News


నా పెట్టుబడుల విలువ కూడా పడిపోయింది...: విజయ్‌ కేడియా

Friday 9th August 2019
Markets_main1565289062.png-27647

తన పెట్టుబడుల విలువ కూడా ప్రస్తుత మార్కెట్‌ పతనంలో పడిపోయిందని, నిజం చెప్పాలంటే తాను ఏమాత్రం ఆందోళన చెందడం లేదని ప్రముఖ బడా ఇన్వెస్టర్‌ విజయ్‌ కేడియా తెలిపారు. అవి టర్న్‌ అరౌండ్‌ అవుతాయన్న నమ్మకం తనకు ఉందన్నారు. తాను ఇన్వెస్ట్‌ చేసిన కంపెనీలు అన్నీ చక్కటి నిర్వహణతో కూడినవని, రుణాల విషయంలోనూ సౌకర్యంగానే ఉన్నాయని, మార్కెట్‌ ధోరణలు, టెక్నాలజీలను తట్టుకుని నిలదొక్కుకోగలవని విజయ్‌ కేడియా పేర్కొన్నారు. కేడియా సెక్యూరిటీస్‌ ఎండీగానూ విజయ్‌ కేడియా మార్కెట్‌కు, ఇన్వెస్టర్లకు సుపరిచుతులు. పలు అంశాలపై ఆయన వెల్లడించిన అభిప్రాయాలు...

 

‘చౌకగా కనిపిస్తున్నది సురక్షితం కాదు, సురక్షితంగా కనిపిస్తున్నది చౌక కాదు’..?
నిజమే. ఈ విషయంలో అతిపెద్ద బాధితులు చిన్న ఇన్వెస్టర్లే. ముఖ్యంగా గత మూడు నాలుగేళ్లలో మార్కెట్లోకి అడుగు పెట్టిన వారు. ఈ తరహా సంక్షోభాన్ని వారి జీవితంలో చూసి ఉండరు. కానీ, స్టాక్‌ మార్కెట్‌లో వాస్తవం ఇలానే ఉంటుంది. నాలుగు రకాల మార్కెట్‌ విలువలు ఉన్నాయి. లార్జ్‌క్యాప్‌, మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌, జంక్‌ (పనికిమాలిన) క్యాప్‌. 90 శాతం స్టాక్‌లు చివరి కేటగిరీలోకే వస్తాయి. దురదృష్టవశాత్తూ 90 శాతం మంది కొత్త ఇన్వెస్టర్లు ఈ విభాగంలో (జంక్‌)నే ఇన్వెస్ట్‌ చేస్తున్నారు. ఈ తరహా మార్కెట్లో ఐదారు స్టాక్స్‌ మినహా మిగిలినవి వాటి గరిష్టాల నుంచి 30-50 శాతం మధ్య పతనం అయితే, జంక్‌ క్యాప్‌ స్టాక్స్‌ 90 శాతం వరకు పతనవుతాయి. మళ్లీ ఇవి తిరిగి కోలుకోవు. వాటి గేమ్‌ ముగిసినట్టే. 

 

ఈ ఏడాది దీర్ఘకాలిక పెట్టుబడులకు అనుకూలమా..?
నేను పూర్తిగా ఇన్వెస్ట్‌ చేసి ఉన్నాను. నా పెట్టుబడుల విలువ కూడా పడిపోయింది. కానీ నేను ఆశాభావంతోనే ఉన్నాను. అన్ని షేర్లను అలానే కొనసాగిస్తాను. అవి టర్న్‌ అరౌండ్‌ అవుతాయి. ఎందుకంటే చక్కటి నిర్వహణతో కూడినవి. ఎటువంటి సవాళ్లను అయినా తట్టుకుని నిలబడేవి. గుర్తుంచుకోవాల్సినది ఏమిటంటే ఇదేమీ మొదటి సారి చోటుచేసుకున్నది కాదు (మార్కెట్‌ పతనం). ఈ తరహా సంక్షోభాల నుంచి మార్కెట్లు తప్పకుండా కోలుకుంటాయి. కాకపోతే సమయం ఎప్పటిలోగా అన్నదానిపై ఇప్పటికి స్పష్టత లేదు. ఇండెక్స్‌ ఇంకా పడిపోవచ్చు. లేదా రికవరీకి సమయం తీసుకోవచ్చు. కానీ నేను ఇండెక్స్‌లో ఇన్వెస్ట్‌ చేయను. స్టాక్‌ మార్కెట్లో విజయం సాధించాలంటే మొదటి సూత్రం ఆశావహంగా ఉండడమే. 

 

మార్కెట్లు పడిపోతున్నప్పుడు ఏం చేయాలి...?
పెట్టుబడుల సిద్ధాంతం మారదు. కాకపోతే మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మార్చుకోవచ్చు. స్మైల్‌ అన్న నా సిద్ధాంతాన్ని నేను కచ్చితంగా ఫాలో అవుతాను. 



You may be interested

ఎఫ్‌ఐఐల ప్రభావం..బలపడిన రూపీ

Friday 9th August 2019

రూపీ డాలర్‌ మారకంలో శుక్రవారం 14 పైసలు బలపడి 70.55 వద్ద ప్రారంభమైంది. ప్రభుత్వం విదేశి పోర్టుపోలియో ఇన్వెస్ట్‌మెంట్లను(ఎఫ్‌పీఐ) సూపర్‌ రిచ్‌ ట్యాక్స్‌ నుంచి మినహాయించనుందనే నేపథ్యంలో గత సెషన్లో దేశియ ఈక్విటీ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. ఫలితంగా  గత సెషన్‌లో  రూపీ డాలర్‌ మారకంలో ఐదు రోజుల వరుస నష్టాలకు బ్రేక్‌ వేసి, 20 పైసలు బలపడి, 70.69 వద్ద ముగిసింది. గత సెషన్‌లో 70.80 వద్ద పాజిటివ్‌గా

మిడ్‌క్యాప్‌లో రాబడులకు కోటక్‌ పోర్ట్‌ఫోలియో

Thursday 8th August 2019

ఆర్‌బీఐ తాజాగా 35 బేసిస్‌ పాయింట్ల మేర రేట్ల కోత నిర్ణయం తీసుకోవడం మార్కెట్లకు రుచించలేదు కానీ, ఎఫ్‌పీఐలపై సర్‌చార్జీ మినహాయింపు, దీర్ఘకాలిక మూలధన లాభాలపై పన్ను మినహాయింపు ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తుందున్న వార్తలు గురువారం స్టాక్‌ సూచీలను పరుగులు తీయించాయి. అయితే, మార్కెట్లు ఇప్పటికప్పుడు తిరిగి గాడిన పడి ర్యాలీ చేస్తాయన్న అభిప్రాయం ఏ ఒక్క విశ్లేషకుని మాటల్లోనూ కనిపించడం లేదు. కాకపోతే దీర్ఘకాలం పాటు ఓపిక

Most from this category