STOCKS

News


నష్టాల మార్కెట్లో..పాజిటివ్‌గా ఎయిర్‌టెల్‌

Friday 2nd August 2019
Markets_main1564724966.png-27492

 ఈ ఏడాది జూన్‌ త్రైమాసిక ఫలితాలలో భారతీ ఎయిర్‌టెల్‌ నష్టం, అంచనాల కంటే అధికంగా నమోదయినప్పటికి సగటు వినియోగదారుని ఖర్చు(ఏపీఆర్‌యు) రూ.105(గత ఏడాది ఇదే త్రైమాసికంలో) నుంచి రూ. 129 కి పెరగడంతో శుక్రవారం ట్రేడింగ్‌లో ఈ కంపెనీ షేరు పాజిటివ్‌గా కదులుతోంది. మార్కెట్లు నష్టాల్లో ఉన్నప్పటికి ఈ కంపెనీ షేరు మాత్రం ఉదయం 10.55 సమయానికి 3.32 శాతం పెరిగి రూ.334.65 వద్ద ట్రేడవుతోంది. 

ఎయిర్‌టెల్‌ జూన్‌ త్రైమాసిక ఫలితాలు: జూన్ 30 తో ముగిసిన త్రైమాసికంలో రూ.2,866 కోట్ల నష్టాన్ని భారతీ ఎయిర్‌టెల్‌ నమోదు చేసింది. గత ఏడాది ఇదే కాలంలో రూ.97.30 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసిన విషయం గమనర్హం. ఈ కంపెనీ నష్టం రూ.966.80 కోట్లుగా నమోదవుతుందని మార్కెట్లు అంచనావేయగా, అంచనాలను మించి నష్టాన్ని ప్రకటించింది. ఏక కాల నష్టం గత ఏడాది ఇదే జూన్‌ త్రైమాసికంలో రూ. 362.10 కోట్లు ఉండగా, ఈ త్రైమాసికంలో రూ. 1,469.40 కోట్లుగా ఉన్నాయి. ఈ త్రైమాసికంలో యావరేజి రేట్‌ పెర్‌ యుజర్‌(ఏపీఆర్‌యు) రూ.129 గా నమోదయ్యింది. కాగా, గత ఏడాది ఇదే త్రైమాసికంలో ఈ రేటు రూ. 105. గత ఏడాది ఇదే కాలంలో రూ .19,898.90 కోట్లగా  ఉన్న మొత్తం ఆదాయం, ఈ క్యూ1 ఫలితాలలో 4.59 శాతం పెరిగి రూ.20,812.50 కోట్లకు చేరుకుంది.  జూన్ 30 నాటికి ఈ కంపెనీ 40.37 కోట్ల కస్టమర్లను కలిగి ఉంది. ఇది గత ఏడాది ఇదే త్రైమాసికం 45.66 కోట్ల కంటే  10.9 శాతం తక్కువ కావడం గమనర్హం. కన్సాలిడేటెడ్ ఎబిట్డా 24.20 శాతం పెరిగి రూ.8492.60 కోట్లకు చేరుకుంది. గత ఏడాది ఇదే కాలంలో ఇది రూ .6,837 కోట్లుగా ఉంది. ఎబిట్డా మార్జిన్ గత ఏడాది ఇదే త్రైమాసికంలో 34.5 శాతం నుంచి ఈ త్రైమాసికంలో 41 శాతానికి పెరిగింది. నెట్‌వర్క్ రీఫార్మింగ్, అప్‌గ్రేడేషన్ ప్రోగ్రామ్‌లో నిర్వహణ వ్యయాల కోసం రూ.142.70 కోట్లను ఖర్చు పెట్టడంతో నష్టాలోచ్చాయని కంపెనీ తెలిపింది.  అలాగే, ఎయిర్‌టెల్ ఆఫ్రికా పెట్టుబడిదారుల క్లచ్‌కు అందించిన ఆచార నష్టపరిహారాల బాధ్యతకు సంబంధించి రూ. 1,586.3 కోట్లను కేటాయించడం, దీని కోసం ఖర్చులు వంటి వాటి వలన నష్టాలొచ్చాయని వివరించింది.



You may be interested

ఇక దేశంలో బ్యాంక్‌ ఆఫ్‌ చైనా

Friday 2nd August 2019

ఆర్‌బీఐ అనుమతి ముంబై: దేశంలో మామూలు బ్యాంకింగ్‌ సేవలు ప్రారంభించడానికి బ్యాంక్‌ ఆఫ్‌ చైనాను రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) అనుమతి ఇచ్చింది. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌ తరహాలోనే దేశంలో బ్యాంకింగ్‌ సేవలు అందించడానికి బ్యాంక్‌ ఆఫ్‌ చైనాకు వీలు కలుగుతుంది. ఆర్‌బీఐ నిబంధనలకు కట్టుబడి పనిచేసే బ్యాంకుల జాబితా ఆర్‌బీఐ యాక్ట్‌, 1934 రెండవ షెడ్యూల్‌లో ఉంటుంది.

కాఫీ డే అప్పులు రూ. 5,200 కోట్లు!!

Friday 2nd August 2019

 ఏడాది వ్యవధిలోనే రెట్టింపు  75 శాతం పైగా ప్రమోటర్ షేర్లు తనఖాలోనే మిగతా గ్రూప్ సంస్థల రుణాలపైనా సందేహాలు కార్పొరేట్ వ్యవహారాల శాఖ ఫైలింగ్స్‌తో వెలుగులోకి న్యూఢిల్లీ: తీవ్ర ఆర్థిక ఒత్తిళ్లతో కేఫ్ కాఫీ డే వ్యవస్థాపకుడు వీజీ సిద్ధార్థ అకాల మరణం నేపథ్యంలో ఆయన గ్రూప్ సంస్థల రుణ భారం చర్చనీయాంశంగా మారింది. సిద్ధార్థతో పాటు ఆయనకు చెందిన పలు సంస్థలు ..  వివిధ ఆర్థిక సంస్థలు మొదలుకుని బ్యాంకుల దాకా చాలా చోట్ల

Most from this category