News


ఐడియా, ఎయిర్‌టెల్‌ షేర్ల ర్యాలీ!

Tuesday 19th November 2019
Markets_main1574136302.png-29695

టెలికాం దిగ్గజ కంపెనీలైనా వొడాఫోన్‌-ఐడియా, భారతీ ఎయిర్‌టెల్‌ డిసెంబర్‌ 1 వ తేది నుంచి కాల్‌చార్జీలను పెంచాలని నిర్ణయించాయి. కాగా ఈ నిర్ణయంతో ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌-ఐడియా షేరు మంగళవారం సెషన్‌లో పాజిటివ్‌గా ట్రేడవుతున్నాయి. భారతీ ఎయిర్‌టెల్‌ ఉదయం 9.38 సమయానికి 5 శాతం లాభపడి రూ. 431 వద్ద ట్రేడవుతోంది. గత సెషన్‌లో రూ. 409.20 వద్ద ముగిసిన ఈ షేరు, మంగళవారం సెషన్‌ ప్రారంభంలో 4.5 శాతం పెరిగి రూ. 428 వద్ద ఏడాది గరిష్ఠాన్ని తాకింది. 
  అదేవిధంగా వొడాఫోన్‌-ఐడియా షేర్లు కూడా మంగళవారం సెషన్‌లో ర్యాలీ చేస్తున్నాయి. గత సెషన్‌లో రూ. 4.45 వద్ద ముగిసిన ఈ షేరు, మంగళవారం ఉదయం 9.22 సమయానికి 15.73 శాతం లాభపడి రూ. 5.15 వద్ద ట్రేడవుతోంది. 



You may be interested

రూ.20వేల కోట్ల సమీకరణకు ఐసీఐసీఐ బ్యాంకు సన్నాహాలు

Tuesday 19th November 2019

సంస్థాగత ఇన్వెస్టర్లకు సుమారు 6-7 శాతం వాటా విక్రయించడం ద్వారా రూ.20వేల కోట్లను సమీకరించాలని ఐసీఐసీఐ బ్యాంకు యోచిస్తోంది. ఈ మేరకు దాదాపు 10 ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకులను ఐసీఐసీఐ సంప్రదించిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఒక్క విడతలో అమ్మకం మొత్తం పూర్తి చేయాలని బ్యాంకు భావిస్తోంది. ఇందుకు విధివిధానాలను త్వరలో నిర్ధేశించుకోనుందని సదరు వర్గాలు తెలిపాయి. బ్యాంకు యోచన నిజమైతే దేశీయ కార్పొరేట్‌ చరిత్రలో అతిపెద్ద క్యాపిటల్‌ సమీకరణ కానుందని

ఆభరణాలపై పెరిగిన డ్యూటీ డ్రాబ్యాక్‌

Tuesday 19th November 2019

న్యూఢిల్లీ: బంగారు, వెండి ఆభరణాలపై ప్రభుత్వం డ్యూటీ డ్రాబ్యాక్‌ను పెంచింది. బంగారు ఆభరణాలపై గ్రాముకు రూ. 372.9గా నిర్ణయించింది. అంతక్రితం ఈ రేటు రూ.272 వద్ద ఉంది. గతంలో రూ. 3,254 వద్ద ఉన్న కిలో వెండి పై డ్యూటీని రూ. 4,332.2 వద్దకు పెంచినట్లు ప్రకటించింది. సవరించిన రేట్లు నవంబర్‌ 16 (శనివారం) నుంచి అమల్లోకి వచ్చినట్లు తెలియజేసింది. అంతర్జాతీయ మార్కెట్లో ఈ పరిశ్రమ పోటీని ఇచ్చేందుకు ప్రభుత్వం

Most from this category