STOCKS

News


ఈ షేర్లకు దూకుడెక్కువ!

Wednesday 22nd January 2020
Markets_main1579672236.png-31096

జాబితాలో భారతీ ఎయిర్‌టెల్‌
ఇండియామార్ట్‌ ఇంటర్‌మెష్‌

రెండు రోజుల వరస నష్టాలకు చెక్‌ పెడుతూ ప్రారంభంలోనే బౌన్స్‌బ్యాక్‌ అయిన దేశీ స్టాక్‌ మార్కెట్లు తదుపరి తిరిగి అమ్మకాల ఒత్తిడిలో పడ్డాయి. లాభాలను పోగొట్టుకోవడంతోపాటు.. నష్టాల బాట పట్టాయి. ఉదయం 10.30 ప్రాంతంలో సెన్సెక్స్‌ 90 పాయింట్లు క్షీణించి 41,234ను తాకగా.. నిఫ్టీ 32 పాయింట్లు తక్కువగా 12,138 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలోనూ ఇటీవల జోరు చూపుతున్న మొబైల్‌ రంగ దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్‌సహా ఆకర్షణీయ ఫలితాలు సాధించడంతో ఈకామర్స్‌ సేవల కంపెనీ ఇండియామార్ట్‌ ఇంటర్‌మెష్‌ కౌంటర్‌కు డిమాండ్‌ కనిపిస్తోంది. వెరసి భారతీ ఎయిర్‌టెల్‌ షేరు 12 ఏళ్ల గరిష్టానికి చేరగా.. ఇండియామార్ట్‌ ఇంటర్‌మెష్‌ సరికొత్త గరిష్టాన్ని తాకింది.  వివరాలు చూద్దాం..

భారతీ ఎయిర్‌టెల్‌
టెలికం శాఖ(డాట్‌) 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐలు)కు అనుమతించినట్లు వెలువడిన వార్తలు భారతీ ఎయిర్‌టెల్‌ కౌంటర్‌కు జోష్‌నిచ్చాయి. దీంతో ఎన్‌ఎస్‌ఈలో తొలుత ఈ షేరు 2.2 శాతం పుంజుకుని రూ. 524 సమీపానికి చేరింది. తద్వారా 12 ఏళ్ల గరిష్టాన్ని తాకింది. 2007 అక్టోబర్‌ 15 తదుపరి ఈ స్థాయికి చేరగా.. ప్రస్తుతం 0.2 శాతం నీరసించి రూ. 511 వద్ద ట్రేడవుతోంది. గతంలో అనుమతించిన 49 శాతం ఎఫ్‌డీఐ అనుమతిని తాజాగా డాట్‌ 100 శాతానికి పెంచినట్లు ఎయిర్‌టెల్‌ పేర్కొంది. కాగా.. ఏజీఆర్‌ బకాయిల చెల్లింపునకు నిధుల సమీకరణ, మార్కెట్‌ వాటాను పెంచుకోవడం వంటి సానుకూల వార్తలతో ఈ షేరు గత వారం 20 శాతం ర్యాలీ చేసిన విషయం విదితమే.

ఇండియామార్ట్‌ ఇంటర్‌మెష్‌
ఈకామర్స్‌ కంపెనీ ఇండియామార్ట్‌ ఇంటర్‌మెష్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. క్యూ3(అక్టోబర్‌-డిసెంబర్‌)లో రూ. 62 కోట్ల నికర లాభం ఆర్జించింది. దీనిలో రూ. 23 కోట్లమేర పన్ను లాభం కలసి ఉంది. కన్సాలిడేటెడ్‌ నిర్వహణ లాభం రూ. 44 కోట్లకు చేరగా.. మార్జిన్లు 21 శాతం నుంచి  26 శాతానికి బలపడ్డాయి. ఆదాయం సైతం 26 శాతం పెరిగి రూ. 649 కోట్లను తాకింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఇండియామార్ట్‌ ఇంటర్‌మెష్‌ షేరు 16 శాతం దూసుకెళ్లి రూ. 2423 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 2478 వరకూ ఎగసింది. గతేడాది జులైలో స్టాక్‌ ఎక్స్చేంజీలలో లిస్టయ్యాక ఈ కౌంటర్‌ 106 శాతం ర్యాలీ చేయడం విశేషం!



You may be interested

కోటక్‌పై అంచనాలు తగ్గించిన బ్రోకరేజ్‌లు

Wednesday 22nd January 2020

డిసెంబర్‌ త్రైమాసిక ఫలితాల అనంతరం కోటక్‌ మహీంద్రా బ్యాంకు ఎర్నింగ్స్‌ అంచనాలను బ్రోకరేజ్‌లు తగ్గించాయి. క్యు3లో బ్యాంకు నికర లాభం 24 శాతం పెరిగి రూ. 1596 కోట్లకు చేరింది. అయితే ఇది అనలిస్టుల అంచనాల కన్నా తక్కువ. బ్యాంకు ఈ త్రైమాసికంలో రూ. 444 కోట్ల ప్రొవిజన్లు కేటాయించింది. దీంతో బ్యాంకు షేరుపై బ్రోకరేజ్‌ల అంచనాలు తగ్గుముఖం పట్టాయి. ఫలితాల అనంతరం బ్యాంకు షేరు నెగిటివ్‌గా కొనసాగుతోంది. బ్యాంకు

నష్టాల్లో పసిడి

Wednesday 22nd January 2020

దేశీయ ఎంసీఎక్స్‌ మార్కెట్లో బుధవారం పసిడి ఫ్యూచర్ల ధర నష్టాల్లో ట్రేడ్‌ అవుతోంది. ఎంసీఎక్స్‌లో  ఫిబ్రవరి కాంటాక్టు 10గ్రాముల పసిడి ధర రూ.106లు నష్టంతో రూ.39805.00 కదలాడుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో పసిడికి డిమాండ్‌ తగ్గడం, నేడు ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌ మారకంలో రూపాయి విలువ బలపడటం తదితర అంశాలు పసిడి ప్యూచర్లకు డిమాండ్‌ను తగ్గించాయి. నిన్నరాత్రి ఎంసీఎక్స్‌ మార్కెట్‌ ముగిసే సరికి 10గ్రాముల పసిడి ధర రూ.39733 వద్ద స్థిరపడింది.  ‘‘వరల్డ్‌

Most from this category