్కువ షేర్ల కోసం దరఖాస్తులు వస్తే, అప్పుడు ప్రతీ దరఖాస్తుదారుడికి షేర్లు అలాట్‌ అవుతాయి. ఒకవేళ అధిక షేర్ల కోసం దరఖాస్తు వస్తే..?  అప్పుడు ఒక దరఖాస్తుకు కనీసం ఒక లాట్‌ను కేటాయించేందుకు రిజిస్ట్రార్‌ ప్రయత్నం చేస్తారు. ఐఆర్‌సీటీసీ రిటైల్‌ కోటా 70 లక్షల షేర్లను ఒక్కో లాట్‌ 40 షేర్లతో భాగిస్తే అప్పుడు గరిష్టంగా 175,000 దరఖాస్తులకు ఒక్కో లాట్‌ చొప్పున కేటాయించొచ్చు. కానీ, స్పందన ఇంతకంటేటే ఎక్కువగానే వచ్చింది కనుక.. కంప్యూటర్‌ ర్యాండమ్‌గా 1,75,000 దరఖాస్తులను ఎంపిక చేసింది. అప్పుడు ఒక్కో అప్లికేషన్‌కు ఒక లాట్‌ చొప్పున కేటాయించడం జరిగింది.You may be interested

ఈ వారంలోనూ అస్థిరతలు కొనసాగొచ్చు..

Monday 24th February 2020

ఎఫ్‌అండ్‌వో ఎక్స్‌పైరీ ట్రంప్‌ పర్యటనల ప్రభావం ఈ వారం మార్కెట్‌పై అంచనాలు న్యూఢిల్లీ: డెరివేటివ్స్‌ (ఎఫ్‌అండ్‌వో) ఫిబ్రవరి సిరీస్‌ ఈ వారంలోనే ముగియనుండడంతో మార్కెట్లో అస్థిరతలు ఉంటాయని విశ్లేషకుల అంచనా. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ 24, 25వ తేదీల్లో భారత్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రక్షణ రంగానికి సంబంధించి ఒప్పందాలకు అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ఈ సమయంలో కుదిరే డీల్స్‌ కూడా మార్కెట్‌పై ప్రభావం చూపించనున్నాయి. శుక్రవారం విడుదల అయ్యే జీడీపీ అంచనాలు,

బ్యాంకుల మెగా విలీనం ఆలస్యం..!

Sunday 23rd February 2020

ప్రభుత్వరంగంలో మలివిడతగా జరగాల్సిన బ్యాంకుల మెగా విలీనం ఆలస్యమయ్యేట్టు కనిపిస్తోంది. ఎందుకంటే బ్యాంకుల విలీనం వల్ల ఒనగూరే ప్రయోజనాలు ఏ మేరకు.. ఎన్‌పీఏలు ఏ స్థాయిలో ఉంటాయి, నిధుల అవసరాలు ఏ మేరకు, రుణ వృద్ధి, వ్యయ నియంత్రణలు ఏ మేరకు, మూసివేయనున్న శాఖలు ఇత్యాది వివరాలను ఇవ్వాలని ప్రధానమంత్రి కార్యాలయం ఆర్థిక శాఖను తాజాగా కోరింది. విలీనానికి కేంద్ర కేబినెట్‌ ఆమోదముద్ర వేయాల్సి ఉంది. ఆ తర్వాత ఆయా

Most from this category