News


ఏడాది గరిష్ఠానికి భారతీ ఎయిర్‌టెల్‌

Monday 14th October 2019
Markets_main1571046540.png-28873

టెలికాం రంగంలో ప్రధాన కంపెనీగా ఉన్న రిలయన్స్‌ జియో, ఇతర నెట్‌వర్క్‌లకు చేసే వాయిస్‌ (ఐయూసీ) కాల్స్‌పై 6 పై./ని. చార్జ్‌ చేయడం ప్రారంభించింది. ఈ నిర్ణయం ఇదే రంగంలో ఉన్న పెద్ద కంపెనీ భారతీ ఎయిర్‌టెల్‌కు లాభం చేకూర్చే అవకాశం ఉందన్న అంచనాలు ఎయిర్టెల్ షేరుపై పాజిటివ్ ప్రభావం చూపాయి. భవిష్యత్ లో ఈ నిర్ణయం వలన ధరలను పెంచడంతో ఎయిర్‌టెల్‌కు ఒత్తిడి తగ్గవచ్చని, అందువల్ల కంపెనీ లాభాలు భారీగా పెరుగుతాయని మార్కెట్‌ వర్గాలు అంచనావేస్తున్నాయి. ఫలితంగా గత కొన్ని సెషన్ల నుంచి భారతీ ఎయిర్‌టెల్‌ షేరు ర్యాలీ చేస్తోంది. సోమవారం ట్రేడింగ్‌లో కూడా 3 శాతానికి పైగా ర్యాలీ చేసి ఏడాది గరిష్ఠాన్ని తాకింది.  మధ్యాహ్నాం 3.10 సమయానికి భారతీ ఎయిర్‌టెల్‌ 3.04 శాతం లాభపడి రూ. 394.55 వద్ద ట్రేడయింది. సెషన్ చివరకు షేరు రూ. 392.95 వద్ద ముగిసింది. గత సెషన్లో రూ. 382.90 వద్ద పాజిటివ్‌గా ముగిసిన ఈ షేరు, సోమవారం ట్రేడింగ్‌లో రూ. 384.45 వద్ద ప్రారంభమైంది. ఇంట్రాడేలో రూ. 396.75 వద్ద ఏడాది గరిష్ఠాన్ని తాకింది.



You may be interested

చివరి అరగంటలో అమ్మకాలు.. అయినా లాభాల ముగింపే..!

Monday 14th October 2019

చివరి అరగంటలో బ్యాంకింగ్‌ రంగ షేర్లలో నెలకొన్న అమ్మకాలతో సూచీలు ఇంట్రాడేలో ఆర్జించిన లాభాల్ని కోల్పోయి పరిమిత లాభంతో ముగిశాయి. సెన్సెక్స్‌ 87.39  పాయింట్ల లాభంతో 38,214.47 వద్ద, నిఫ్టీ 36.20 పాయింట్లు పెరిగి 11,341.20 వద్ద స్థిరపడింది. సూచీలకిది వరుసగా రెండో రోజూ లాభాల ముగింపు. జాతీయ, అంతర్జాతీయ సంకేతాలు సానుకూలంగా ఉండటం, అంతర్జాతీయంగా మడిచమురు ధరలు తగ్గముఖం పట్టడం, నేడు వెల్లడైన ద్రవ్యోల్బణ గణాంకాలు మార్కెట్‌ అంచనాలకు

ఝున్‌ఝున్‌వాలా, రాజివ్‌ ఖన్నా, ఆశీష్‌ కచోలియా భారీగా విక్రయించిన షేర్లివే!

Monday 14th October 2019

ఆర్థిక మందగమనంతో దేశీయ ఈక్విటీ మార్కెట్లు సెప్టెంబర్‌ క్యార్టర్‌లో నష్టపోయిన విషయం తెలిసిందే. సెప్టెంబర్‌ భారీ ర్యాలీని మినహాయిస్తే దేశీయ బెంచ్‌ మార్క్‌ సూచీలు జులై, అగష్టు నెలలో నష్టాలలోనే ముగిశాయి. ఫలితంగా రాకేష్‌ ఝున్‌ఝున్‌వాలా, ఆశిష్‌ కచోలియా, రాజీవ్‌ ఖన్నా వంటి సీనియర్‌ ఇన్వెస్టర్లు వివిధ కంపెనీలలోని తమ వాటాలను విక్రయించారు.   రాకేష్‌ ఝున్‌ఝున్‌వాలా విక్రయించిన షేర్లు..    సీనియర్‌ ఇన్వెస్టర్‌ రాకేష్‌ ఝున్‌ఝున్‌వాలా  సెప్టెంబర్‌ త్రైమాసికంలో నాలుగు కంపెనీలలో తన

Most from this category