News


ఎయిర్‌టెల్‌ 7 శాతం అప్‌!

Monday 30th September 2019
Markets_main1569839712.png-28631

రానున్న మూడు క్వార్టర్‌లలో టెలికం మార్కెట్లో తమ ఆదాయ వాటాను 35శాతానికి పెంచుకునేందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నామని భారతీ ఎయిర్‌టెల్‌ ఇండియా, దక్షిణాసియా సీఈఓ గోపాల్‌ విట్టాల్‌ సోమవారం అన్నారు. అంతేకాకుండా ప్రత్యర్థి కంపెనీలైన రిలయన్స్‌ జియో, వోడాఫోన్‌ ఐడియా కంపెనీ బలహీనతలను ఉపయోగించుకుంటామని ఆయన తెలిపారు. ఫలితంగా సోమవారం ట్రేడింగ్‌లో భారతీ ఎయిర్‌టెల్‌ షేరు 6.93 శాతం లాభపడి రూ. 373.30 వద్ద ముగిసింది. కాగా గత సెషన్‌లో రూ. 349.10 వద్ద ముగిసిన ఈ షేరు, రూ. 353.00 వద్ద ప్రారంభమై, రూ. 374.90 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని తాకింది. 
 ప్రస్తుతం టెలికాం ఎయిర్‌టెల్‌ రెవిన్యూ వాటా 30 శాతంగా ఉండడం గమనార్హం. You may be interested

పీఎంసీ స్కామ్‌.. 2008లోనే బీజాలు!!

Monday 30th September 2019

పంజాబ్‌ మహరాష్ట్ర కోఆపరేటివ్‌ బ్యాంక్‌(పీఎంసీ)లో తాజాగా వెలుగు చూసిన కుంభకోణం ఆర్‌బీఐ ఊహించినదానికన్నా చాలా లోతైనదని నిపుణులు విశ్లేషిస్తున్నారు. దీనికి బీజాలు 2008లోనే పడ్డాయని చెబుతున్నారు. ఆ సమయంలో హెచ్‌డీఐఎల్‌ను ఆదుకునేందుకు బ్యాంకు అధికారులే పలు అకౌంట్లను సృష్టించారని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు వెల్లడించినట్లు ఎకనమిక్‌ టైమ్స్‌ తెలిపింది. బ్యాంకు మొత్తం రుణాల్లో దాదాపు 73 శాతం రుణాలను కేవలం ఒక్క కంపెనీ(హెచ్‌డీఐఎల్‌)కు మంజూరు చేయడం బయటపడడంతో

11500 దిగువన ముగిసిన నిఫ్టీ

Monday 30th September 2019

ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు రెండో త్రైమాసిక చివరి రోజును మార్కెట్‌ నష్టాలతో ముగించింది. ఇన్వెస్టర్ల అప్రమత్తతతో సెన్సెక్స్‌ 155 పాయింట్ల నష్టంతో 38,667.33 వద్ద, నిఫ్టీ 35 పాయింట్లను కోల్పోయి 11500 దిగువన 11,477.25 వద్ద స్థిరపడ్డాయి. రేపు సెప్టెంబర్‌ నెల వాహన గణాంకాలు వెల‍్లడి, ఎల్లుండి మహాత్మగాంధీ జయంతి సందర్భంగా సెలవు రోజు కావడం, గురు, శుక్రవారాల్లో ఆర్‌బీఐ ద్రవ్యపరపతి సమావేశంతో పాటు, వచ్చే వారంలో కంపెనీల క్యూ2

Most from this category