STOCKS

News


అజంతా ఫార్మా- శ్రీరామ్‌ సిటీ.. భలే జోరు

Thursday 6th February 2020
Markets_main1580979306.png-31566

8 శాతం జంప్‌చేసిన అజంతా ఫార్మా
శ్రీరామ్‌ ట్రాన్స్‌పోర్ట్‌కు బయ్‌ రేటింగ్‌

విదేశీ ప్రోత్సాహంతో హుషారుగా ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్లు లాభాలతో కదులుతున్నాయి. మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో సెన్సెక్స్‌ 117 పాయింట్లు పెరిగి 41,260కు చేరగా.. నిఫ్టీ 32 పాయింట్లు బలపడి 12,121 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2019-20) మూడో త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించిన శ్రీరామ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఫైనాన్స్‌ కౌంటర్‌ ర్యాలీ బాటలో సాగుతోంది. మరోవైపు ఈ ఆర్థిక సంవత్సరం క్యూ3(అక్టోబర్‌-డిసెంబర్‌)లో పటిష్ట ఫలితాలు ప్రకటించడంతో హెల్త్‌కేర్‌ రంగ కంపెనీ అజంతా ఫార్మా లిమిటెడ్‌ కౌంటర్‌కు సైతం డిమాండ్‌ పెరిగింది. వెరసి శ్రీరామ్‌ ట్రాన్స్‌పోర్ట్‌, అజంతా ఫార్మా షేర్లు భారీ లాభాలతో దూకుడు చూపుతున్నాయి. వివరాలు చూద్దాం..

అజంతా ఫార్మా లిమిటెడ్‌
ఈ ఆర్థిక సంవత్సరం క్యూ3(అక్టోబర్‌-డిసెంబర్‌)లో అజంతా ఫార్మా నికర లాభం 61 శాతం జంప్‌చేసి రూ. 108 కోట్లకు చేరింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన నికర అమ్మకాలు సైతం 34 శాతం పెరిగి రూ. 651 కోట్లను అధిగమిం‍చాయి. పన్నుకు ముందు లాభం 88 శాతం ఎగసి రూ. 175 కోట్లను తాకింది. దేశీ అమ్మకాలు 12 శాతం పుంజుకుని రూ. 195 కోట్లకు చేరినట్లు కంపెనీ పేర్కొంది. ఈ  నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో అజంతా ఫార్మా షేరు 8 శాతం దూసుకెళ్లి రూ. 1293 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 1328 వరకూ ఎగసింది. ఇది సరికొత్త గరిష్టంకావడం విశేషం!

శ్రీరామ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఫైనాన్స్‌ కంపెనీ
ఎన్‌బీఎఫ్‌సీ.. శ్రీరామ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఫైనాన్స్‌ కంపెనీ షేరుకి తాజాగా విదేశీ రీసెర్చ్‌ సంస్థ హెచ్‌ఎస్‌బీసీ బయ్‌ రేటింగ్‌ను కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ కౌంటర్‌కు గతంలో ఇచ్చిన టార్గెట్‌ ధరను రూ. 1450 నుంచి రూ. 1500కు పెంచుతున్నట్లు తెలియజేసింది. ఈ ఆర్థిక సంవత్సరం క్యూ3(అక్టోబర్‌-డిసెంబర్‌)లో డిమాండ్‌ మందగించినప్పటికీ పటిష్ట ఫలితాలు సాధించడంతో శ్రీరామ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఫైనాన్స్‌ కౌంటర్‌ రేటింగ్‌ను కొనసాగిస్తున్నట్లు పేర్కొంది. రానున్న రెండేళ్లలో సగటున కంపెనీ ఆర్జన 5 శాతం పెరగవచ్చని తాజాగా అంచనా వేసింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో శ్రీరామ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ షేరు 5.3 శాతం జంప్‌చేసి రూ. 1993 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో గరిష్టంగా రూ. 1234ను సైతం అధిగమించింది.



You may be interested

ఎఫ్‌పీఐ పరిమితి పెంపుతో పీఎస్‌యూలకే లాభం!

Thursday 6th February 2020

కార్పొరేట్‌ బాండ్స్‌లో పెరగనున్న విదేశీ పెట్టుబడులు కార్పొరేట్‌ బాండ్స్‌లో ఎఫ్‌పీఐల పరిమితి పెంచుతూ కేంద్రం తీసుకున్న నిర్ణయం పీఎస్‌యూ కంపెనీలకు మేలు చేయవచ్చని నిపుణులు భావిస్తున్నారు. పీఎస్‌యూ కంపెనీలతో పాటు ఏఏఏ రేటింగ్‌ ఉన్న కంపెనీలు కూడా ఈ నిర్ణయంతో మేలు పొందుతాయంటున్నారు. అయితే ఈ ప్రభావం తక్షణమే ఉండకపోవచ్చన్నారు. కార్పొరేట్‌ బాండ్స్‌లో ఎఫ్‌పీఐల వాటా పరిమితిని 9 శాతం నుంచి 15 శాతానికి పెంచుతూ కేంద్రం బడ్జెట్లో నిర్ణయం తీసుకుంది.

52 వారాల గరిష్టానికి 52 షేర్లు

Thursday 6th February 2020

గురువారం స్టాక్‌మార్కెట్‌లో 52 వారాల గరిష్టానికి 52 షేర్లు ర్యాలీ చేశాయి. 52 వారాల గరిష్టానికి చేరిన షేర్లలో అదానీ ఎంటర్‌ ప్రైజెస్‌, ఏజీసీ నెట్‌వర్క్‌, అజంతా ఫార్మా, అల్కైల్‌ ఎమైన్స్‌ కెమికల్స్‌, అర్మాన్‌ ఫైనాన్సియల్‌ సర్వీసెస్‌, అతుల్‌, బజాజ్‌ ఫైనాన్స్‌స్‌, భారతీ ఎయిర్‌టెల్‌, సెంట్రల్‌ డిపాజిటరీ సర్వీసెస్‌, సరెబ్రా ఇంటిగ్రేటెడ్‌ టెక్నాలజీస్‌, చోళమండలమ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ ఫైనాన్స్‌ కంపెనీ, డాబర్‌ ఇండియా, దివీస్‌ లేబొరేటరీస్‌, ఎవెన్యూ సూపర్‌మార్ట్స్‌, ఎడిల్వీజ్‌

Most from this category