News


టెల్కోలకు సుప్రీం కోర్టు షాక్‌..!

Thursday 24th October 2019
Markets_main1571911866.png-29116

టెలికమ్యూనికేషన్ విభాగం నిర్దేశించిన విధంగా అడ్జెస్టెట్‌ గ్రాస్‌ రెవెన్యూ (ఏజీఆర్‌) నిర్వచనాన్ని సమర్థిస్తూ సుప్రీంకోర్టు తీర్పునివ్వడంతో గురువారం ట్రేడింగ్‌లో టెలికాం కంపెనీల (టెల్కోలు) షేర్లు భారీ నష్టాన్ని చవిచూశాయి. స్పెక్ట్రమ్‌ వినియోగ ఛార్జీలు, ఇతర టెలికాం సంబంధిత ఆదాయాల ద్వారా సమకూరిన స్థూల ఆదాయం నుంచి కొంత శాతం టెలికాం కంపెనీలు...టెలికాం శాఖకు చెల్లించాలన్న వివాదం 14 సంవత్సరాలుగా కోర్టుల్లో నలుగుతోంది. కొన్ని సేవలపైనే వచ్చే ఆదాయాన్ని ఏజీఆర్‌గా పేర్కొంటూ వాటిపైనే లెవీలు చెల్లిస్తామంటూ టెలికాం కంపెనీలు, అన్ని సేవల ద్వారా వచ్చే ఆదాయం ఏజీఆర్‌ కిందకు వస్తుందంటూ టెలికాం శాఖ ఏజీఆర్‌ను నిర్వచిస్తూ వివాదాన్ని రాజేసాయి. ఇందుకు సంబంధించి టెలీ కంపెనీలు లేవనెత్తిన సమస్యలను ‘పనికిరానివని’ సుప్రీంకోర్టు పేర్కొంటూ, ఏజీఆర్‌ లేవీల కింద ఇప్పటివరకూ టెల్కోలు బకాయి వున్న మొత్తమే కాకుండా  వడ్డీతో సహా ఆలస్యం చెల్లింపులపై జరిమానాలు కూడా చెల్లించాల్సి ఉంటుందని అత్యున్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది. టెలికాం ఆపరేటర్లకు వచ్చే ఆదాయాలన్నీ ఏజీఆర్‌గా కిందకు వస్తాయని, అలాగే టెర్మినేషన్‌ ఫీజు, రోమింగ్ ఛార్జీల ద్వారా పొందిన ఆదాయాలు కూడా ఏజీఆర్‌ కిందకు వస్తాయని అపెక్స్‌ కోర్టు తెలిపింది. దీంతో ఏజీఆర్‌  ఫీజుపై మొబైల్‌ ఆపరేటర్లు, ప్రభుత్వానికి మధ్య సాగిన 14ఏళ్ల న్యాయ పోరాటం ముగిసినట్లైంది. సుప్రీం కోర్టు తాజా తీర్పుతో టెలికాం కంపెనీలు ప్రభుత్వానికి రూ .92,642 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది, అందులో సగానికి పైగా ఎయిర్‌టెల్, వొడాఫోన్ చెల్లించాల్సి ఉంది. డాట్‌ లెక్కల ప్రకారం భారతి ఎయిర్‌టెల్ రూ. 21,682 కోట్లు, వోడాఫోన్ ఐడియా రూ. 28,309 కోట్లు, ఎమ్​టీఎన్​ఎల్​ రూ. 2537 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. 
అడ్జెస్టెట్‌ గ్రాస్‌ రెవెన్యూ అంటే:- 
డాట్‌ నిబంధనల ప్రకారం టెలికాం కంపెనీలు సంపాదించిన అన్ని ఆదాయాల ఆధారంగా లెవీలు లెక్కించబడతాయి. నాన్‌-టెలికాం సంబంధిత వనరులైన డిపాజిట్ వడ్డీలు, ఆస్తి అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయాలు కూడా లెక్కించబడతాయి. 

టెలికాం షేర్ల పతనం...అపై రికవరీ
సుప్రీం కోర్టు తీర్పు గురువారం మధ్యాహ్నం వెలువడగానే టెలికాం రంగ షేర్లు భారీగా నష్టపోయాయి. ఇంట్రాడేలో భారతీ ఎయిర్‌టెల్‌ 5 శాతం, వోడాఫోన్‌ ఐడియా షేర్లు 20 శాతం చొప్పున నష్టపోయాయి. అయితే కనిష్టస్థాయి వద్ద కొనుగోళ్ల మద్దతు లభించడంతో  మార్కెట్‌ ముగిసే సరికి ఎయిర్‌టెల్‌ షేర్లు కోలుకుని 3శాతం లాభంతో ముగిసింది. వోడాఫోన్‌ఐడియా మాత్రం 23 శాతం నష్టంతో 4.35 వద్ద ముగిసింది. మరోవైపు టెలికాం ఇన్‌ఫ్రా కంపెనీ ఇన్‌ఫ్రాటెల్‌ 8 శాతం పతనమయ్యింది. కొత్తగా టెలికాం రంగంలో ప్రవేశించిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌పై సుప్రీం తీర్పు ప్రభావం పెద్దగా లేనందున ఈ షేరు సైతం 3 శాతం ర్యాలీ జరిపింది. You may be interested

డిసెంబర్‌కల్లా కొత్త గరిష్ఠాలకు సూచీలు

Thursday 24th October 2019

  భారీగా పడిపోయిన దేశీయ మార్కెట్లు తిరిగి పుంజుకుంటున్నాయని, కానీ దిగువ స్థాయిల వద్ద మందగమనం కొనసాగుతుండడంతో మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ స్టాకులు, లార్జ్‌ క్యాప్‌లను మించి ప్రదర్శన చేస్తాయని ఆశించడం మరీ దూకుడైన ఆలోచనవుతుందని సామ్కో సెక్యురిటీస్‌​ వ్యవస్థాపకుడు, సీఈఓ జిమిత్‌ మోదీ ఓ ఆంగ్ల చానెల్‌కిచ్చిన ఇంటర్యూలో అన్నారు. వ్యవస్థలో వినియోగం పుంజుకుంటుందని, కార్పోరేట్‌ ట్యాక్స్‌ తగ్గింపు చర్య వలన కంపెనీల మూల ధన వ్యయం పెరుగుతుందని

నిఫ్టీ మునుముందుకే!

Thursday 24th October 2019

రాకేశ్‌ ఝన్‌ఝన్‌వాలా అంచనా ప్రస్తుత మార్కెట్‌ గమనం చూస్తే నిఫ్టీ వెనక్కు రావడం కన్నా, ముందుకు కొనసాగేందుకే ఇష్టపడుతుందని ప్రముఖ ఇన్వెస్టర్‌ రాకేశ్‌ ఝన్‌ఝన్‌వాలా అభిప్రాయపడ్డారు. నిఫ్టీ ముందు 12వేల పాయింట్లను చేరవచ్చన్నారు. మార్కెట్లో పరిస్థితులు అంతా అనుకునేంత అధ్వాన్నంగా ఏమీలేవన్నారు. ప్రస్తుత బలహీనదశ క్రమంగా ముగిసిపోతుందన్నారు. నిఫ్టీ కార్పొరేట్‌ టాక్స్‌ కట్‌ అనంతరం రెండ్రోజుల్లో దాదాపు వెయ్యిపాయింట్ల ర్యాలీ చేసిందని, సూచీలు ఈ ర్యాలీని జీర్ణించుకోవాలని, అందుకే కన్సాలిడేషన్‌ జరుగుతోందని

Most from this category