News


ఎయిర్‌టెల్‌ 6 శాతం జంప్‌..ఏడాది గరిష్ఠానికి షేరు

Monday 18th November 2019
Markets_main1574053069.png-29666

టెలికాం ఎజీఆర్‌ వివాదంపై ప్రభుత్వం సానుకూల చర్యను తీసుకుంటుందని అంచనాలు మార్కెట్‌ వర్గాలు ఉన్నాయి. ఒకవేళ ఏజీఆర్‌ బకాయిలన్నింటిని ప్రభుత్వం చెల్లించమని ఆదేశించినప్పటికి, టెలికాం కంపెనీలు కన్సాలిడేట్‌ అయ్యి, భారతీ ఎయిర్‌టెల్‌ లబ్దిపొందుతుందంటూ బ్రోకరేజిల రిపోర్టులు వెలువడటంతో భారతీ ఎయిర్‌టెల్‌ సోమవారం మరో 6 శాతం జంప్‌చేసింది. గత సెషన్లో 9 శాతం పైగా లాభపడి రూ. 393.05 వద్ద ముగిసిన ఈ షేరు, సోమవారం సెషన్‌లో కూడా అదే ర్యాలీని కొనసాగిస్తోంది. ఉదయం 10.35 గంటల సమయానికి 6 శాతం లాభపడి రూ. 417 వద్ద ట్రేడవుతోంది. గత కొన్ని నెలల నుంచి రూ. 400 స్థాయికి దగ్గరగా వచ్చి వెనుతిరిగిన ఎయిర్‌టెల్‌ షేరు, సోమవారం ర్యాలీ చేసి, రూ. 410 వద్ద ఏడాది గరిష్ఠాన్ని తాకింది. 



You may be interested

ఎఫ్‌ఐఐల టాప్‌ 5 షేర్లు!

Monday 18th November 2019

వాటాలు పెంచుకుంటూ వస్తున్న విదేశీ మదుపరులు కొన్ని నెలలుగా విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు దేశీయ ఈక్విటీల్లో కొనుగోళ్లు ఆరంభించారు. నవంబర్‌ 11 నాటికి దేశీయ ఈక్విటీల్లోకి నికర విదేశీ నిధులు రూ. 30000 కోట్లకు చేరాయి. ఈ నేపథ్యంలో విదేశీ ఫండ్స్‌ ఎక్కువ మక్కువ చూపుతున్న స్టాకులను పరిశీలించి వాటిలో కొన్ని పారామీటర్లకు అనుగుణంగా ఉన్న స్టాకులను వేరు చేయడం జరిగింది. ఎఫ్‌పీఐలు కనీసం ఏడాదిలో ఐదు శాతం వాటా పెంచుకోవడం,

వాటా విక్రయ వార్తలతో బీపీసీఎల్‌ 4శాతం ర్యాలీ

Monday 18th November 2019

కేంద్రం వాటా విక్రయ వార్తలతో ప్రభుత్వరంగ సంస్థ బీపీసీఎల్‌ షేరు సోమవారం బీఎస్‌ఈ ఎక్చ్సేంజీలో  2.50శాతానికి పైగా లాభంతో రూ.520.00 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఒక దశలో 4.50శాతం వరకు లాభపడి రూ.528.00 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. ఉదయం గం.9:45ని.లకు షేరు క్రితం ముగింపు(రూ505.90)తో పోలిస్తే 2.83శాతం లాభంతో రూ.520.20 వద్ద ట్రేడ్‌ అవుతోంది. షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.261.00, రూ.547.50లు నమోదయ్యాయి. వచ్చే మార్చికల్లా

Most from this category