News


ట్రావెల్‌ బ్యాన్‌ -ఎయిర్‌లైన్‌ షేర్లు కుదేల్‌

Thursday 12th March 2020
Markets_main1583997046.png-32431

20 శాతం కుప్పకూలిన స్పైస్‌జెట్‌
18 శాతం పతనమైన ఇంటర్‌గ్లోబ్‌
52 వారాల కనిష్టాన్ని తాకిన షేర్లు 

ప్రపంచ మహమ్మారి వ్యాధిగా ప్రకటితమైన కరోనా వైరస్‌ ప్రభావంతో అంతర్జాతీయ స్థాయిలో ఆర్థిక మందగమన పరిస్థితులు తలెత్తవచ్చన్న అంచనాలు అటు ఈక్విటీ మార్కెట్లతోపాటు.. ఇటు ముడిచమురు ధరలను సైతం దెబ్బతీస్తున్నాయి. దీంతో రక్షణాత్మక పెట్టుబడులుగా భావించే బంగారం, యూఎస్‌ ట్రెజరీ బాండ్లకు గిరాకీ పెరుగుతోంది. ఫలితంగా బాండ్ల ఈల్డ్స్‌ కనిష్టాలకు పడిపోతుంటే.. అమెరికాసహా పలు ఈక్విటీ మార్కెట్లు బేర్‌ ట్రెండ్‌లోకి ప్రవేశిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా యూరోపియన్‌ దేశాల నుంచి ప్రయాణాలను నిషేధిస్తూ అమెరికన్‌ ప్రెసిడెంట్‌ ట్రంప్‌ నిర్ణయం తీసుకున్నారు. యూరోపియన్‌ దేశాలలో ప్రబలంగా విస్తరించిన కరోనా అమెరికాలోనూ కాలు మోపడంతో ట్రంప్‌ తాజా నిషేధాన్ని ప్రకటించారు. కాగా.. ఇప్పటికే ఇరాన్‌, ఇటలీ, చైనా తదితర దేశాలు కరోనా ప్రభావానికిలోనుకాగా.. అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలు కలిగిన అమెరికా, యూరప్‌ దేశాలు సైతం నీరసించడంతో ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లలో ఆందోళనలు నెలకొన్నాయి. ప్రపంచ దేశాల మధ్య రాకపోకలు బంద్‌ అవుతున్న నేపథ్యంలో ఇప్పటికే అమెరికన్‌ ఎయిర్‌లైన్స్‌ కంపెనీల షేర్లు బోర్లా పడగా.. తాజాగా దేశీ కంపెనీలు సైతం పతన బాట పట్టాయి.

ఆంక్షల ఎఫెక్ట్‌
దేశీయంగానూ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే ప్రయాణికుల సంఖ్య తగ్గుతూ వస్తున్నట్లు పరిశ్రమవర్గాలు చెబుతున్నాయి. దేశీ ప్రభుత్వం సైతం టూరిస్ట్‌ వీసాలపై ఆంక్షలు విధిస్తున్నట్లు వెలువడిన వార్తలు ఎయిర్‌లైన్స్‌ కౌంటర్లపై ఒత్తిడిని పెంచుతున్నట్లు తెలియజేశాయి. కాగా.. ముడిచమురు ధరలు ఇటీవల పతనంకావడంతో గత వారం ఎయిర్‌లైన్స్‌సహా.. పెయింట్స్‌, టైర్లు, పాలిమర్స్‌ తదితర రంగాలలో ప్రోత్సాహకర వాతావరణం కనిపించినట్లు విశ్లేషకులు గుర్తు చేశారు. అయితే ప్రయాణాలపై నిషేధం కారణంగా చమురు లాభాలకు చిల్లు పడనున్నట్లు వ్యాఖ్యానిస్తున్నారు. వెరసి దేశీయంగా ఎయిర్‌లైన్స్‌ కౌంటర్లు అమ్మకాలతో పతనమైనట్లు తెలియజేశారు. 

పతన బాటలో
ఉదయం ట్రేడింగ్‌లో బీఎస్‌ఈలో చౌక ధరల విమానయాన సంస్థ స్పైస్‌జెట్‌ షేరు 20 శాతం కుప్పకూలింది. అంతా అమ్మేవాళ్లే తప్ప కొనుగోలుదారులు కరువుకావడంతో రూ. 48.30కు పడింది. ఇది 52 వారాల కనిష్టంకాగా.. మధ్యాహ్నం 12.30 ప్రాంతంలో కొంతమేర కోలుకుంది. 18 శాతం నష్టంతో రూ. 49 వద్ద ట్రేడవుతోంది. ఇక ఇండిగో బ్రాండు విమానయాన సేవల సంస్థ ఇంటర్‌గ్లోబ్‌ ఏవియేషన్‌ షేరు ఎన్‌ఎస్‌ఈలో మధ్యాహ్నం 12.30 ప్రాంతంలో 14 శాతం దిగజారింది. రూ. 997 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో 18 శాతంపైగా పడిపోయి రూ. 945ను తాకింది. ఇది 52 వారాల కనిష్టంకావడం గమనార్హం!You may be interested

మీ డిపాజిట్లు భద్రంగానే ఉన్నాయి!

Thursday 12th March 2020

ఆయా బ్యాంకుల్లో ఉన్న ఖాతాదారుల నగదు మొత్త భద్రంగానే ఉందని ప్రవేట్‌ బ్యాంకులు కస్టమర్లకు భరోసా ఇస్తున్నాయి. యస్‌బ్యాంక్‌ సంక్షోభం మిగాతా బ్యాంకులపై ఆటువ్యాధిలా వ్యాపిస్తుండడంతో సదరు బ్యాంకులన్నీ తమ పొజీషన్‌, బ్యాంకు స్థితిగతుల గురించి కస్టమర్లకు వివరిస్తున్నాయి. ఇందులో భాగంగా ఆర్‌బీఎల్‌, కర్ణాటక బ్యాంక్‌, సౌత్‌ఇండియన్‌ బ్యాంక్‌, కోటక్‌ మహీంద్రా, కరూర్‌ వైశ్యా, ఎస్‌బీఐలు ప్రత్యేకమైన కమ్యూకేషన్స్‌ ద్వారా బ్యాంకు ఫైనాన్సియల్‌ పరిస్థితి బాగానే ఉందని ఎటువంటి ఆందోళన

ఏడాది కనిష్టానికి 843 షేర్లు

Thursday 12th March 2020

గురువారం ఎన్‌ఎస్‌ఈలో 52 వారాల కనిష్టానికి 843 షేర్లు పతనమయ్యాయి. వాటిలో 20 మైక్రాన్స్‌, 21ఫస్ట్‌ సెంచురీ మేనేజ్‌మెంట్‌ సర్వీసెస్‌, 63 మూన్స్‌ టెక్నాలజీస్‌, ఏబీబీ ఇండియా, ఆదిత్యా బిర్లా క్యాపిటల్‌, ఆదిత్యా బిర్లా సన్‌లైఫ్‌ బ్యాంకింగ్‌ ఈటీఎఫ్‌, ఆదిత్య బిర్లా సన్‌ లైఫ్‌ నిఫ్టీ నెక్ట్స్‌ 50 ఈటీఎఫ్‌, ఏసీసీ, ఆదానీ గ్యాస్‌, ఆదాని పోర్ట్స్‌ అండ్‌ స్పెషల్‌ ఎకనమిక్‌ జోన్‌, ఆదానీ పవర్‌, ఆదానీ ట్రాన్స్‌మిషన్‌, ఏడీఎఫ్‌

Most from this category